విశ్వక్ (Vishwak Sen) స్థానంలో శర్వా (Sharwanand)!.. కథ వినిపించేందుకు రెడీ అవుతున్న అర్జున్ (Arjun Sarja)?

Updated on Nov 08, 2022 05:03 PM IST
విశ్వక్ (Vishwak Sen) స్థానంలో మరో హీరోను తీసుకుని తన ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించాలని దర్శక నటుడు అర్జున్ (Arjun Sarja) భావిస్తున్నారు
విశ్వక్ (Vishwak Sen) స్థానంలో మరో హీరోను తీసుకుని తన ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించాలని దర్శక నటుడు అర్జున్ (Arjun Sarja) భావిస్తున్నారు

సీనియర్ నటుడు అర్జున్ (Arjun Sarja) తన కూతురు ఐశ్వర్యను టాలీవుడ్‌కు పరిచయం చేయాలనుకున్నారు. స్వీయ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించేందుకు ఆయన ప్లాన్ చేశారు. హీరోగా విశ్వక్ సేన్‌ను ఓకే చేశారు. విశ్వక్ (Vishwak Sen) కూడా ఈ ప్రాజెక్టులో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తీరా సెట్స్ మీదకు వెళ్లాక సినిమా ఆగిపోయింది. అర్జున్, విశ్వక్ మధ్య విభేదాలు తలెత్తడమే అందుకు కారణం. విశ్వక్ కమిట్‌మెంట్ లేని నటుడని అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ తీవ్ర కామెంట్స్ చేశారు. ఆయనతో సినిమా తీసేది లేదని స్పష్టం చేశారు. 

విశ్వక్ సేన్ ఈ వివాదంపై కాస్త ఆలస్యంగా స్పందించారు. తనకు కమిట్‌మెంట్ లేదని లైట్ బాయ్ చెప్పినా సినీ పరిశ్రమ నుంచి వెళ్లిపోతానని ఆయన అన్నారు. కొత్త చిత్రం విషయంలో తన చేసిన సూచనలను అర్జున్ అస్సలు పట్టించుకోలేదని విశ్వక్ చెప్పారు. ఏం చెబితే అది చేయాలంటే తన చేతులను కట్టేశారన్నారు. కళ్లు మూసుకుని సంసారం చేయమన్నట్లు తన పరిస్థితి తయారైందన్నారు. అందుకే షూటింగ్‌కు రానని చెప్పానని విశ్వక్ పేర్కొన్నారు. నొప్పించి ఉంటే క్షమించాలని అర్జున్‌ను ఆయన కోరారు. 

శర్వానంద్ (Sharwanand) కొత్త ప్రాజెక్టులకు ఓకే చెప్పలేదని సమాచారం

ఇదిలాఉంటే.. విశ్వక్ సేన్ ప్రాజెక్టు నుంచి తొలగడంతో ఆయన స్థానంలో మరో హీరోను తీసుకునే పనిలో అర్జున్ ఉన్నారట. ఇప్పటికే ఒక కథానాయకుడ్ని ఆయన ఫైనలైజ్ చేశారని వార్తలు వస్తున్నాయి. తన సినిమాకు విశ్వక్ ప్లేస్‌లో శర్వానంద్ (Sharwanand) అయితే కరెక్ట్ అని అర్జున్ భావిస్తున్నారట. అతి త్వరలో శర్వాను కలసి కథను వినిపించేందుకు ఆయన సిద్ధమవుతున్నారని టాలీవుడ్ టాక్. ఒకవేళ శర్వానంద్‌కు స్క్రిప్ట్ నచ్చితే.. ఈ ప్రాజెక్టు సెట్స్ మీదకు వెళ్లేందుకు ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం శర్వా ఖాళీగా ఉన్నారని తెలుస్తోంది. ఆయన కొత్త ప్రాజెక్టులకు ఓకే చెప్పలేదని సమాచారం. మరి, విశ్వక్ ప్లేస్‌లో శర్వా వస్తారో లేదా అర్జున్ మరో హీరోను ఎంచుకుంటారో చూడాలి. 

Read more: పులులు అంటే నాకు చాలా ఇష్టం.. మా ఇంట్లో ఒక టైగర్‌ను పెంచుకోవాలనుకుంటున్నా: జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!