'వారిసు' (Varisu) నుంచి కీలక అప్డేట్.. నేడు ‘సోల్‌ ఆఫ్ వారసుడు’ (Soul Of Varasudu) సాంగ్ గ్లింప్స్‌ రిలీజ్!

Updated on Dec 20, 2022 12:57 PM IST
‘సోల్ ఆఫ్ వారసుడు’ (Soul Of Varasudu) అనే టైటిల్ కి తగ్గట్లే మంచి సోల్ ఫుల్ మ్యూజిక్ తో ప్రారంభమయిన ప్రోమో సాంగ్ చిత్ర గారి వాయిస్ తో బ్యూటిఫుల్ గా మారింది.
‘సోల్ ఆఫ్ వారసుడు’ (Soul Of Varasudu) అనే టైటిల్ కి తగ్గట్లే మంచి సోల్ ఫుల్ మ్యూజిక్ తో ప్రారంభమయిన ప్రోమో సాంగ్ చిత్ర గారి వాయిస్ తో బ్యూటిఫుల్ గా మారింది.

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ (Hero Vijay) నటిస్తున్న తాజా చిత్రం 'వారీసు'. తెలుగులో 'వారసుడు'గా (Varasudu) తెరకెక్కుతోంది. విజయ్ సరసన హీరోయిన్ గా తొలి సారి రష్మిక మందన్నా (Rashmika Mandanna) అలరించనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2023 సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.

తెలుగు, తమిళ్ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కుతున్న 'వారసుడు' (Varasudu) మూవీ ఫై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. కార్తీక్ పళని ఫోటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాలో రాధికా శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, ప్రభు, శ్రీకాంత్, యోగి బాబు, జయసుధ, సంగీత, క్రిష్, ఖుష్బూ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. జనవరి 12న తెలుగు, తమిళ ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ ప్రమోషన్స్ మంచి స్వింగ్ లో జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఈ మూవీ తాలూకా ఫస్ట్ సింగిల్ ను దీపావళి సందర్బంగా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాలోని ‘సోల్‌ ఆఫ్ వారసుడు’ (Soul Of Varasudu) సాంగ్ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్‌ చేశారు. ప్రముఖ గాయని చిత్ర ఆలపించిన ఈ పాట శ్రోతలను ఆకట్టకుంటోంది. రామజోగయ్య సాహిత్యం అందించిన ఈ పాట ఫుల్‌ లిరికల్‌ వీడియోను సాయంత్రం 5:30 గంటలకు రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ తెలిపారు.

‘సోల్ ఆఫ్ వారసుడు’ (Soul Of Varasudu) అనే టైటిల్ కి తగ్గట్లే మంచి సోల్ ఫుల్ మ్యూజిక్ తో ప్రారంభమయిన ప్రోమో సాంగ్ చిత్ర గారి వాయిస్ తో బ్యూటిఫుల్ గా మారింది. ‘కన్నా ప్రాణాలు ఉల్లాస తోరణమాయేనమ్మా’ అంటూ ఎండ్ అయిన ప్రోమో, వారసుడు సినిమాలో మదర్ సెంటిమెంట్ కూడా బలంగా ఉందని తెలిసేలా చేసింది. కాగా, ఇప్పటి వరకు ఎలాంటి ప్రోమోలు, టీజర్‌లు విడుదల చేయకున్న కూడా.. ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక, ఇప్పటికే రిలీజైన ‘రంజితమే’, ‘ది దళపతి’ సాంగ్‌లకు ప్రేక్షకులు నుండి విశేష స్పందన వచ్చింది.

Read More: Dil Raju ‘Varisu’: 75 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదు.. ‘వారసుడు’ వివాదంపై దిల్ రాజు రియాక్షన్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!