బాలీవుడ్‌ క్రేజీ ప్రాజెక్ట్‌లో విలన్‌గా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)! ఓకే చెప్పాడా.. లేదా?

Updated on Nov 17, 2022 09:59 PM IST
రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా నటించిన పాన్‌ ఇండియా సినిమా ‘లైగర్’ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది
రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా నటించిన పాన్‌ ఇండియా సినిమా ‘లైగర్’ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)కు బాలీవుడ్‌ నుంచి క్రేజీ ఆఫర్‌ వచ్చినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఒక సినిమాలో కీలకపాత్ర పోషించనున్నట్టు సమాచారం. ‘లైగర్‌’ సినిమాతో బాలీవుడ్‌లోకి కూడా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నారు విజయ్. ఈ సినిమా డిజాస్టర్‌‌ కావడంతో ఆయన కొంత నిరాశ చెందారు. లైగర్ ఫ్లాప్ అయినప్పటికీ బాలీవుడ్‌ నుంచి ఈ రౌడీ హీరోకు క్రేజీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.  

బాలీవుడ్‌ నుంచి విడుదలైన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ‘బ్రహ్మాస్త్ర’. రణ్‌బీర్ కపూర్‌, అలియా భట్‌ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా రెండో భాగం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మొదటి భాగం విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.  శివ (రణ్‌బీర్‌కపూర్‌) గతాన్ని, అతడి తల్లిదండ్రుల గురించి, సినిమాలోని మెయిన్‌ విలన్‌ (దేవ్‌)ని ఇందులో చూపించనున్నట్లు సమాచారం.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా నటించిన పాన్‌ ఇండియా సినిమా ‘లైగర్’ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది

సౌత్‌లో క్రేజ్‌ ఉన్న నటుడితో..

దేశవ్యాప్తంగా క్రేజ్‌ ఉన్న నటుడిని దేవ్‌ పాత్రలో చూపిస్తే బాగుంటుందని చిత్రబృందం భావిస్తోందని టాక్. ఈ మేరకు విజయ్‌ దేవరకొండ అయితే ఈ రోల్‌కు సరైన న్యాయం చేయగలరని, అలాగే, ఆయన్ని తమ టీమ్‌లోకి చేర్చుకుంటే దక్షిణాదిలో కూడా బ్రహ్మాస్త్ర సినిమాకి పాపులారిటీ వస్తుందని నిర్మాత కరణ్‌ జోహార్‌, చిత్ర దర్శకుడు అయాన్‌ భావిస్తున్నట్టు సమాచారం.

ఇప్పటికే చిత్ర యూనిట్‌ విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda)ను సంప్రదించారని వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే.. సినిమాలో మెయిన్‌ విలన్‌గానే కాకుండా రణ్‌బీర్ తండ్రి పాత్రలో దీపికకు జోడీగా విజయ్‌ దేవరకొండ కనిపించే అవకాశం ఉందని ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Read More : Vijay Deverakonda: గొప్ప మనసు చాటుకున్న విజయ్ దేవరకొండ.. రౌడీస్టార్ కీలక నిర్ణయాన్ని మెచ్చుకుంటున్న అభిమానులు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!