పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘హరిహర వీరమల్లు’ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి!

Updated on Aug 18, 2022 02:46 PM IST
భీమ్లా నాయక్ సినిమా తర్వాత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) నటిస్తున్న సినిమా హరిహర వీరమల్లు
భీమ్లా నాయక్ సినిమా తర్వాత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) నటిస్తున్న సినిమా హరిహర వీరమల్లు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కొంత కాలం క్రితమే భీమ్లా నాయక్ మూవీతో ప్రేక్షకులను అలరించారు. మలయాళ మూవీ అయ్యప్పనున్ కొషియన్ మూవీ కి అధికారిక రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే భీమ్లా నాయక్ తో పాటే హరి హరి వీరమల్లు షూటింగ్  కూడా మొదలుపెట్టారు పవన్ కళ్యాణ్.
ఇప్పటికే భీమ్లా నాయక్ సినిమా  విడుదల కాగా, హరిహర వీరమల్లు షూటింగ్ మాత్రం కొన్ని కారణాల వల్ల  ఇప్పటివరకు పూర్తి కాలేదు. కొంత కాలం పాటు ఆగిపోయిన హరిహర వీరమల్లు మూవీ షూటింగ్  తిరిగి  రీ స్టార్ట్ అయ్యింది. కొంత భాగం షూటింగ్ పూర్తి కాగానే మళ్లీ ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది .

భీమ్లా నాయక్ సినిమా తర్వాత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) నటిస్తున్న సినిమా హరిహర వీరమల్లు

భారీ ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్..

గత కొంత కాలంగా ఆగిపోయిన ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు మొదలు కాబోతోంది. ఈ వార్తలు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల ద్వారా వినిపిస్తున్నాయి. ఇదలా ఉంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హరిహర వీరమల్లు మూవీ షూటింగ్  సెప్టెంబర్ నెల నుండి రీ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. హరిహర వీరమల్లు మూవీకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు.  నిధి అగర్వాల్ ఈ మూవీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీపై పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Read More : ఇండస్ట్రీ స్టామినాను పెంచిన పవర్‌‌స్టార్ పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) టాప్‌ సినిమాలు.. మీకోసం ప్రత్యేకం

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!