తారక్‌ మాటలే ధైర్యాన్నిచ్చాయి.. బింబిసార సినిమాలో రాజు క్యారెక్టర్‌‌ గురించి కల్యాణ్‌ రామ్ (Nandamuri Kalyan Ram)

Updated on Aug 01, 2022 07:26 PM IST
బింబిసార సినిమాను తెరకెక్కించడానికి తారక్ ఇచ్చిన ధైర్యమే కారణం అంటున్న కల్యాణ్‌రామ్ (Kalyan Ram)
బింబిసార సినిమాను తెరకెక్కించడానికి తారక్ ఇచ్చిన ధైర్యమే కారణం అంటున్న కల్యాణ్‌రామ్ (Kalyan Ram)

'బింబిసార సినిమాను తెరకెక్కించడానికి ధైరాన్నిచ్చింది తారక్ చెప్పిన మాటలే' అన్నారు నందమూరి కల్యాణ్ రామ్ (Nandamuri KalyanRam). ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం 'బింబిసార'. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో జోరు పెంచింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో కల్యాణ్ రామ్ మాట్లాడారు.

‘కొత్త దర్శకుడిని నమ్మి బింబిసార వంటి పెద్ద ప్రాజెక్టు ఎలా చేశారని అందరూ అడుగుతున్నారు. మరి 'అతనొక్కడే' సినిమా సురేందర్ రెడ్డికి మొదటి సినిమానే కదా' అన్నారు కల్యాణ్‌రామ్. 'అనిల్ రావిపూడికి 'పటాస్', గుహన్‌కి '118' సినిమాలు కూడా మొదటి సినిమాలే. అయినా ఎటువంటి రిజల్ట్స్‌ వచ్చాయో గుర్తుంది కదా.

అందుకే, కొత్తవాడైనా వశిష్ఠ 'బింబిసార' కథ చెప్పినప్పుడు.. అందులోని పాయింట్ బాగా నచ్చింది. స్క్రీన్‌పై ఈ సినిమా కచ్చితంగా వర్కవుట్ అవుతుందనే నమ్మకం కలిగింది' అని తన మదిలోని భావాలను పంచుకున్నారు కళ్యాణ్ రామ్.

బింబిసార సినిమాలో హీరో కల్యాణ్‌రామ్ (Kalyan Ram)

అందరూ ఎంజాయ్ చేసేలా..

'చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ ఫాంటసీ సినిమాలనే ఇష్టపడతారు. బాగా ఎంజాయ్ చేస్తారు. 'ఆదిత్య 369' తరువాత ఇప్పటివరకూ.. ఎవరూ ఇలాంటి పాయింట్‌ను టచ్ చేసే సినిమా తెరకెక్కించలేదు. 'బింబిసార' సినిమాలో రాజుగా నటించాలంటే ఆలోచించాను. ఈ జనరేషన్‌కి 'రాజు' అంటే అందరికీ ప్రభాస్ గుర్తొస్తారు. ఇలాంటి పాత్రను నేను చేయటం రిస్క్ అవుతుందా? అని అనుకున్నాను. రాజుగా నా లుక్, కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలనే విషయంలో సీరియస్‌గా ఆలోచించాం. 2 నెలలు బాగా ఎక్సర్‌‌సైజ్‌ చేశాం.  నా లుక్‌ను ముందుగా చూపించింది తారక్‌కే. 'బాగున్నావు అన్నయ్యా.. సెట్‌ అయ్యావు..  సూపర్బ్' అన్నాడు తారక్. తారక్ అలా అనడంతో నాకు నమ్మకం కలిగింది అని చెప్పుకొచ్చారు కల్యాణ్‌రామ్.  

ఆగస్టు 5వ తేదీన 'బింబిసార' సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో కేథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్, వరీన హుస్సేన్ హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే రిలీజైన సినిమా పోస్టర్లు, పాటలు, టీజర్, ట్రైలర్‌‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అలాగే ట్రైలర్‌‌లో కల్యాణ్‌రామ్ (Nandamuri KalyanRam) చెప్పిన డైలాగ్స్, మాడ్యులేషన్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేస్తున్నాయి.

Read More : నటనలో అక్షరాభ్యాసం చేసింది బాలకృష్ణ బాబాయ్‌ : వీడియో రిలీజ్ చేసిన కల్యాణ్‌రామ్‌ (Kalyan Ram)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!