‘హరిహర వీరమల్లు’ (HariHara VeeraMallu) నుంచి క్రేజీ అప్డేట్.. మేజర్ యాక్షన్ సీక్వెన్స్ పూర్తి!

Updated on Dec 21, 2022 06:14 PM IST
తాజాగా ‘హరిహర వీరమల్లు’ (HariHara VeeraMallu) చిత్రం నుంచి స్టంట్ మాస్టర్ విజయ్ ఓ అప్టేట్ ఇచ్చారు.
తాజాగా ‘హరిహర వీరమల్లు’ (HariHara VeeraMallu) చిత్రం నుంచి స్టంట్ మాస్టర్ విజయ్ ఓ అప్టేట్ ఇచ్చారు.

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న పీరియాడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (HariHara VeeraMallu). మేఘసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్లు అర్జున్ రాంపాల్‌, న‌ర్గీస్ ఫ‌క్రీ కీలక పాత్రలు పోషిస్తుండగా.. పవన్ సరసన నిధి అగర్వాల్ (Niddhi Agerwal) హీరోయిన్ గా నటిస్తోంది. ఎంఎం కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు‌‌.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ కరోనా పరిస్థితులు, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  రాజకీయ కార్యక్రమాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. అయితే, ఎట్టకేలకు  గత నెల నుంచి రెగ్యూలర్ షూటింగ్ ను హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ఓ భారీ సెట్ లో కొనసాగిస్తున్నారు. స్టంట్ మాస్టర్ విజయ్ సమక్షంలో దాదాపు 1000మంది కళాకారులతో నెల రోజులుగా భారీ యుద్ద సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు.   

17వ శతాబ్దంలోని మొఘల్, కుతుబ్ షాహీల సామ్రాజ్యాల నేపథ్యంలో ఈ కథ సాగనుండగా.. ప్రముఖ సంగీత దర్శకుడు ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక, ఈ సినిమాను 2023 మార్చి 22న విడుల చేసేందుకు షెడ్యూల్ చేస్తున్నారట. ఈ విషయంపై త్వరలో అధికారిక ప్రటకన వచ్చే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ‘హరిహర వీరమల్లు’ (HariHara VeeraMallu) చిత్రం నుంచి స్టంట్ మాస్టర్ విజయ్ ఓ అప్టేట్ ఇచ్చారు. ఈ మేరకు ట్విటర్ లో పోస్ట్ చేస్తూ.. ‘నిన్ననే మేజర్ యాక్షన్ సీక్వెన్స్ ను పూర్తి చేశాం. వెంటనే నెక్ట్స్ సీక్వెల్స్ ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాం. కళ్యాణ్ బాబు రెగ్యులర్ గా షూటింగ్ కు హాజరవుతూ మంచి సపోర్ట్ ను అందిస్తున్నారు. ఆయన ప్రశంసలు, ప్రేమకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.

Read More: పవన్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) తో జతకట్టనున్న 'సాహో' ద‌ర్శ‌కుడు సుజిత్ (Sujeeth).. అధికారిక ప్రకటన వచ్చేసింది!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!