‘హాస్య బ్రహ్మ’ బ్రహ్మానందం (Brahmanandam) కామెడీతో రికార్డులు బద్దలుకొట్టిన టాప్10 సినిమాలు
నవ్వడం ఒక యోగం.. నవ్వించడం ఒక భోగం.. నవ్వకపోవడం ఒక రోగం.. ఈ పదాలు జీవితంలోనే కాదు సినిమాలకు కూడా అన్వయించుకోవచ్చు. కామెడీ లేని సినిమాలు ఫ్లాప్ అయిన సందర్భాలు ఉన్నాయి కానీ, కామెడీ ప్రధానంగా తెరకెక్కిన సినిమాలు మాత్రం కచ్చితంగా హిట్ అయ్యాయి. తెలుగు సినిమా చరిత్రలో ఎంతో మంది కమెడియన్లు ఉన్నారు. ఈ తరం కమెడియన్లలో ‘బ్రహ్మానందం’ (Brahmanandam) పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఒక దశాబ్దం పాటు ఆయన లేకుండా సినిమా లేదంటే అతిశయోక్తి కాదు.
వెయ్యికిపైగా సినిమాల్లో నటించి గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకున్నారు. తన నటన, డైలాగులతో మాత్రమే కాకుండా హావభావాలు, ముఖకవళికలతో సైతం ప్రేక్షకులను నవ్వించగలిగే సత్తా ఉన్న నటుడు బ్రహ్మానందం (Brahmanandam). 64 కళల్లో నవ్వించడం ఒక కళ. ఆ నవ్వులను పూయించి.. ప్రేక్షకులకు పొట్ట చెక్కలయ్యేలా కామెడీని పుట్టించగలిగిన బ్రహ్మ గనుకనే ఆయనను ప్రేక్షకులు ‘హాస్య బ్రహ్మ’ అని పిలుచుకుంటారు. బ్రహ్మానందం కామెడీతో సూపర్‌హిట్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో టాప్10 సినిమాల విశేషాలు పింక్‌విల్లా వ్యూయర్స్ కోసం ప్రత్యేకం..
ఢీ :
మంచు విష్ణు (Vishnu Manchu) హీరోగా తెరకెక్కిన సినిమా ఢీ. జెనీలియా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. మంచు విష్ణుకు దక్కిన మొదటి బ్లాక్‌బస్టర్ హిట్. కామెడీ, లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఢీ సినిమాలో బ్రహ్మానందం కామెడీ ఒక రేంజ్‌లో పండింది.
ఢీ సినిమాలోని కొన్ని సీన్లలో బ్రహ్మానందం (Brahmanandam) చేసే కామెడీకి థియేటర్లలో ప్రేక్షకులు పడి పడి నవ్వుకున్నారు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది.
కృష్ణ :
మాస్ మహారాజా రవితేజ (RaviTeja) – వీవీ వినాయక్ కాంబినేషన్‌లో తెరకెక్కిన కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్ కృష్ణ. త్రిష (Trisha) హీరోయిన్‌గా వచ్చిన ఈ సినిమాలో మొదటి ఫ్రేమ్ నుంచి చివరి వరకు పాటలను మినహాయిస్తే దాదాపు అన్ని సన్నివేశాల్లోనూ ఉంటారు బ్రహ్మానందం. హీరో రవితేజ, బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ సీన్లు ఇప్పటికీ హైలైట్‌గానే నిలుస్తాయి. కృష్ణ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది.
‘కృష్ణ’కు ముందు రవితేజ – బ్రహ్మానందం (Brahmanandam) కాంబోలో వచ్చిన దుబాయ్ శీను సినిమాలో కూడా కామెడీ హైలైట్ అనే చెప్పుకోవాలి.
జల్సా :
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) – త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా జల్సా. ఈ సినిమాలో కూడా బ్రహ్మానందం కామెడీ హైలైట్‌గా నిలుస్తుంది. ఇలియానా (Ileana) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో బ్రహ్మీ క్యారెక్టర్ చేసే హడావుడి అంతా ఇంతా కాదు. చాలాకాలం తర్వాత పవర్‌స్టార్‌కు జల్సా హిట్ ఇచ్చింది.
కామెడీ, లవ్, యాక్షన్ ప్రధానంగా తెరకెక్కిన జల్సా సినిమాలో పాటలు, ఫైట్స్‌తోపాటు త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగులు కూడా హైలైట్‌గా నిలుస్తాయి.
రెడీ :
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా నటించిన మూడో సినిమా రెడీ. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జెనీలియా (Genelia) హీరోయిన్‌గా నటించారు. జగడం సినిమా డిజాస్టర్‌తో అప్‌సెట్ అయిన రామ్‌కు రెడీ సినిమా సక్సెస్ కొత్త ఎనర్జీని ఇచ్చింది. ఈ సినిమాలో కూడా బ్రహ్మానందం కామెడీ హైలైట్.
కామెడీ, లవ్, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన రెడీ సినిమాలో బ్రహ్మానందం (Brahmanandam) నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం లభించాయి.
అదుర్స్ :
జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) మొదటిసారి నటించిన ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అదుర్స్’. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేశారు. వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన అదుర్స్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో కూడా బ్రహ్మానందం కామెడీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
ముఖ్యంగా ఎన్టీఆర్, బ్రహ్మానందం మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. నయనతార (Nayanthara), షీలా హీరోయిన్లుగా నటించారు.
దూకుడు :
సూపర్‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) హీరోగా శ్రీను వైట్ల తెరకెక్కించిన సినిమా ‘దూకుడు’. సమంత (Samantha) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో కామెడీ కూడా హైలైట్‌గా నిలుస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్ మొత్తం బ్రహ్మానందం కామెడీతోనే నడుస్తుంది.
కామెడీ, లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన దూకుడు సినిమా విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ సూపర్‌హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. బ్రహ్మానందం (Brahmanandam) డైలాగులకు జనం కడుపుబ్బా నవ్వుకున్నారు.
దేనికైనా రెడీ :
మంచు విష్ణు (Vishnu Manchu) హీరోగా నటించిన సినిమా దేనికైనా రెడీ. హన్సికా మోత్వాని (Hansika Motwani) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించారు. మోహన్‌బాబు నిర్మాతగా వ్యవహరించిన దేనికైనా రెడీ సినిమా యాక్షన్, కామెడీ ప్రధానంగా తెరకెక్కింది.
ఈ సినిమాలో బ్రహ్మానందం కామెడీ అదుర్స్ అనిపించేలా ఉంటుంది. ఈ సినిమా హిట్ కావడంలో బ్రహ్మానందం కీలకపాత్ర పోషించారు.
నాయక్ :
మెగా పవర్‌స్టార్ రాంచరణ్ (RamCharan) హీరోగా నటించిన ‘నాయక్’ సినిమాలో బ్రహ్మానందం చేసిన సందడి మామూలుగా ఉండదు. చరణ్ పక్కనే ఉంటూ బ్రహ్మీ వేసే డైలాగులు, జయప్రకాష్ రెడ్డికి భయపడుతూ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ థియేటర్లలో ప్రేక్షకులకు ఆనంద భాష్పాలు తెప్పిస్తాయి.
రాంచరణ్ సరసన అమలాపాల్ (Amalapaul), కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) హీరోయిన్లుగా నటించిన నాయక్ సినిమాకు వీవీ వినాయక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో బ్రహ్మానందం (Brahmanandam) కామెడీ సీన్లు ఇప్పటికీ యూట్యూబ్‌లో సందడి చేస్తుంటాయి.
బాద్ షా :
జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) హీరోగా తెరకెక్కిన కామెడీ, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బాద్ షా’. కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. శ్రీను వైట్ల మార్క్ కామెడీకి బ్రహ్మానందం ఎక్స్‌ప్రెషన్స్, డైలాగ్స్ జతకలిసి.. ప్రేక్షకులకు కడుపునొప్పి తెప్పిస్తుంది.
వరుసగా రెండు, మూడు సినిమాలు అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్న ఎన్టీఆర్‌కు.. బాద్‌షా ఇచ్చిన సక్సెస్ మంచి కిక్ ఇచ్చింది.
లౌక్యం :
గోపీచంద్ (Gopichand) హీరోగా తెరకెక్కిన సినిమా లౌక్యం. చాలాకాలం నుంచి సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్‌కు ఈ సినిమా బ్రేక్ ఇచ్చింది. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన లౌక్యం సినిమాలో బ్రహ్మానందం కామెడీకి పొట్టలు చెక్కలయ్యేలా నవ్వుకున్నారు ప్రేక్షకులు.
రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో బ్రహ్మానందం (Brahmanandam) కామెడీ హైలైట్‌గా నిలుస్తుంది.
Read More : టాలీవుడ్ టాప్10 హీరోయిన్లలో శాండల్‌వుడ్ భామలు ఎవరో తెలుసా!