Cine Celebs : రమేష్‌బాబు నుంచి కృష్ణ వరకు 2022లో మరణించిన సినీ సెలబ్రిటీలు

Updated on Dec 21, 2022 07:32 PM IST
కోట్ల మంది అభిమానాన్ని చూరగొన్న సినీ సెలబ్రిటీలు పలువురు అనారోగ్యంతో 2022లో అభిమానులను కన్నీటిలో ముంచెత్తుతూ తుదిశ్వాస విడిచారు
కోట్ల మంది అభిమానాన్ని చూరగొన్న సినీ సెలబ్రిటీలు పలువురు అనారోగ్యంతో 2022లో అభిమానులను కన్నీటిలో ముంచెత్తుతూ తుదిశ్వాస విడిచారు

మరో పది రోజుల్లో 2023లోకి అడుగుపెట్టనున్నాం. ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీకి మంచి కాలమేనని చెప్పుకోవచ్చు. చిన్న పెద్దా తేడా లేకుండా పలు సినిమాలు హిట్‌ అయ్యాయి. అదే విధంగా డబ్బింగ్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ఇక, వచ్చే ఏడాది విడుదలై సందడి చేయడానికి స్టార్ హీరోల సినిమాలు సిద్దమవుతున్నాయి. సినిమాల సక్సెస్‌తో వచ్చిన జోష్‌.. పలువురు స్టార్ల మరణంతో కలిగిన విషాదం.. రెండింటితో 2022కు ముగింపు పలుకుతోంది.

ఇక, కాల క్రమంలో పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదు. వారిలో సెలబ్రిటీలు కూడా ఉంటారు. ప్రతి ఏడాది పలువురు సినీ సెలబ్రిటీలు మరణిస్తూ ఉంటారు. ఈ ఏడాది కూడా పలువురు సినీ సెలబ్రిటీలు  అభిమానులకు విషాదాన్ని మిగులుస్తూ లోకాన్ని విడిచారు. 2022లో మరణించిన పలువురు సెలబ్రిటీల వివరాలు పింక్‌విల్లా వ్యూయర్స్‌ కోసం ప్రత్యేకం..

కోట్ల మంది అభిమానాన్ని చూరగొన్న సినీ సెలబ్రిటీలు పలువురు అనారోగ్యంతో 2022లో అభిమానులను కన్నీటిలో ముంచెత్తుతూ తుదిశ్వాస విడిచారు

సూపర్‌‌స్టార్ కృష్ణ (Krishna) :

డేరింగ్‌ అండ్ డాషింగ్ హీరోగా పేరుగాంచిన సూపర్‌‌స్టార్ కృష్ణ లోకాన్ని విడిచారు. 1943లో జన్మించిన కృష్ణ 2022, నవంబర్‌‌ 15న తుదిశ్వాస విడిచారు. వయసు రీత్యా వచ్చే అనారోగ్య సమస్యల కారణంగా కొన్నేళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

మే 31, 2022న 79 వసంతాలు పూర్తి చేసుకున్న కృష్ణ నవంబర్‌‌ 14న గుండెపోటుతో హాస్పిటల్‌లో చేరారు. పరిస్థితి విషమించడంతో మరణించారు. ఇక, ఆయన మొదటి భార్య, మహేష్‌బాబు తల్లి ఇందిరాదేవి సెప్టెంబర్‌‌ 28, 2022న, రెండో భార్య, ప్రముఖ దర్శకురాలు విజయ నిర్మల 2019, జూన్‌ 27న మరణించారు.

కోట్ల మంది అభిమానాన్ని చూరగొన్న సినీ సెలబ్రిటీలు పలువురు అనారోగ్యంతో 2022లో అభిమానులను కన్నీటిలో ముంచెత్తుతూ తుదిశ్వాస విడిచారు

రెబల్‌స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju) :

విలన్‌గా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోగా ఎదిగారు కృష్ణంరాజు. వైవిద్యమైన నటన, యాక్షన్‌తో ప్రేక్షకులతో రెబల్‌స్టార్‌‌ అని పిలిపించుకున్నారు. 82 సంవత్సరాల వయసులో కార్డియాక్ అరెస్ట్‌ కావడంతో 2022, సెప్టెంబర్‌‌ 11 మరణించారు.

1966లో వచ్చిన చిలక గోరింక సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కృష్ణంరాజు.. 190కు పైగా సినిమాల్లో నటించారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన పాన్‌ ఇండియా సినిమా రాధేశ్యామ్‌ కృష్ణంరాజు నటించిన ఆఖరి సినిమా. 1940, జనవరి 20న జన్మించిన కృష్ణంరాజు ఎంపీగా సేవలందించారు.

కోట్ల మంది అభిమానాన్ని చూరగొన్న సినీ సెలబ్రిటీలు పలువురు అనారోగ్యంతో 2022లో అభిమానులను కన్నీటిలో ముంచెత్తుతూ తుదిశ్వాస విడిచారు

రమేష్‌బాబు (RameshBabu) :

సూపర్‌‌స్టార్ కృష్ణ పెద్ద కొడుకు రమేష్‌బాబు అనారోగ్యంతో 2022లో మృతిచెందారు. 1965, అక్టోబర్‌‌ 13న జన్మించిన ఘట్టమనేని రమేష్‌బాబు కాలేయ సంబంధ వ్యాధికి చికిత్స పొందుతూ 2022, జనవరి 8న కన్నుమూశారు.

కృష్ణ నటించిన మనుషులు చేసిన దొంగలు, నీడ, పాలు నీళ్లు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన రమేష్‌బాబు.. సామ్రాట్ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. పలు హిట్ సినిమాల్లో నటించారు. అనంతరం సూర్యవంశం (హిందీ), అర్జున్, అతిథి, దూకుడు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు.

కోట్ల మంది అభిమానాన్ని చూరగొన్న సినీ సెలబ్రిటీలు పలువురు అనారోగ్యంతో 2022లో అభిమానులను కన్నీటిలో ముంచెత్తుతూ తుదిశ్వాస విడిచారు

ఎమ్‌.బాలయ్య (M.Balayya) :

అలనాటి నటుడు, నిర్మాత ఎమ్‌.బాలయ్య ఈ ఏడాది ఏప్రిల్‌లో మరణించారు. 1930 ఏప్రిల్‌ 9న జన్మించిన బాలయ్య వయసు రీత్యా వచ్చిన అనారోగ్యం కారణంగా ఏప్రిల్‌ 9, 2022 తుదిశ్వాస విడిచారు. 1958లో వచ్చిన ‘ఎత్తుకు పైఎత్తు’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు.

శ్రీరామరాజ్యం, మల్లీశ్వరి, మన్మథుడు, అన్నమయ్య వంటి సూపర్‌‌హిట్‌ సినిమాల్లో నటించిన బాలయ్య.. పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. 2012లో వచ్చిన దేవరాయ సినిమా బాలయ్య నటించిన చివరి సినిమా.

కోట్ల మంది అభిమానాన్ని చూరగొన్న సినీ సెలబ్రిటీలు పలువురు అనారోగ్యంతో 2022లో అభిమానులను కన్నీటిలో ముంచెత్తుతూ తుదిశ్వాస విడిచారు

డైరెక్టర్ శరత్ (Sarath) :

నందమూరి బాలకృష్ణ, సుమన్ వంటి హీరోలతో సూపర్‌‌హిట్ సినిమాలు తెరకెక్కించిన సీనియర్ డైరెక్టర్ శరత్‌ ఈ ఏడాది ఏప్రిల్‌లో కన్నుమూశారు. కొన్ని నెలలుగా కేన్సర్‌‌తో బాధపడుతున్న శరత్‌ ఏప్రిల్‌ 1వ తేదీన తుదిశ్వాస విడిచారు. 1986లో చాదస్తపు మొగుడు సినిమా డైరెక్టర్‌‌గా ఆయనకు మొదటి సినిమా.

బాలకృష్ణతో వంశానికొక్కడు, పెద్దన్నయ్య, సుల్తాన్, వంశోద్దారకుడు సినిమాలు తీశారు. ఇక, సుమన్‌తో బావబావమరిది, పెద్దింటి అల్లుడు, చిన్న అల్లుడు సినిమాలకు దర్శకత్వం వహించారు.

కోట్ల మంది అభిమానాన్ని చూరగొన్న సినీ సెలబ్రిటీలు పలువురు అనారోగ్యంతో 2022లో అభిమానులను కన్నీటిలో ముంచెత్తుతూ తుదిశ్వాస విడిచారు

తాతినేని రామారావు (Tatineni RamaRao) :

పాతతరం దర్శకుడు, నిర్మాత తాతినేని రామారావు కూడా ఈ ఏడాదిలోనే మరణించారు. 1938లో పుట్టిన రామారావు 83 ఏళ్ల వయసులో ఏప్రిల్‌ 20, 2022న తుదిశ్వాస విడిచారు. 1950వ దశకంలో అసిస్టెంట్ డైరెక్టర్‌‌గా పనిచేసిన తాతినేని.. 1966లో నవరాత్రి సినిమాతో దర్శకుడిగా మారారు.

తెలుగు, హిందీ భాషల్లో కలిపి దాదాపు 75 సినిమాలకు దర్శకత్వం వహించిన తాతినేని రామారావు.. హిందీ, తమిళంలో నిర్మాతగా సినిమాలు చేశారు.

కోట్ల మంది అభిమానాన్ని చూరగొన్న సినీ సెలబ్రిటీలు పలువురు అనారోగ్యంతో 2022లో అభిమానులను కన్నీటిలో ముంచెత్తుతూ తుదిశ్వాస విడిచారు

రామిగాని మదన్ (Ramigani Madan) :

రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఫీల్ గుడ్ సినిమా ‘ఆ నలుగురు’. ఆ సినిమాకు దర్శకత్వం వహించిన రామిగాని మదన్ 2022, నవంబర్‌‌ 19న తుదిశ్వాస విడిచారు. ఆ నలుగురు సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న మదన్.. పలు సినిమాలకు సహాయకుడిగా పనిచేశారు. గుండెపోటు, బ్రెయిన్‌డెడ్‌ కావడంతో మదన్ మరణించారు.

మనసంతా నువ్వే, సంతోషం సినిమాలకు కెమెరామెన్ ఎస్.గోపాల్‌రెడ్డికి, కల్యాణ రాముడు, ఖుషీఖుషీగా సినిమాల రచయితలకు సహాయకుడిగా పనిచేశారు. పెళ్లైన కొత్తలో, గుండె ఝల్లుమంది, ప్రవరాఖ్యుడు సినిమాలకు దర్శకత్వం వహించారు.

కోట్ల మంది అభిమానాన్ని చూరగొన్న సినీ సెలబ్రిటీలు పలువురు అనారోగ్యంతో 2022లో అభిమానులను కన్నీటిలో ముంచెత్తుతూ తుదిశ్వాస విడిచారు

లతా మంగేష్కర్ (Lata Mangeshkar) :

ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్‌‌ కరోనాతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. సెప్టెంబర్ 28, 1929లో జన్మించిన లత.. నైటింగేల్ ఆఫ్ ఇండియా, క్వీన్ ఆఫ్ ఇండియా, వాయిస్ ఆఫ్ మిలీనియం పేర్లతో పాపులర్ అయ్యారు.

1940 నుంచి పలు భారతీయ భాషల్లో పాటలు పాడిన లతా మంగేష్కర్.. తెలుగులో కూడా పాటలు పాడి శ్రోతలను అలరించారు.  సింగర్‌‌గానే కాకుండా మ్యూజిక్ ప్రొడ్యూసర్‌‌గా, కంపోజర్‌‌గా కూడా వ్యవహరించారు. 2022, జనవరి 8వ తేదీన కరోనా సింప్టమ్స్‌తో హాస్పిటల్‌లో చేరిన లతా మంగేష్కర్ ఆరోగ్యం క్షీణించడంతో ఫిబ్రవరి 6న తుదిశ్వాస విడిచారు.

కోట్ల మంది అభిమానాన్ని చూరగొన్న సినీ సెలబ్రిటీలు పలువురు అనారోగ్యంతో 2022లో అభిమానులను కన్నీటిలో ముంచెత్తుతూ తుదిశ్వాస విడిచారు

బప్పీలహరి (Bappi Lahari) :

సూపర్‌‌స్టార్ కృష్ణ హీరోగా తెరకెక్కిన ఆల్‌టైమ్ హిట్ సినిమా సింహాసనం సినిమాకు సంగీతం అందించి టాలీవుడ్‌కు పరిచయమయ్యారు బప్పీలహరి. అనంతరం తేనెమనసులు, స్టేట్‌ రౌడీ, గ్యాంగ్‌ లీడర్‌‌తోపాటు పలు తెలుగు సినిమాలకు సంగీతం అందించారు. హిందీలో బాగా పాపులర్ సింగర్ అయిన బప్పీలహరి.. 1953, నవంబర్‌‌ 27వ తేదీన జన్మించారు.

69 ఏళ్ల వయసులో అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్ ఆప్నియాతో బాధపడుతూ ఫిబ్రవరి 16వ తేదీన బప్పీలహరి కన్నుమూశారు. 1986వ సంవత్సరంలో 33 సినిమాలలోని 180 పాటలు రికార్డు చేసి గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకున్నారు బప్పీలహరి.

కోట్ల మంది అభిమానాన్ని చూరగొన్న సినీ సెలబ్రిటీలు పలువురు అనారోగ్యంతో 2022లో అభిమానులను కన్నీటిలో ముంచెత్తుతూ తుదిశ్వాస విడిచారు

గురుస్వామి (Guru Swamy) :

సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ సినిమాలో రైతుగా నటించిన గురుస్వామి అనారోగ్యంతో మరణించారు. కర్నూలు జిల్లాకు చెందిన గురుస్వామి స్టేజీ యాక్టర్‌‌గా పాపులర్ అయ్యారు. నటనపై ఉన్న మక్కువతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి విజేత ఆర్ట్స్ పేరుతో ప్రొడక్షన్ కంపెనీని స్థాపించారు.

కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న గురుస్వామి.. ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణానికి పలువురు సినీ సెలబ్రిటీలు సంతాపం తెలిపారు.

Read More : Tollywood : కేజీఎఫ్‌ నుంచి లవ్‌ టుడే వరకు.. 2022లో తెలుగులోనూ అదరగొట్టిన డబ్బింగ్ సినిమాలు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!