బ్రహ్మానందం (Brahmanandam) ప్రధాన పాత్రలో 'పంచతంత్రం' (Panchathantram).. ఆసక్తికరంగా రిలీజ్ డేట్ వీడియో..!

Updated on Oct 09, 2022 04:30 PM IST
బ్రహ్మానందం (Brahmanandam) కాస్త సీరియస్ గా, వ్యామోహంతో 'పంచతంత్రం' అనే పదం రాసి ఉన్న క్యాసెట్ ని చూస్తుండగా ఈ వీడియో మొదలవుతుంది.
బ్రహ్మానందం (Brahmanandam) కాస్త సీరియస్ గా, వ్యామోహంతో 'పంచతంత్రం' అనే పదం రాసి ఉన్న క్యాసెట్ ని చూస్తుండగా ఈ వీడియో మొదలవుతుంది.

కళా బ్రహ్మ బ్రహ్మానందం (Brahmanandam), సముద్రఖని, ‘కలర్స్’ స్వాతి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్‌ విజయ్‌, నరేష్‌ అగస్త్య, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'పంచతంత్రం' (Panchathantram). హర్ష పులిపాక రచన, దర్శకత్వం వహిస్తుండగా.. అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. 

హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు నిర్మాతలు. "పంచతంత్రం" సినిమాను డిసెంబర్ 9న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు ఓ వీడియోను కూడా విడుదల చేసింది. బ్రహ్మానందం (Brahmanandam) కాస్త సీరియస్ గా, వ్యామోహంతో 'పంచతంత్రం' అనే పదం రాసి ఉన్న క్యాసెట్ ని చూస్తుండగా ఈ వీడియో మొదలవుతుంది.

కాగా, "పంచతంత్రం" (Panchathantram) సినిమాను డిసెంబర్ 9న విడుదల చేస్తున్నట్లు ఓ వీడియోను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ వీడియో ప్రారంభంలో బ్రహ్మానందం కాస్త సీరియస్ గా, వ్యామోహంతో 'పంచతంత్రం' అనే పదం రాసి ఉన్న క్యాసెట్ ని చూస్తూ ఉంటారు. తర్వాత రాహుల్ విజయ్ కాస్త ఆత్రుతగా, గాలిలోకి చూస్తూ నడుస్తుంటాడు. హ్యాపీ మూడ్‌లో ఉన్న శివాత్మిక రాజశేఖర్‌ని అతనికి జోడీగా చూపించారు. సముద్రఖని, దివ్య వాణి మధ్య వయస్కులైన జంటగా ఈ వీడియోలో కనిపిస్తున్నారు. ఆ తర్వాత దివ్య శ్రీపాద తన భర్తతో కలిసి ఆనందకరమైన భావోద్వేగ మూడ్‌లో ఉన్న దృశ్యాలు కనిపిస్తాయి.

 

'పంచతంత్రం' (Panchathantram) సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, 'అరెరే అరెరే' అనే పాట కూడా ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది. రీసెంట్ గా ‘యే రాగమో’ అనే మరో పాటను కూడా విడుదల చేశారు. ఈ పాటలకు ప్రేక్షకులనుండి విశేష ఆదరణ లభిస్తోంది. ఇక, ఈ సినిమాలోని పాత్రలు చాలా అందంగా డిజైన్ చేశామని దర్శకుడు హర్ష తెలిపారు. 'వేదవ్యాస్' పాత్రలో బ్రహ్మానందం జీవించారని తెలిపారు.

Read More: Break Out Trailer: బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ (Raja Goutham) హీరోగా 'బ్రేక్ అవుట్'.. ఆసక్తికరంగా ట్రైలర్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!