Waltair Veerayya: మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య’ మల్టీస్టారరా?.. స్క్రీన్‌పై రవితేజ (Ravi Teja) అంతసేపు ఉంటారా..!

Updated on Dec 21, 2022 11:21 AM IST
Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’లో రవితేజ మేజర్ సీన్లు అన్నీ చిరు కాంబోలో ఉంటాయని.. వీళ్ల కలయికలో ‘పూనకాలు లోడింగ్’ పాట ఉంటుందని వినికిడి
Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’లో రవితేజ మేజర్ సీన్లు అన్నీ చిరు కాంబోలో ఉంటాయని.. వీళ్ల కలయికలో ‘పూనకాలు లోడింగ్’ పాట ఉంటుందని వినికిడి

మల్టీసారర్ సినిమాలు తెలుగులో కొత్తేం కాదు. వెండితెరపై ఒక్క హీరో కనిపిస్తేనే ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అనుకుంటే.. ఇక మరో హీరో కూడా తోడైతే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో కృష్ణ–శోభన్ బాబు, ఎన్టీఆర్–ఏఎన్ఆర్‌లు కలసి ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఇద్దరు హీరోలు కలసి చేసే సందడికి ఆడియెన్స్‌కు పూనకాలు వచ్చేసేవంటే అతిశయోక్తి కాదు. అయితే క్రమేణా మల్టీసారర్ మూవీలు తగ్గిపోయాయి.

హీరోలు ఇమేజ్ చట్రంలో కూరుకుపోవడంతో ఇతర స్టార్లతో కలసి నటించడం కుదరలేదు. అయితే దీనికి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’తో మళ్లీ బీజం పడింది. ఈ మూవీలో మహేష్ బాబు, వెంకటేష్ అన్నదమ్ములుగా కనిపించి ఆకట్టుకున్నారు. దీంతో తెలుగులో మల్టీస్టారర్ ట్రెండ్ మళ్లీ మొదలైంది. ఈ సినిమా తర్వాత ‘మసాలా’లో రామ్‌తో, ‘గోపాల గోపాల’లో పవన్ కల్యాణ్‌తో కలసి వెంకీ యాక్ట్ చేశారు. ఆ తర్వాత ‘బాహుబలి’లో రానా, ప్రభాస్.. ‘ఆర్ఆర్ఆర్’లో రామ్ చరణ్​, జూనియర్ ఎన్టీఆర్.. ‘ఆచార్య’లో చిరంజీవి, రామ్ చరణ్​ కలసి నటించి, స్క్రీన్ మీద సందడి చేశారు.

 ‘వాల్తేరు వీరయ్య’లో రవితేజ (Ravi Teja) దాదాపు 44 నిమిషాలు స్క్రీన్ మీద కనిపిస్తారని సమాచారం

ఇక మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) మూవీని కూడా మరో మల్టీస్టారర్ అంటున్నారు. ఈ చిత్రంలో చిరుతోపాటు మాస్ మహారాజా రవితేజ కూడా యాక్ట్ చేస్తున్నారు. బాబి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో చిరు సరసన శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో రవితేజది గెస్ట్ రోల్ అని అందరూ అనుకున్నారు. కానీ దీనిపై కొంత క్లారిటీ వచ్చినట్లే కనిపిస్తోంది. ‘వాల్తేరు వీరయ్య’లో రవితేజ (Ravi Teja) దాదాపు 44 నిమిషాలు స్క్రీన్ మీద కనిపిస్తారని సమాచారం. అది కూడా మూవీలోని మేజర్ సీన్లు అన్నీ మెగాస్టార్ కాంబినేషన్‌లోనే ఉంటాయట. ఇద్దరి కలయికలో ‘పూనకాలు లోడింగ్’ అనే పాట కూడా ఉందని వినికిడి. అందువల్ల ‘వాల్తేరు వీరయ్య’ పక్కా మల్టీస్టారర్ అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. 

ఇక ‘వాల్తేరు వీరయ్య’ ఫైనల్ కట్ వర్క్ జరిగిపోయిందని టాక్. మూవీ రన్ టైమ్ 2 గంటల 35 నిమిషాలు అని తెలుస్తోంది. కాగా, సంక్రాంతి బరిలో ‘వాల్తేరు వీరయ్య’తోపాటు బాలయ్య ‘వీరసింహారెడ్డి’ కూడా నిలువనుంది. దీని ఫైనల్ కట్ ఎంత వచ్చిందనేది తెలియాల్సి ఉంది. యాక్షన్ సీన్లు ఎక్కువగా ఉండటంతో నిడివి కాస్త ఎక్కువగా ఉండే చాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ రెండు సినిమాలతోపాటు దళపతి విజయ్ ‘వారసుడు’, తల అజిత్ కుమార్ ‘తునివు’ ఫైనల్ కట్ ఎంతనేది కూడా తేలాల్సి ఉంది.

Read more: Tollywood : కేజీఎఫ్‌ నుంచి లవ్‌ టుడే వరకు.. 2022లో తెలుగులోనూ అదరగొట్టిన డబ్బింగ్ సినిమాలు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!