Rangamarthanda: ‘నేనొక నటుడ్ని’ అంటూ.. ‘రంగమార్తాండ’ కోసం షాయరీ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)

Updated on Dec 21, 2022 01:33 PM IST
నటుడు పడే కష్టనష్టాలు, పాత్ర కోసం పడే తపన, వేదనను తెలియజెప్పే షాయరీని చిరు (Chiranjeevi) తన గళంతో ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా చెప్పారు
నటుడు పడే కష్టనష్టాలు, పాత్ర కోసం పడే తపన, వేదనను తెలియజెప్పే షాయరీని చిరు (Chiranjeevi) తన గళంతో ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా చెప్పారు

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ (Krishna Vamsi) సినిమాలు ఎంత వైవిధ్యంగా ఉంటాయో తెలిసిందే. ‘అంతఃపురం’ ‘సింధూరం’, ‘ఖడ్గం’ లాంటి డిఫరెంట్ మూవీస్‌తోపాటు ‘నిన్నే పెళ్లాడతా’, ‘మురారి’, ‘చందమామ’ వంటి కుటుంబ కథా చిత్రాలు తీసి హిట్ కొట్టడమూ ఆయనకే చెల్లింది. సింపుల్ కథను హాస్యం, భావోద్వేగాలు మిళితం చేసి ఆయన చెప్పే తీరుకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. హీరోలతోపాటు హీరోయిన్ల పాత్రలను కృష్ణవంశీ ఎంతో అందంగా చూపిస్తారు. ఆయన చిత్రాల్లోని పాటలును చూస్తే అది అర్థమవుతుంది.  

కొన్నాళ్లుగా కృష్ణవంశీకి సరైన సక్సెస్ పడలేదు. ‘నక్షత్రం’ తర్వాత ఆయన దర్శకత్వంలో మరో మూవీ రాలేదు. అయితే ఇప్పుడు ‘రంగమార్తాండ’ చిత్రంతో ఆడియెన్స్‌ను మరోసారి పలకరించేందుకు ఈ క్రియేటివ్ జీనియస్ సిద్ధమవుతున్నారు. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం వంటి స్టార్ కాస్టింగ్ ఇందులో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఆడియో క్లిప్ విడుదలైంది. ఈ మూవీ కోసం డైలాగ్ రైటర్ లక్ష్మీభూపాల్ రాసిన ఓ కవితా ఝరికి మెగాస్టార్ చిరంజీవి తన గొంతును అందించారు. ‘నేనొక నటుడ్ని’ అంటూ చిరు తన గళంతో ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా చెప్పారు. దీనికి మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా స్వరాలు అందించారు. 

‘నేనొక నటుడ్ని.. చింకీల బట్టలు వేసుకుని, అట్ట కిరీటం పెట్టుకుని, చెక్క కత్తి పట్టుకుని కాయితం పూల వర్షంలో కీలు గుర్రంపై స్వారీ చేసే చక్రవర్తిని నేను’ అంటూ చిరంజీవి చెప్పిన షాయరీ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఒక నటుడు పడే కష్టనష్టాలతోపాటు పాత్రను పండించడం కోసం పడే వేదనను తెలియజెప్పేలా ఈ కవితా ఝరి సాగింది. ‘గతానికి వారధి నేను, వర్తమాన సారధి నేను, రాబోయే కాలంలో రాయబోయే చరిత్ర నేను’ అనే లైన్స్ చాలా ఇంటెన్స్‌గా ఉన్నాయని ఈ షాయరీపై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇక చాలా కాలంగా సెట్స్‌‌పై ఉన్న ‘రంగమార్తాండ’ (Rangamarthanda) సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని మూవీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కృష్ణవంశీ నుంచి వస్తున్న చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్ పై ఆడియెన్స్‌లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ‘రంగమార్తాండ’కు సంబంధించి రిలీజైన ఇళయరాజా మ్యూజిక్ సిట్టింగ్స్‌, బ్రహ్మానందం, ప్రకాశ్ రాజ్‌ డబ్బింగ్‌ వీడియోలు, స్టిల్స్‌ సోషల్ మీడియాలో హల్‌‌చల్ చేస్తున్నాయి. తాజాగా విడుదలైన చిరు కవితా ఝరి సినిమా మీద మరింత అంచనాలను పెంచుతోంది. మరి, ‘రంగమార్తాండ’ క్రియేటివ్ డైరెక్టర్ ఎన్ని సంచనాలు సృష్టిస్తారో చూడాలి. 

Read more: Waltair Veerayya: మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య’ మల్టీస్టారరా?.. స్క్రీన్‌పై రవితేజ (Ravi Teja) అంతసేపు ఉంటారా..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!