సినిమాలో క‌మెడియ‌న్స్ లేకున్నా ప‌ర్వాలేదు.. కానీ కామెడీ ఉండాలి : బ్ర‌హ్మానందం (Brahmanandam)

Updated on Jun 06, 2022 01:12 PM IST
ఎఫ్‌ 3 లో న‌టించ‌డం ఆనందంగా అనిపించింది : బ్ర‌హ్మానందం (Brahmanandam)
ఎఫ్‌ 3 లో న‌టించ‌డం ఆనందంగా అనిపించింది : బ్ర‌హ్మానందం (Brahmanandam)

క‌మెడియ‌న్ బ‌హ్మానందం (Brahmanandam) అంటేనే చిత్ర విచిత్ర హావ‌భావాల‌తో హాస్యాన్ని పండించే న‌టుడు. కామెడీతో ప్రేక్షకులకు చ‌క్కిలిగింత‌లు పెట్టడం బ్ర‌హ్మీకే సాధ్యం.

ఇటీవలే ఎఫ్ 3 (F3) చిత్ర యూనిట్‌తో బ్ర‌హ్మానందం ఓ షో చేశారు.

ఎఫ్ 3 సక్సెస్ సందర్భంగా నిర్వహించిన ఈ షోను 'కింగ్ ఆఫ్ కామెడీ విత్ ఫ‌న్‌టాస్టిక్'  పేరిట నిర్వహించారు. ఈ షోలో బ్ర‌హ్మానందంతో పాటు వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్, అలీ, అనిల్ రావిపూడి సంద‌డి చేశారు. స‌ర‌దాగా ఈ నటులందరూ క‌లిసి మాట్లాడుకున్నారు. అలాగే బ్ర‌హ్మానందం గతంలో నటించిన కామెడీ సీన్‌ల‌ను అనుకరిస్తూ న‌వ్వులు పంచారు.

ఎఫ్‌ 3 లో న‌టించ‌డం ఆనందంగా అనిపించింది : బ్ర‌హ్మీ (Brahmanandam)

క‌రోనా కార‌ణంగా ఎఫ్3 ఫ‌స్ట్ ఆఫ్‌లో చేయ‌లేక‌పోయాన‌ని బ్ర‌హ్మానందం చెప్పారు. ఎఫ్ 3 సెకండ్ ఆఫ్‌లో చేయ‌డం సంతోషంగా  ఉందన్నారు. ఎఫ్ 3 టీంతో జ‌రిగిన చిట్ చాట్‌లో బ్ర‌హ్మానందం చాలా విష‌యాలను షేర్ చేసుకున్నారు. టాలీవుడ్‌లో ఒక‌ప్పుడు వ‌రుస‌గా కామెడీ సినిమాలు వ‌చ్చేవ‌ని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆయన వాపోయారు. క‌థ‌ను డామినేట్ చేసే కామెడీ సినిమాలు క‌డుపుబ్బ న‌వ్విస్తాయ‌న్నారు. ఇదే క్రమంలో, హాస్యాన్ని పండించే సినిమాలు చేస్తున్న అనిల్ రావిపూడిని బ్ర‌హ్మానందం ప్ర‌శంసించారు.

అలాగే వెంక‌టేష్ నటనను కూడా బ్రహ్మానందం కొనియాడారు. ఆయన ద‌ర్శ‌కుడు ఏం చెబితే అది చేస్తార‌న్నారు. ద‌ర్శ‌కుడి విష‌యంలో వెంక‌టేష్ జోక్యం చేసుకోర‌ని.. సినిమాలో ఎలా న‌టించ‌మంటే, అలాగే న‌టిస్తార‌ని చెప్పుకొచ్చారు. వెంక‌టేష్ చేసే కామెడీ చాలా బాగుంటుంద‌ని బ్ర‌హ్మానందం మెచ్చుకున్నారు. 

క‌మెడియ‌న్లు లేకున్నా ప‌ర్వాలేదు.. కామెడీని బతికించండి : బ్ర‌హ్మానందం
తెలుగు సినీ దర్శకులకు ఓ బ్ర‌హ్మానందం ఓ విషయాన్ని విన్నవించారు. విరివిగా కామెడీ సినిమాలు రావాల‌్సిన అవసరం ఉందని తెలిపారు. ద‌క్షిణాదిలో ఉన్నటువంటి హాస్యనటులు ఇంకెక్క‌డా లేర‌న్నారు. అంతే కాకుండా, సినిమాలో క‌మెడియ‌న్లు లేకపోయినా.. కామెడీ మాత్రం ఉండాల‌న్నారు. సినిమాలో ఎప్పుడ‌న్నా న‌వ్వుకోవ‌డం కాకుండా.. సినిమా మొత్తం న‌వ్వుకుని ఎంజాయ్ చేసేలా ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి సినిమాలు ఉంటాయని బ్ర‌హ్మానందం అభిప్రాయపడ్డారు.

నటికిరీటి రాజేంద్ర‌ప్ర‌సాద్ కూడా కామెడీ సినిమాల‌ ద్వారానే, ఎంతో ఖ్యాతిని గడించిన విషయాన్ని బ్రహ్మానందం పేర్కొన్నారు. ఇక హీరోలలో వెంక‌టేష్, చిరంజీవి, నాగార్జున‌, బాల‌కృష్ణ.. ఇలా ఒక్కొక్క‌రు ఒక్కో స్టైల్లో కామెడీ చేసి మెప్పిస్తార‌న్నారు. అనిల్ రావిపూడి కామెడీ చిత్రాలలో కొత్త ఒరవడి తీసుకొస్తున్నారని.. హీరోల ద్వారా కామెడీని ఎలా రాబట్టాలో తెలిసిన ద‌ర్శ‌కుడని బ్ర‌హ్మానందం కొనియాడారు. ఎఫ్ 3 చిత్రంలో నటుల నుండి, ఎంత న‌ట‌నను పిండాలో అంతా దర్శకుడు పిండేశార‌న్నారు. ఇక అలీ విషయానికి వస్తే, ఇంగ్లీష్‌లా వెరైటీ భాష మాట్లాడి న‌వ్వించడం ఆయనకే సాధ్యమన్నారు బ్రహ్మీ

ఎఫ్3 (F3) సినిమా.. ఎఫ్  2 చిత్రానికి సీక్వెల్‌గా రిలీజ్ అయింది. 

ఈ చిత్రంలో వెంకేటేష్, వ‌రుణ్ తేజ్, త‌మ‌న్నా, మెహ్రీన్ కౌర్ లీడ్ రోల్స్‌లో న‌టించి కామెడీ అద‌ర‌గొట్టారు. అలాగే సోనాల్ చౌహాన్ ఓ డిఫెరెంట్ పాత్ర‌లో న‌టించారు.ఇక, పూజా హెగ్డే ఐటం సాంగ్‌లో న‌టించారు. ప్రస్తుతం ఈ చిత్రం బాగానే కాసుల వర్షం కురిపిస్తోంది. 

Read More: https://telugu.pinkvilla.com/entertainment/tollywood-stars-victory-venkatesh-and-varun-tej-starrer-f-3-movie-three-days-collections-report-worldwide-908

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!