కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) కొడుకు పెట్టిన పోజులకు సోషల్ మీడియా ఫిదా.. ఎమోషనల్ పోస్ట్ చేసిన హీరోయిన్!

Updated on Oct 20, 2022 02:26 PM IST
ఎప్పుడూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే.. కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఏ చిన్న విషయమైనా ఇన్ స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంటుంది.
ఎప్పుడూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే.. కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఏ చిన్న విషయమైనా ఇన్ స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంటుంది.

టాలీవుడ్ ‘చందమామ’ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఈ ఏడాది జూన్ 19న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ భామ ప్రస్తుతం తల్లిగా మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తోంది. అలాగే తల్లిగా తను పొందే ఆనందాన్ని అందరితో పంచుకుంటోంది. తన కొడుకు పుట్టి ఆరు నెలలు పూర్తి కావొస్తున్న సందర్భంగా తాజాగా ఓ పోస్ట్ చేసింది. అందులో తన కొడుకు గురించి చెబుతూ.. తల్లిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తుండటం ఎంత సంతోషంగా ఉందో చెప్పుకొచ్చింది.

ఎప్పుడూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే.. కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఏ చిన్న విషయమైనా ఇన్ స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంటుంది. ప్రస్తుతం ఆమె పెట్టిన ఓ అందమైన పోస్ట్ అభిమానుల హృదయాలను హత్తుకుంటోంది. ఇందులో కాజల్ కొడుకు పెట్టిన పోజు చూసి అందరూ ఫిదా అవుతున్నారు. ఆమె ఈ పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే 6లక్షల మంది లైక్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.  

'గత ఆరు నెలలు నా జీవితంలో ఎలా గడిచిపోయాయో నాకు తెలియడం లేదు.. ఎంతో సంతోషంగా గడిచిపోయాయి. యంగ్‌గా ఉన్నప్పుడు.. నేను ఓ తల్లిలా నా కర్తవ్యాన్ని నెరవేరుస్తానా? లేదా? అన్న అనుమానం, భయం నాలో ఉండేది. ఇప్పటికీ గొప్ప తల్లిని ఎలా అవ్వాలో నేర్చుకుంటూనే ఉన్నాను' అని పేర్కొంది. 

'ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. నీ కోసం సమయం కేటాయిస్తాను. నీపై ఎప్పుడూ అశ్రద్ద చూపించను. రాత్రుల్లో నువ్ అటూ ఇటూ దొర్లడం, నేలపై పాకడం చూసి సంతోషపడుతున్నాను. నీ జీవితంలో తొలిసారి జరిగే ప్రతి మూమెంట్ నాకు ఇంకా గుర్తున్నాయి' అని చెప్పొకొచ్చింది.

నువ్వు రాత్రిపూట చేసే అల్లరి నాకు సంతోషాన్ని ఇస్తుంది. నేను, మీ నాన్న (Gautam Kitchlu) నీ గురించి సరదాగా మాట్లాడుకుంటాము. నీ కాలేజ్ రోజులను తలచుకుంటూ నవ్వుకుంటున్నాం.  నీకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని నేను గుర్తుపెట్టుకుంటాను. నీకు జన్మనిచ్చే అవకాశం ఆ భగవంతుడు నాకు ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. తల్లిగా చేసే బాధ్యతలు గొప్పవని అందరూ అంటుంటారు. ఇదంతా నాకు కొత్తే గానీ ఎంతో సంతోషంగా ఉంది. నువ్వు పుట్టి ఏడాది అవ్వడానికి ఇంకా సగం దూరం ఉంది. మై లవ్ మై బేబీ నీల్’ (Neil Kitchlu) అంటూ కాజల్ రాసుకొచ్చింది.

Read More: ‘చంద్రముఖి’ (Chandramukhi) సీక్వెల్ లో చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal)..?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!