Ram Charan RC 15 Workout Video: వెకేషన్‌లోనూ తగ్గేదేలే!.. రెస్ట్ లేకుండా చెమటోడ్చుతున్న రామ్ చరణ్​!

Updated on Nov 17, 2022 02:38 PM IST
రామ్ చరణ్ (Ram Charan)​ ఫిట్‌నెస్ చేస్తున్న వీడియోలను చూస్తే.. విశ్రాంతి అనేదే లేకుండా మెగా పవర్ స్టార్ చెమటోడ్చుతున్నారని అర్థమవుతోంది
రామ్ చరణ్ (Ram Charan)​ ఫిట్‌నెస్ చేస్తున్న వీడియోలను చూస్తే.. విశ్రాంతి అనేదే లేకుండా మెగా పవర్ స్టార్ చెమటోడ్చుతున్నారని అర్థమవుతోంది

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్​ (Ram Charan)​ ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారారు. ‘ఆర్ఆర్ఆర్’తో ఆలిండియా ఇమేజ్‌ను ఆయన సొంతం చేసుకున్నారు. ఈ చిత్రంతో ఫారెన్ ఆడియెన్స్‌లోనూ ఆయనకు పాపులారిటీ పెరిగింది. చరణ్ డ్యాన్సులు, స్టైలిష్ లుక్స్, డైలాగ్ డెలివరీకి అందరూ ఫిదా అవుతున్నారు. ఆయనతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు, దర్శకులు ఎగబడుతున్నారు. అయితే చరణ్ మాత్రం నిదానమే ప్రధానం అంటున్నారు. మంచి స్క్రిప్టులకు మాత్రమే ఓకే చెప్పాలని ఆయన భావిస్తున్నారు. అందుకే శంకర్ సినిమా తర్వాత ఆయన నటించబోయే చిత్రమేదనేది ఇంకా స్పష్టత రాలేదు.

ఇకపోతే, శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాకు వర్కింగ్ టైటిల్ ఆర్‌సీ15 (RC15) అనే సంగతి తెలిసిందే. ఈ మూవీ చిత్రీకరణ కోసం చరణ్​ తాజాగా విదేశాలకు వెళ్లినట్లు తెలిసింది. అక్కడ చరణ్​, కియారా అద్వాణీ మధ్య సాంగ్‌ను షూట్ చేసేందుకు శంకర్ ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం దాదాపుగా రూ.15 కోట్ల ఖర్చును వెచ్చించనున్నట్లు సమాచారం. అయితే అక్కడ అలా షూటింగ్ కోసం వెళ్లినా, గ్యాప్ దొరికినా.. వెకేషన్లకు వెళ్లినా కూడా వర్కౌట్లకు మాత్రం చరణ్ డుమ్మా కొట్టడం లేదు. 

ఫిట్‌నెస్ చేస్తున్న వీడియోను చరణ్​ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో చరణ్​ తన టీమ్‌తో కలసి చేసిన అల్లరి, వర్కౌట్లు మామూలుగా వైరల్ కావడం లేదు. చరణ్​ క్రమశిక్షణ, సినిమాలపై ఆయనకు ఉన్న నిబద్ధతను చూసి నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. ఇకపోతే, ఆర్‌సీ15ను శంకర్ పాన్ ఇండియా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే పూణె, రాజమండ్రి, అమృత్‌సర్, వైజాగ్ షెడ్యూల్స్‌కు సంబంధించిన షూటింగ్ అప్‌డేట్స్.. అక్కడి నుంచి లీకైన చరణ్​ ఫొటోలు, వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఫారెన్ షెడ్యూల్ వీడియోలు ట్రెండింగ్ అవుతున్నాయి. 

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్​ నటిస్తున్న చిత్రం కావడంతో ‘ఆర్‌సీ15’పై అంచనాలు ఒక రేంజ్‌లో ఉన్నాయి. అందులోనూ కోలీవుడ్ దిగ్దర్శకుడు శంకర్ తీస్తున్న చిత్రం కావడంతో ఎక్స్‌పెక్టేషన్స్ మరింతగా పెరిగిపోయాయి. సరైన హిట్స్ లేక డీలాపడ్డ శంకర్.. ఈ మూవీతో తన సత్తా చూపించాలని భావిస్తున్నారు. మరి, ఈ చిత్రంతో ఆయన అనుకున్న ఫలితాన్ని అందుకుంటారేమో చూడాలి. 

Read more: రిషబ్ శెట్టి (Rishab Shetty)కి గోల్డ్ చైన్ బహూకరించిన రజినీ (Rajinikanth).. ‘కాంతార’ దర్శకుడిపై మెచ్చుకోలు!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!