Avatar 2: 'అవతార్‌', 'అవతార్ - ద వే ఆఫ్ వాటర్' సినిమాల గురించిన ఆసక్తికర విశేషాలు..

Updated on Dec 21, 2022 10:04 AM IST
Avatar 2: 'అవతార్' చిత్రం 2009లో జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.
Avatar 2: 'అవతార్' చిత్రం 2009లో జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.

Avatar 2: 'అవతార్' చిత్రం 2009లో జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ డాలర్లును కొల్లగొట్టింది. ప్రపంచంలోనే భారీ బడ్జెట్ సినిమాగా 'అవతార్' సినిమా తెరకెక్కింది. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రికార్డులను బద్దలు కొట్టి.. కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. 'అవతార్' సినిమాతో పోల్చిస్తే "అవతార్ - ద వే ఆఫ్ వాటర్"  (Avatar : The Way of Water) సినిమాలో ఉన్న ప్రత్యేకతలపై పింక్ విల్లా స్పెషల్ స్టోరీ.

అవతార్ - ద వే ఆఫ్ వాటర్

రెండు సినిమాల కథలేంటి?

'అవతార్' సినిమాలో ఓ మనిషిని పండోరాగా ఎలా మారాడనే కథ సాగింది. పండోరా గ్రహం మీద అన్-అబ్టేనియం అనే విలువైన ఖనిజం సొంతం చేసుకోవాలనే భూలోక వాసులు భావిస్తారు. పండోరాగా మారిన మనిషికి అవతార్ అని పేరు పెట్టారు. అవతార్ పండోరా జాతికి చెందిన రాణితో ప్రేమలో పడతాడు. ఆమెతోనే ఉంటూ పండోరాలకు రక్షణగా నిలుస్తాడు. 

ఇక అవతార్ సినిమా సీక్వెల్ విషయానికి వస్తే.. జేక్ సల్లీ పండోరాగా మారడం నచ్చని కల్నల్ వారిపై దాడి చేయాలనుకుంటాడు. ఆ దాడిలో అవతార్ కుటుంబం చిక్కుకుంటుంది. దాడి నుంచి తప్పించుకునేందుకు జలవాసుల సహాయం కోరతారు. పండోరాలు జలవాసులతో కలిసి శత్రులపై చేసే యుద్ధమే 'అవతార్ 2' (Avatar 2) కథ.

అవతార్ - ద వే ఆఫ్ వాటర్

బడ్జెట్ ఎంతో తెలుసా!

'అవతార్' సినిమాను దాదాపు రూ. 237 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఇక 'అవతార్ :  ద వే ఆఫ్ వాటర్' చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమా కోసం రూ . 350 మిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేశారు. అంటే భారతీయ లెక్కల ప్రకారం 'అవతార్' సినిమాను రూ. 2 వేల కోట్లతో నిర్మిస్తే.. 'అవతార్ 2' చిత్రాన్ని రూ. దాదాపు రూ. 3 వేల కోట్లతో రూపొందించారు.

అవతార్ - ద వే ఆఫ్ వాటర్

కోవిడ్ ఎఫెక్ట్

'అవతార్' సినిమా విడుదలకు ఎలాంటి అడ్డంకులు లేవు. 'అవతార్ 2' సినిమా కోవిడ్ కారణంగా ఆలస్యంగా విడుదలైంది. కోవిడ్ ప్రభావం 'అవతార్ 2' సినిమా కలెక్షన్లపై కూడా ఎక్కువగానే ఉంది. ఓటీటీలో సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. 'అవతార్ 2' కొత్త టెక్నాలజీతో రిలీజ్ కావడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. 

అవతార్ - ద వే ఆఫ్ వాటర్

టెక్నాలజీ విశేషాలు

'అవతార్' సినిమా రిలీజ్ అయినప్పుడు కొన్ని థియేటర్లలోనే 3డీ సినిమాను రిలీజ్ చేశారు. 2009లో రిలీజ్ అయిన సినిమాను 2010లో మళ్లీ 3డీ, ఐమాక్స్ ఫార్మాట్లలో విడుదల చేశారు.

'అవతార్ : ద వే ఆఫ్ వాటర్' సినిమా రియల్ 3డీ, డాల్‌బే సినిమా, ఐమాక్స్, ఐమాక్స్ 3డీ ఫార్మాట్లలో విడుదలైంది.

అవతార్ - ద వే ఆఫ్ వాటర్

ఎన్ని స్క్రీన్లు

'అవతార్' ప్రపంచ వ్యాప్తంగా 14 వేల స్క్రీన్లలో విడుదల చేశారు. 2,200ల స్క్రీన్లలో  3డీ ఫార్మెట్‌లో విడుదల చేశారు. 'అవతార్ 2' సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 160 దేశాల్లో 50 వేలకు పైగా స్క్రీన్లలో విడుదలైంది.

అవతార్ - ద వే ఆఫ్ వాటర్

ఎన్ని భాషల్లో విడుదల!

'అవతార్' సినిమా ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ అయింది. 'అవతార్ 2' సినిమా ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ అయింది. 

అవతార్ - ద వే ఆఫ్ వాటర్

ఎంత నిడివి?

'అవతార్' సినిమాను 162 నిమిషాల నిడివితో విడుదల చేశారు. 'అవతార్ 2' సినిమా 192 నిమిషాల నిడివి ఉంది. మొదటి భాగం కన్నా రెండో భాగాన్ని ఓ అరగంట సమయాన్ని పెంచారు దర్శకుడు జేమ్స్ కామెరాన్.

సంగీతం
జేమ్స్ రాయ్ హార్నర్ 'అవతార్' సినిమాకు సంగీతం అందించారు. అవతార్ విడుదల తరువాత జేమ్స్ రాయ్ హార్నర్ మరణించారు. దీంతో అతని వద్ద సహాయకుడిగా పనిచేసిన సైమన్ ఫ్రాంగ్లెన్  'అవతార్ 2' సినిమాకు సంగీతం సమకూర్చారు.

అవతార్ - ద వే ఆఫ్ వాటర్

వసూళ్లు

'అవతార్' సినిమా రూ. 2.923 బిలియన్ డాలర్లును వసూళ్లు చేసి చరిత్ర సృష్టించింది.  'అవతార్ 2' చిత్రం విడుదలైన ఐదు రోజుల్లో రూ. 441 మిలియన్ డాలర్లుకు పైగా వసూళ్లు చేసింది. అంటే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసింది. 

అవతార్ - ద వే ఆఫ్ వాటర్

తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు 

తెలుగు రాష్ట్రాల్లో 'అవతార్' విడుదలైనప్పుడు రెండు రోజుల్లో రూ. 22 కోట్లు వసూళ్లు చేసింది. 'అవతార్ 2' రెండు రోజుల్లో రూ. 25 కోట్లు వసూళ్లు చేసి అవతార్ సినిమా రికార్డును బ్రేక్ చేసింది.

Read More: Avatar: The Way of Water: "అవతార్ : ద వే ఆఫ్ వాటర్" చిత్రం ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటుందో తెలుసా!

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!