నాని (Hero Nani) లేటెస్ట్ మూవీ 'దసరా' (Dasara) నుంచి కీలక అప్డేట్.. చివరి షెడ్యూల్ షూటింగ్‌ ప్రారంభం!

Updated on Dec 21, 2022 11:33 AM IST
తాజాగా ‘దసరా’ సినిమా (Dasara) నుంచి ఓ అప్డేట్ విడుదలయింది. ఈ సినిమాకు సంబంధించిన చివరి షెడ్యూల్ షూటింగ్‌ను ప్రారంభించినట్లుగా నాని తన ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొన్నాడు.
తాజాగా ‘దసరా’ సినిమా (Dasara) నుంచి ఓ అప్డేట్ విడుదలయింది. ఈ సినిమాకు సంబంధించిన చివరి షెడ్యూల్ షూటింగ్‌ను ప్రారంభించినట్లుగా నాని తన ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొన్నాడు.

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని (Hero Nani) నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా సినిమా ‘దసరా’ (Dasara). ఈ మూవీకి కొత్త డైరెక్ట‌ర్‌ శ్రీకాంత్ ఓదెల (Srikanth odela) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ సింగరేణి గనుల నేపథ్యంలో రాబోతోంది.  శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌ పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్ గా నటిస్తోంది.  

చాలా రోజుల నుంచి షూటింగ్ జరపుకుంటున్న ‘దసరా’ (Dasara) సినిమా కోసం భారీ విలేజ్ సెట్ నిర్మించి నాచుర‌ల్ లొకేష‌న్స్‌లో చిత్రీక‌రించారు. పూర్తి మాస్ లుక్ లో నాని పాత్ర ఉండబోతోంది. మొత్తం తెలంగాణ యాసలో సాగే ఈ సినిమాలో హీరో నాని పాత్ర ప్రేక్షకులను కట్టిపడేస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

మాస్ ఎంట‌ర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ‘ద‌స‌రా’ (Dasara) చిత్రానికి సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో జ‌రీనా వ‌హ‌బ్, సాయికుమార్, స‌ముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎడిటర్‌ గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా అవినాష్‌ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా విజయ్‌ చాగంటి వ్యవహరిస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. తాజాగా ‘దసరా’ సినిమా (Dasara) నుంచి ఓ అప్డేట్ విడుదలయింది. ఈ సినిమాకు సంబంధించిన చివరి షెడ్యూల్ షూటింగ్‌ను ప్రారంభించినట్లుగా నాని తన ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఈ మేరకు “చివరి షెడ్యూల్‌ లో మొదటి రోజు.. మనస్సు, శరీరం, హృదయం, ఆవేశం దాని పూర్తి సామర్థ్యంతో” అని రాసుకొచ్చారు. కాగా, ఈ షెడ్యూల్ లో 15 రోజులపాటు కొనసాగనున్న క్లైమాక్స్ సీక్వెన్స్ ను షూట్ చేయనున్నారు.

Read More: 'దసరా' (Dasara Movie) నుంచి అదిరిపోయే అప్ డేట్.. నాని (Hero Nani) ఊర మాస్ లుక్ మామూలుగా లేదుగా..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!