పెళ్లపీటలెక్కబోతున్న బుల్లితెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు (Anchor Pradeep Machiraju).. వధువు ఎవరంటే?

Updated on Dec 21, 2022 04:49 PM IST
వెండితెర‌పై ప్రభాస్ (Prabhas) పెళ్లి ఎంత హాట్ టాపిక్ గా మారందో.. బుల్లితెరపై యాంకర్ ప్రదీప్ (Anchor Pradeep) పెళ్లి కూడా అంతే వైరల్ అవుతోంది.
వెండితెర‌పై ప్రభాస్ (Prabhas) పెళ్లి ఎంత హాట్ టాపిక్ గా మారందో.. బుల్లితెరపై యాంకర్ ప్రదీప్ (Anchor Pradeep) పెళ్లి కూడా అంతే వైరల్ అవుతోంది.

బుల్లితెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు (Anchor Pradeep Machiraju) అందరికీ సుపరిచితుడే. తెలుగు టెలివిజన్ రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో ప్రదీప్ ఒకరు. ఆయన వెండితెరపై కూడా పలు సినిమాలలో కీలక పాత్రలు పోషించారు. తొలుత ఆర్జేగా కెరీర్‌ ప్రారంభించిన ప్రదీప్ ఆ తర్వాత సినిమాలో చిన్న చిన్న పాత్రలు చేశారు. అనంతరం బుల్లితెరపై యాంకర్ గా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రేక్షకుల‌ను ఎంతగానో అలరించాడు. 

యాంకర్ ప్రదీప్ (Anchor Pradeep) ఆ మధ్య.. ‘30రోజులలో ప్రేమించడం ఎలా’ అనే సినిమాలో హీరోగా కూడా నటించారు. ఈ సినిమా ద్వారా హీరోగా అందరిని మెప్పించిన ప్రదీప్ తదుపరి ఎలాంటి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఆ తర్వాత యధావిధిగా బుల్లితెర కార్యక్రమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. 

ఇదిలా ఉంటే.. వెండితెర‌పై ప్రభాస్ (Prabhas) పెళ్లి ఎంత హాట్ టాపిక్ గా మారందో.. బుల్లితెరపై యాంకర్ ప్రదీప్ (Anchor Pradeep) పెళ్లి కూడా అంతే వైరల్ అవుతోంది. ప్రదీప్ ఏ ఈవెంట్లలో పాల్గొన్నా తన పెళ్లి గురించే పెద్ద ఎత్తున వార్తలు ప్రస్తావనకు వస్తాయి. అయితే, ఆ మధ్యకాలంలో ఆయన పెళ్లి గురించి ఎన్నో ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. అప్పట్లో వాటిని ప్రదీప్ చాలావారకు ఖండిస్తూ వచ్చారు. 

అయితే, తాజాగా ప్రదీప్ (Anchor Pradeep) పెళ్లిపై మరోసారి వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ సారి నిజంగానే ప్రదీప్ పెళ్లి ఫిక్స్ అయినట్లు.. త్వరలోనే ఆయన పెళ్లి పీటలెక్కబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నవ్య మారోతు (Navya Marothu)తో ప్రదీప్ ప్రేమలో ఉన్నాడని త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుస్తోంది. 

ప్రదీప్-నవ్య ప్రేమ విషయాన్ని ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించడంతో త్వరలోనే వీరిద్దరూ ఒకటి కానున్నారట. ఇప్పటికే ఇరువర్గాల మధ్య పెళ్లికి సంబంధించిన చర్చలు మొదలయ్యాయని తొందర్లోనే అధికారిక ప్రకటన కూడా చేస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. నవ్య మారోతు ఇటీవల ముగిసిన బిగ్ బాస్ సీజన్ 6 (Telugu Biggboss) కంటెస్టెంట్లలో ఎంతోమందికి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసంది. అంతేకాకుండా సీరియల్ యాక్టర్లు, యాంకర్లు ఇలా ఎంతోమందికి ఆమె కాస్ట్యూమ్స్ అందించి మంచి పేరును సంపాదించింది.

Read More: గోవా బీచ్ లో హాట్ అందాలతో రెచ్చిపోయిన యాంకర్ శ్రీముఖి (Sreemukhi).. ఫొటోలు వైరల్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!