పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), ప్రభాస్ (Prabhas) సినిమా షూటింగ్స్‌ ఒకే చోట.. రామోజీ ఫిలిం సిటీలో సందడే సందడి!

Updated on Oct 30, 2022 02:34 PM IST
పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’, ప్రభాస్ (Prabhas) నటిస్తున్న ‘సలార్’ సినిమా షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి.
పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’, ప్రభాస్ (Prabhas) నటిస్తున్న ‘సలార్’ సినిమా షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి.

ఒకరు పాన్‌ ఇండియా స్టార్, మరొకరు పవర్ స్టార్.. ఈ ఇద్దరి సినిమా షూటింగ్‌లు ఒకే చోట జరుగుతున్నాయంటే సందడి మామూలుగా ఉండదు. అందులోనూ రెండు సినిమాలూ భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నవే అయితే.. ఇక ఆ ప్లేస్‌లో ఉండే హడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ఇదే పరిస్థితి. ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం.

వకీల్‌సాబ్, భీమ్లానాయక్ సినిమాలు భారీ హిట్‌ సాధించిన జోష్‌లో ఉన్నారు పవర్‌‌స్టార్ పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan). అదే జోరుతో మరో హిట్‌ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. రాజకీయాలు, సినిమాలకు సమానంగా సమయాన్ని కేటాయిస్తూ.. శరవేగంగా సినిమాలను పూర్తి చేసే పనిలో బిజీబిజీగా గడుపుతున్నారు పవన్‌ కల్యాణ్.

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’, ప్రభాస్ (Prabhas) నటిస్తున్న ‘సలార్’ సినిమా షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి.

టాలెంటెడ్‌ డైరెక్టర్‌‌ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న పీరియాడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’. పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. హరిహర వీరమల్లు సినిమా నుంచి విడుదలైన ఫస్ట్‌ లుక్, సినిమాకు సంబంధించి ఇటీవల నిర్వహించిన వర్క్‌షాప్‌కు హాజరైన సమయంలో పవన్ ఇంటెన్స్‌ లుక్ సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేశాయి.

ఏఎం రత్నం, ఎం.దయాకరరావు సంయుక్తంగా నిర్మిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో పవన్‌ కల్యాణ్‌ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. పోరాట ఘట్టాలను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. గుర్రాలతో సాగే యాక్షన్ సీన్లు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని టాక్.

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’, ప్రభాస్ (Prabhas) నటిస్తున్న ‘సలార్’ సినిమా షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి.

ఇక, బాహుబలి సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌‌గా పేరు తెచ్చుకున్నారు ప్రభాస్ (Prabhas). ఈ సినిమా తర్వాత ఆయన నటించిన సాహో, రాధే శ్యామ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో సందడి చేయలేకపోయాయి. అయినా, ప్రభాస్ రేంజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా స్టార్ చేతిలో ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్‌ కె సినిమాలతోపాటు స్పిరిట్, మారుతి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ఉన్నాయి. వీటిలో ఆదిపురుష్ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కాగా, సలార్, ప్రాజెక్ట్‌ కె సినిమా షూటింగ్స్‌ జరుగుతున్నాయి.

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’, ప్రభాస్ (Prabhas) నటిస్తున్న ‘సలార్’ సినిమా షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి.

కేజీఎఫ్‌ సినిమాలతో...

కేజీఎఫ్‌ సిరీస్ సినిమాలతో విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆ సినిమాకు వచ్చిన క్రేజ్‌తో ఆయన ఏ సినిమా చేస్తున్నా ఆ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇక, ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ‘సలార్’పై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తైనట్టు సమాచారం. ఈ క్రేజీ సినిమా షూటింగ్‌ కూడా రామోజీ ఫిలిం సిటీలోనే జరుగుతోంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్‌లో సలార్ సినిమాకు సంబంధించిన భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను తెరకెక్కిస్తున్నారని టాక్. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ పోస్టర్‌‌లో ప్రభాస్ మాస్ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

పవర్‌‌స్టార్‌‌ పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న ‘సలార్’ సినిమా షూటింగ్స్‌ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్నాయి. ఇద్దరు హీరోల అభిమానులు తమ అభిమాన హీరో సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు.

Read More : ట్విట్టర్‌‌లోనూ మహేష్‌బాబు(MaheshBabu) సూపర్‌‌స్టారే..13మిలియన్ల ఫాలోవర్స్‌తో సౌత్‌ఇండియా స్టార్‌‌గా రికార్డు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!