Tollywood : తమిళంలోనూ కోట్లు కొల్లగొట్టిన టాప్‌10 తెలుగు సినిమాలు

Updated on Nov 22, 2022 03:39 PM IST
టాలీవుడ్‌ (Tollywood) సినిమాలకు అన్ని భాషల్లోనూ క్రేజ్ పెరుగుతోంది. తెలుగు సినిమాలు తమిళంతోపాటు, మలయాళ, కన్నడ భాషల్లో కూడా విడుదలవుతున్నాయి
టాలీవుడ్‌ (Tollywood) సినిమాలకు అన్ని భాషల్లోనూ క్రేజ్ పెరుగుతోంది. తెలుగు సినిమాలు తమిళంతోపాటు, మలయాళ, కన్నడ భాషల్లో కూడా విడుదలవుతున్నాయి

టాలీవుడ్‌ (Tollywood) రేంజ్ పాన్ ఇండియా స్థాయికి పెరిగింది. తెలుగులో తెరకెక్కుతున్న చాలా సినిమాలు అన్ని భాషల్లోనూ విడుదలవుతున్నాయి. ఒకప్పుడు తెలుగు సినిమా మార్కెట్‌ రూ.80 కోట్లు మాత్రమే కాగా ప్రస్తుతం వెయ్యి కోట్లు దాటింది. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా పరిధి విస్తరించడమే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా టాలీవుడ్‌ రేంజ్‌ అందనంత ఎత్తుకు పెరిగింది. 

బాలీవుడ్‌, కోలీవుడ్‌ రేంజ్‌లో సినిమాలు తీయాలని అందరూ అనుకునేవారు. అయితే ఇప్పుడు అందరి దృష్టి టాలీవుడ్‌ పైన పడింది. ఏ భాష సినిమాలకూ తీసిపోని విధంగా తెలుగు సినిమాలు తెరకెక్కుతున్నాయి. అదే విధంగా కలెక్షన్లను కూడా రాబడుతున్నాయి. మరో విశేషం ఏమిటంటే.. తెలుగుతోపాటు ఏ భాష సినిమా విడుదలైనా, అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కథ, కంటెంట్ బాగుంటే తప్పుకండా ఆదరిస్తారు ప్రేక్షకులు.

టాలీవుడ్‌ (Tollywood) సినిమాలకు ఆదరణ పెరిగిందని చెప్పడానికి పలు సినిమాల కలెక్షన్లే నిదర్శనం. తమిళ హీరోలకు టాలీవుడ్‌లో మంచి మార్కెట్ ఉంది. అలాగే మన తెలుగు సినిమాలకు తమిళంలో కూడా మార్కెట్ పెరిగింది. తమిళంలో కూడా తెలుగు సినిమాలు మంచి కలెక్షన్లు రాబడుతున్నాయి. తమిళంలోనూ కోట్లు రాబట్టిన తెలుగు సినిమాల టాప్‌10 సినిమాల లిస్ట్‌ పింక్‌విల్లా ప్రేక్షకుల కోసం..   

టాలీవుడ్‌ (Tollywood) సినిమాలకు అన్ని భాషల్లోనూ క్రేజ్ పెరుగుతోంది. తెలుగు సినిమాలు తమిళంతోపాటు, మలయాళ, కన్నడ భాషల్లో కూడా విడుదలవుతున్నాయి

బాహుబలి2  (Baahubali2) :

బాహుబలి సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన బాహుబలి2 (Baahubali2) ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. తెలుగు సినిమాలు అంత కలెక్షన్లు సాధించగలవా అనే స్థాయిలో వసూళ్లను రాబట్టింది. ప్రభాస్ (Prabhas) హీరోగా దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి2.. చరిత్ర సృష్టించింది.

టాలీవుడ్‌ (Tollywood)లో రికార్డుల గురించి మాట్లాడుకోవాలంటే బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అనే స్థాయిలో రికార్డులను నెలకొల్పింది. ఇక, తెలుగులోనే కాదు తమిళంలో కూడా వసూళ్ల వర్షం కురిపించింది బాహుబలి2. తమిళంలోనే  ఏకంగా రూ.151.7 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

టాలీవుడ్‌ (Tollywood) సినిమాలకు అన్ని భాషల్లోనూ క్రేజ్ పెరుగుతోంది. తెలుగు సినిమాలు తమిళంతోపాటు, మలయాళ, కన్నడ భాషల్లో కూడా విడుదలవుతున్నాయి

ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ (RRR)

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Junior NTR), మెగాపవర్‌‌స్టార్ రాంచరణ్ (RamCharan) హీరోలుగా దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన సినిమా ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ (RRR) (రౌద్రం.. రణం.. రుధిరం). డీవీవీ దానయ్య నిర్మించిన ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమా విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ పాజిటివ్ టాక్‌ తెచ్చుకుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా అదే స్థాయిలో వసూళ్లను కూడా రాబట్టింది.

ఇండియాతో పాటు విదేశాల్లో కూడా ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాను విడుదల చేశారు మేకర్స్. అక్కడ కూడా సక్సెస్‌ఫుల్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇక, తమిళంలో రూ.80.70 కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌

టాలీవుడ్‌ (Tollywood) సినిమాలకు అన్ని భాషల్లోనూ క్రేజ్ పెరుగుతోంది. తెలుగు సినిమాలు తమిళంతోపాటు, మలయాళ, కన్నడ భాషల్లో కూడా విడుదలవుతున్నాయి

బాహుబలి (Baahubali) :

ప్రభాస్‌ (Prabhas) హీరోగా దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) డైరెక్షన్‌లో తెరకెక్కిన బాహుబలి (Baahubali) సినిమా తెలుగు సినిమా ఖ్యాతిని దేశవ్యాప్తం చేసింది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలో అనుష్క (Anushka), దగ్గుబాటి రానా (Rana Daggubati), రమ్యకృష్ణ (Ramya Krishnan), నాజర్, తమన్నా (Tamannaah), సత్యరాజ్ కీలకపాత్రలు పోషించారు.

విజువల్ వండర్‌‌గా తెరకెక్కిన బాహుబలి సినిమా తమిళంలో కూడా హిట్ టాక్‌ను కైవసం చేసుకుని రూ.75 కోట్ల గ్రాస్ రాబట్టింది.

టాలీవుడ్‌ (Tollywood) సినిమాలకు అన్ని భాషల్లోనూ క్రేజ్ పెరుగుతోంది. తెలుగు సినిమాలు తమిళంతోపాటు, మలయాళ, కన్నడ భాషల్లో కూడా విడుదలవుతున్నాయి

పుష్ప .. ది రైజ్ (Pushpa) :

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన సినిమా పుష్ప (Pushpa). పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది. ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహించిన పుష్ప సినిమాలో బన్నీకి జోడీగా నేషనల్ క్రష్ రష్మికా మందాన (Rashmika Mandanna) నటించింది.

తెలుగుతోపాటు పలు భాషల్లో విడుదలైన పుష్ప సినిమా తమిళంలోనూ కాసుల వర్షం కురిపించింది. కేవలం తమిళంలో రూ.29.7 కోట్ల గ్రాస్‌ సాధించింది. 

టాలీవుడ్‌ (Tollywood) సినిమాలకు అన్ని భాషల్లోనూ క్రేజ్ పెరుగుతోంది. తెలుగు సినిమాలు తమిళంతోపాటు, మలయాళ, కన్నడ భాషల్లో కూడా విడుదలవుతున్నాయి

ఊపిరి (Oopiri) :

అక్కినేని నాగార్జున (Nagarjuna), కార్తీ (Kaarthi) హీరోలుగా తెరకెక్కిన సినిమా ‘ఊపిరి’ (Oopiri). వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందింది. ‘ది ఇన్‌టచబుల్స్‌’ అనే ఫ్రెంచ్ సినిమా ఆధారంగా తెరకెక్కింది.

లవ్, కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మ్యూజికల్‌గా కూడా హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. తమన్నా (Tamannaah) హీరోయిన్‌గా నటించిన ఊపిరి సినిమాకు గోపీ సుందర్ సంగీతాన్ని అందించారు. తమిళంలో ఈ సినిమా రూ.26.8 కోట్ల గ్రాస్‌ రాబట్టింది.

టాలీవుడ్‌ (Tollywood) సినిమాలకు అన్ని భాషల్లోనూ క్రేజ్ పెరుగుతోంది. తెలుగు సినిమాలు తమిళంతోపాటు, మలయాళ, కన్నడ భాషల్లో కూడా విడుదలవుతున్నాయి

స్పైడర్ (Spyder) :

సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu), రకుల్‌ ప్రీత్‌ సింగ్ (Rakul Preet Singh) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా స్పైడర్ (Spyder). ఏఆర్.మురుగదాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. హారిస్ జయరాజ్ సంగీతం అందించిన స్పైడర్ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయింది.

అయితే ప్రముఖ డైరెక్టర్, నటుడు ఎస్‌జే సూర్య (SJ Suryah) విలన్‌గా నటించడంతో స్పైడర్ సినిమా తమిళంలో మంచి వసూళ్లనే రాబట్టింది. సుమారుగా రూ.23.6 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. 

టాలీవుడ్‌ (Tollywood) సినిమాలకు అన్ని భాషల్లోనూ క్రేజ్ పెరుగుతోంది. తెలుగు సినిమాలు తమిళంతోపాటు, మలయాళ, కన్నడ భాషల్లో కూడా విడుదలవుతున్నాయి

ఈగ (Eega) :

దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన విజువల్ వండర్ ఈగ (Eega). నేచురల్ స్టార్ నాని (Nani), స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఈ సినిమాలో కీలకపాత్రల్లో నటించారు. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ (Kiccha Sudeepa) విలన్‌గా నటించిన ఈగ సినిమా సూపర్‌‌హిట్‌ టాక్‌ తెచ్చుకుంది.

ఈగ సినిమాలో గ్రాఫిక్స్‌కు ప్రేక్షకులు ఫిదా కావడంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిసింది. తెలుగులో మంచి కలెక్షన్లు రాబట్టిన ఈగ సినిమా తమిళంలో రూ.24.5 కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది.

టాలీవుడ్‌ (Tollywood) సినిమాలకు అన్ని భాషల్లోనూ క్రేజ్ పెరుగుతోంది. తెలుగు సినిమాలు తమిళంతోపాటు, మలయాళ, కన్నడ భాషల్లో కూడా విడుదలవుతున్నాయి

మగధీర (Magadheera) :

మెగాపవర్‌‌స్టార్ రాంచరణ్‌ (RamCharan) నటించిన రెండో సినిమా ‘మగధీర’ (Magadheera). రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) హీరోయిన్‌గా నటించారు. కీరవాణి అందించిన సంగీతం మగధీర సినిమాకు మరో హైలైట్‌.

అల్లు అరవింద్ నిర్మాతగా తెరకెక్కిన మగధీర సినిమా 2009లో విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తెలుగులో కొత్త రికార్డులను సృష్టించిన మగధీర సినిమా తమిళంలో రూ.18.2 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

టాలీవుడ్‌ (Tollywood) సినిమాలకు అన్ని భాషల్లోనూ క్రేజ్ పెరుగుతోంది. తెలుగు సినిమాలు తమిళంతోపాటు, మలయాళ, కన్నడ భాషల్లో కూడా విడుదలవుతున్నాయి

సాహో (Saaho) :

బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ (Prabhas) నటించిన సినిమా ‘సాహో’ (Saaho). సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు నిర్మాతలు వంశీ – ప్రమోద్. బాలీవుడ్‌ భామ శ్రద్దా కపూర్ (Shraddha Kapoor), జాకీ ష్రాఫ్‌ వంటి భారీ తారాగణంతో రూపొందిన సాహో సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది.

బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేక చతికిలపడింది. అయితే తమిళంలో మాత్రం మంచి వసూళ్లనే రాబట్టింది. సుమారు రూ.10.6 కోట్ల గ్రాస్ కలెక్ట్‌ చేసింది సాహో సినిమా.

టాలీవుడ్‌ (Tollywood) సినిమాలకు అన్ని భాషల్లోనూ క్రేజ్ పెరుగుతోంది. తెలుగు సినిమాలు తమిళంతోపాటు, మలయాళ, కన్నడ భాషల్లో కూడా విడుదలవుతున్నాయి

అరుంధతి (Arundhati) :

అనుష్క శెట్టి (Anushka Shetty) ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘అరుంధతి’ (Arundhati). హారర్‌‌, థ్రిల్లర్‌‌ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాను కోడి రామకృష్ణ దర్శకత్వంలో శ్యాంప్రసాద్ రెడ్డి నిర్మించారు. సోనుసూద్ (SonuSood), షాయాజీ షిండే కీలకపాత్రలు పోషించారు.

అనుష్క నటన, అభినయానికి ప్రేక్షకులు ఫిదా కావడంతో.. అరుంధతి సినిమా బాక్సాఫీస్‌ వద్ద బంపర్‌‌ హిట్‌ సినిమాగా నిలిచింది. తెలుగుతోపాటు తమిళ ప్రేక్షకులను కూడా అనుష్క తన నటనతో ఆకట్టుకున్నారు. దీంతో అరుంధతి సినిమా తమిళంలో సుమారుగా రూ.10.4 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. 

 Read More : రెండు భాషల్లో జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) – ప్రశాంత్ నీల్ (Prashanth Neel) సినిమా? తారక్‌ ఓకే చెప్పారా!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!