మంచి మనసు చాటుకున్న ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ (Iconstar Allu Arjun).. కేరళ యువతికి ఆర్థిక సాయం!

Updated on Nov 14, 2022 06:20 PM IST
అల్లు అర్జున్‌ (Allu arjun) సినిమాల్లోనే కాదు, నిజజీవితంలోనూ హీరో అని నిరూపించుకున్నాడు.
అల్లు అర్జున్‌ (Allu arjun) సినిమాల్లోనే కాదు, నిజజీవితంలోనూ హీరో అని నిరూపించుకున్నాడు.

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ (Iconstar Allu Arjun) కూడా ఒకరు. తనదైన మేనరిజం, స్టైల్, డ్యాన్స్ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు అల్లు అర్జున్. గతేడాది వచ్చిన ‘పుష్ప’ తో బన్నీ పాన్‌ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించింది. సౌత్‌, నార్త్‌ అని తేడాలేకుండా ప్రతి చోట వసూళ్ళ వర్షం కురిపించింది.

పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ‘పుష్ప’ (Pushpa Movie) బాక్సాఫీస్ షేక్ చేసి కలెక్షన్ల సునామీ సృష్టించింది. అయితే, అల్లు అర్జున్ కి తెలుగు లో ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మాలీవుడ్ లో కూడా అలాంటి క్రేజ్ ఉంది. కేరళలో బన్నీని అక్కడి ఫ్యాన్స్ ముద్దుగా మల్లు అర్జున్ అని పిలుస్తారు. ఆయన నటించిన ‘ఆర్య’ చిత్రం నుంచి ఇటీవల విడుదలయిన ‘పుష్ప’ వరకు ప్రతి చిత్రం అక్కడి థియేటర్లలో బాగా సందడి చేసింది.

ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్‌ (Allu arjun) సినిమాల్లోనే కాదు, నిజజీవితంలోనూ హీరో అని నిరూపించుకున్నాడు. కేరళలోని అలెప్పీకి చెందిన ఓ విద్యార్థినికి ఆర్థిక భరోసానిచ్చి తన మంచి మనసు చాటుకున్నాడు. ఇంటర్మీడియట్‌లో 92శాతం మార్కులు తెచ్చుకుని పై చదువులు చదువలేక ఇబ్బంది పడుతున్న ఓ మళయాలీ అమ్మాయికి బన్నీ సహాయం చేశాడు.    

పూర్తి వివ‌రాల్లోకి వెళితే, కేర‌ళ‌ (Kerala)కు చెందిన ముస్లిం అమ్మాయి. న‌ర్సింగ్ (Nursing) కోర్సు చేయాల‌నుకుంది. ఎగ్జామ్స్‌లో మంచి మార్కుల‌ను కూడా సాధించింది. నాలుగేళ్ల కోర్సు. పేద కుటుంబానికి చెందిన ఆ అమ్మాయికి కోర్సు పూర్తి చేయాలంటే డ‌బ్బులు పెట్ట‌లేని ప‌రిస్థితి. విష‌యం తెలుసుకున్న అల‌ప్పుర (Alappuzha district) కలెక్ట‌ర్ వి.ఆర్‌.కృష్ణ తేజ త‌న‌ ఫేస్ బుక్ ద్వారా అల్లు అర్జున్‌కి విష‌యాన్ని తెలియ‌జేశారు.

కృష్ణ తేజ పోస్ట్ లో ఉన్న వివరాలివీ.. ‘‘కొన్ని రోజుల క్రితం నన్ను ఓ విద్యార్థిని కలిసింది. కొవిడ్ తో ఆమె తండ్రి గతేడాది మరణించారు. ఇంటర్ లో 92శాతం ఉత్తీర్ణత సాధించినా పై చదువులకు వెళ్లలేని పరిస్థితి ఆమెది. ఆ స్టూడెంట్ కు భవిష్యత్తుపై ఉన్న ఆశ, ఆత్మవిశ్వాసం ఆమె కళ్లలో స్పష్టంగా కనిపించాయి. నర్సింగ్ చేయాలనేది ఆమె కల. ‘వి ఆర్ ఫర్ అలెప్పీ’ ప్రాజెక్టులో భాగంగా ఆమెకు సాయం చేయాలనుకున్నాం. కానీ, మెరిట్ కోటాలో దరఖాస్తు చేసుకునే సమయం ముగిసింది’’ అని పేర్కొన్నారు.  

‘‘మేనేజ్ మెంట్ కోటా కోసం ప్రయత్నించగా కట్టనమ్ లోని సెయింట్ థామస్ నర్సింగ్ కాలేజీలో సీటు లభించింది. దానికి ఓ స్పాన్సర్ కావాల్సివచ్చింది. మన ఫేవరెట్ స్టార్ అల్లు అర్జున్ కు ఈ విషయాన్ని చెప్తే.. ఆయన స్పందించారు. విద్యార్థిని హాస్టల్ ఫీజుతో సహా అన్నింటినీ ఆయన జాయిన్ అయిన మరుసటి రోజు నేను ఆ కాలేజీకి వెళ్లా. ఆమె బాగా చదివి, ప్రయోజకురాలై సమాజానికి సేవ చేస్తుందనే నమ్మకం నాకుంది’’ అని కృష్ణ తేజ పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని ఆ విద్యార్థినికి ఒక సంవత్సరం ఫీజు చెల్లిస్తే బాగుంటుందని కోరారు.. కలెక్టర్ కృష్ణతేజ. ఆ విద్యార్థిని పరిస్థితి గురించి తెలుసుకున్న అల్లు అర్జున్ ఒక సంవత్సరం కాదు.. నాలుగు సంవత్సరాలు తనకు  అయ్యే ఖర్చు మొత్తం  భరిస్తానని.. ఆమెను తాను దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చాడట అల్లు అర్జున్ (Allu arjun). 

Read More: Pushpa The Rule: 'పుష్ప 2' షూటింగ్ సెట్ లో అడుగుపెట్టిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun).. ఫొటో వైరల్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!