టాలీవుడ్ (Tollywood) ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాప్‌10 క్రేజీ కాంబినేషన్స్

Updated on Dec 12, 2022 08:53 PM IST
సినిమా హిట్ అయితే ఆ సినిమా చేసిన హీరో – డైరెక్టర్‌‌ను హిట్ కాంబినేషన్‌గా పేర్కొంటారు. వాళ్లిద్దరి కాంబోలో మరో సినిమా కోసం ఎదురుచూస్తారు
సినిమా హిట్ అయితే ఆ సినిమా చేసిన హీరో – డైరెక్టర్‌‌ను హిట్ కాంబినేషన్‌గా పేర్కొంటారు. వాళ్లిద్దరి కాంబోలో మరో సినిమా కోసం ఎదురుచూస్తారు

సినిమా ఇండస్ట్రీలో హిట్‌ కాంబినేషన్లకు ఉండే క్రేజ్ వేరుగా ఉంటుంది. హీరోహీరోయిన్లు కలిసి నటించిన సినిమా సూపర్ హిట్ అయ్యిందంటే వాళ్లది హిట్ పెయిర్ అని పిలుస్తుంటారు. హిట్‌ పెయిర్‌‌తో సినిమాలు తెరకెక్కుతున్నాయంటే వాటికి ఓపెనింగ్స్‌ కూడా బాగుంటాయి. అలాగే, సినిమాలు వరుసగా హిట్‌ అవుతూ ఉంటే హీరోహీరోయిన్ల క్రేజ్ కూడా పెరుగుతుంది.

ఇక, ఈ హిట్ కాంబినేషన్‌ అనేది కేవలం హీరోహీరోయిన్లకే పరిమితం కాదు. హీరో – దర్శకుడు కాంబోకి కూడా అంతే క్రేజ్ ఉంటుంది. స్టార్ హీరోతో సినిమా చేసి దర్శకుడు భారీ హిట్ అందిస్తే.. ఆ డైరెక్టర్‌‌తో తమ హీరో మరో సినిమా చేసి మరో హిట్ అందుకోవాలని అభిమానులు కోరుకుంటారు. దాని కోసం ఆతృతగా ఎదురుచూస్తుంటారు కూడా. టాలీవుడ్‌(Tollywood)లో  హిట్ కాంబినేషన్స్‌పై ప్రత్యేక కథనం పింక్‌విల్లా ఫాలోవర్స్‌ కోసం ప్రత్యేకం..

సినిమా హిట్ అయితే ఆ సినిమా చేసిన హీరో – డైరెక్టర్‌‌ను హిట్ కాంబినేషన్‌గా పేర్కొంటారు. వాళ్లిద్దరి కాంబోలో మరో సినిమా కోసం ఎదురుచూస్తారు

ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli) – రవితేజ (RaviTeja)

మాస్ మహారాజా రవితేజ బ్యాక్‌ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నారు. హీరోగా వరుస ప్రాజెక్టులకు ఓకే చెప్తూనే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమాలో కూడా నటిస్తున్నారు. బాబి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

ఇక, దర్శకధీరుడు రాజమౌళి ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమా ఇచ్చిన విజయంతో మంచి జోష్ మీద ఉన్నారు. ఈ సినిమా తర్వాత సూపర్‌‌స్టార్ మహేష్‌బాబుతో సినిమా చేయనున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో జక్కన్న బిజీగా ఉన్నట్టు సమాచారం.

రవితేజ (RaviTeja) – రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్‌‌హిట్ సినిమా విక్రమార్కుడు. ఈ సినిమాలో డబుల్ యాక్షన్ చేసిన రవితేజ.. పవర్‌‌ఫుల్ పోలీసాఫీసర్‌‌గా అలరించారు. ఈ సినిమా విడుదల తర్వాత నుంచి విక్రమార్కుడు సినిమాకు సీక్వెల్‌పైనా, జక్కన్న–రాజమౌళి కాంబోలో మరో సినిమా గురించి సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సినిమా హిట్ అయితే ఆ సినిమా చేసిన హీరో – డైరెక్టర్‌‌ను హిట్ కాంబినేషన్‌గా పేర్కొంటారు. వాళ్లిద్దరి కాంబోలో మరో సినిమా కోసం ఎదురుచూస్తారు

త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) – పవన్‌కల్యాణ్ (Pawan Kalyan)

పవర్‌‌స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా షూటింగ్‌ను పూర్తి చేస్తున్నారు పవన్. వకీల్‌సాబ్, భీమ్లానాయక్ వంటి హిట్‌ సినిమాల తర్వాత పవన్ నటిస్తున్న సినిమా కావడంతో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న హరిహర వీరమల్లు సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక, తన రేంజ్ హిట్‌ కోసం చాలా కాలం ఎదురుచూసిన పవన్‌కల్యాణ్‌కు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జల్సా బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన అత్తారింటికి దారేది ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసింది. అనంతరం భారీ అంచనాల మధ్య విడుదలైన అజ్ఞాతవాసి సినిమా నిరాశపరిచింది.

అజ్ఞాతవాసి తర్వాత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) హిట్‌ సినిమాల్లో నటించగా.. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన సినిమాలు కూడా సూపర్‌‌ హిట్ అయ్యాయి. ప్రస్తుతం ఇద్దరూ హిట్‌ ట్రాక్ మీద ఉండడంతో, మరోసారి ఈ కాంబినేషన్‌లో సినిమా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్.. సూపర్‌‌స్టార్ మహేష్‌బాబుతో సినిమాను తెరకెక్కిస్తున్నారు.

సినిమా హిట్ అయితే ఆ సినిమా చేసిన హీరో – డైరెక్టర్‌‌ను హిట్ కాంబినేషన్‌గా పేర్కొంటారు. వాళ్లిద్దరి కాంబోలో మరో సినిమా కోసం ఎదురుచూస్తారు

త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) – జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR)

ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సక్సెస్‌తో యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌‌కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో కూడా సత్తా చాటింది. విడుదలైన అన్ని కేంద్రాల్లో సూపర్‌‌హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుని కలెక్షన్ల వర్షం కురిపించింది. జపాన్, రష్యాలో కూడా హిట్‌ టాక్‌ను దక్కించుకున్నాయి.

ఇక, త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం సూపర్‌‌స్టార్ మహేష్‌బాబుతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎస్‌ఎస్‌ఎంబీ28 వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అయోధ్యలో అర్జునుడు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఇప్పటికే అరవింద సమేత వీర రాఘవ సినిమా వచ్చింది. ఈ సినిమా సూపర్‌‌హిట్ అయ్యింది. అరవింద సమేత వీర రాఘవ సినిమా తర్వాత త్రివిక్రమ్‌ మరోసారి జూనియర్ ఎన్టీఆర్‌‌తో సినిమా చేయాలని కోరుకుంటున్నారు అభిమానులు.

సినిమా హిట్ అయితే ఆ సినిమా చేసిన హీరో – డైరెక్టర్‌‌ను హిట్ కాంబినేషన్‌గా పేర్కొంటారు. వాళ్లిద్దరి కాంబోలో మరో సినిమా కోసం ఎదురుచూస్తారు

ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli) – ప్రభాస్ (Prabhas)

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. బాహుబలి తర్వాత అన్నీ పాన్ ఇండియా సినిమాలే ప్రభాస్‌ దగ్గరకు వెళుతున్నాయి. అయితే బాహుబలి తర్వాత నటించిన రాధేశ్యామ్, సాహో సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో సందడి చేయలేకపోయాయి. ప్రస్తుతం ప్రభాస్‌ ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్‌ కె వంటి భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్నారు.

ఇక, రాజమౌళి కూడా సూపర్‌‌స్టార్ మహేష్‌బాబుతో తెరకెక్కించబోయే భారీ బడ్జెట్‌ సినిమాకు సంబంధించిన పనుల్లో నిమగ్నమయ్యారు. ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమా తెచ్చిన క్రేజ్‌ను, దానికి సంబంధించిన అవార్డు ఫంక్షన్లకు వెళుతూ బిజీగా ఉన్నారు.

ప్రభాస్ (Prabhas) – రాజమౌళి కాంబినేషన్‌లో ఇప్పటికే ఛత్రపతి, బాహుబలి1, 2 సినిమాలు వచ్చి రికార్డులు బద్దలుకొట్టాయి. బాహుబలి సిరీస్ సినిమాలైతే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే చూడాలని చాలామంది ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

సినిమా హిట్ అయితే ఆ సినిమా చేసిన హీరో – డైరెక్టర్‌‌ను హిట్ కాంబినేషన్‌గా పేర్కొంటారు. వాళ్లిద్దరి కాంబోలో మరో సినిమా కోసం ఎదురుచూస్తారు

బోయపాటి శ్రీను (Boyapati Srinu) – బాలకృష్ణ (BalaKrishna)

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. వీరసింహారెడ్డి టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ఫస్ట్‌ లుక్, పాట అన్నీ విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ సినిమాలో బాలయ్య మరోసారి పవర్‌‌ఫుల్‌ గెటప్‌లో అదరగొడుతున్నారు. అఖండ సూపర్ హిట్ కావడంతో అదే జోరును కొనసాగించాలని చూస్తున్నారు బాలకృష్ణ,

మాస్ మహారాజా రవితేజ నటించిన భద్ర సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు బోయపాటి శ్రీను. మాస్ హీరో బాలకృష్ణతో సింహా, లెజెండ్, అఖండతో హ్యాట్రిక్ హిట్‌లు కొట్టిన బోయపాటి ప్రస్తుతం ఎనర్టిటిక్ స్టార్ రామ్ పోతినేనితో సినిమా తెరకెక్కిస్తున్నారు.

ఇక, బాలకృష్ణ (BalaKrishna) – బోయపాటి కాంబినేషన్‌లో మరో సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు నందమూరి అభిమానులు. అఖండ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించనున్నారనే వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టాయి. ఏది ఏమైనా వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

సినిమా హిట్ అయితే ఆ సినిమా చేసిన హీరో – డైరెక్టర్‌‌ను హిట్ కాంబినేషన్‌గా పేర్కొంటారు. వాళ్లిద్దరి కాంబోలో మరో సినిమా కోసం ఎదురుచూస్తారు

సుకుమార్ (Sukumar) – అల్లు అర్జున్ (Allu Arjun)

గంగోత్రి సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయమయ్యారు అల్లు అర్జున్. ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఆర్య సినిమాలో నటించి మంచిపేరు తెచ్చుకున్నారు బన్నీ. తను స్టార్ హీరో కావడానికి ముఖ్య కారణం డైరెక్టర్ సుకుమార్ అని బన్నీ చాలాసార్లు చెప్పారు. ఆర్య సినిమాతో అల్లు అర్జున్‌కు లవర్‌‌బాయ్ ఇమేజ్ వచ్చింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఆర్య2 అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. అయినా.. ఆ సినిమాలోని బన్నీ నటనకు మంచి మార్కులే పడ్డాయి.

ఇక, సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన పాన్ ఇండియా సినిమా పుష్ప. దేశవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అన్ని కేంద్రాల్లోనూ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలోని పాటలు, డాన్స్, ఫైట్స్ సామాన్యులతోపాటు సెలబ్రిటీలను కూడా ఫిదా చేశాయి.

ప్రస్తుతం అల్లు అర్జున్ (Allu Arjun) – సుకుమార్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతోంది. పుష్ప సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న పుష్ప2పై అభిమానులతోపాటు ఇండస్ట్రీలో కూడా భారీ అంచనాలే ఉన్నాయి. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్‌ సినిమా కోసం ఎప్పటికీ ఫ్యాన్స్ ఎదురుచూస్తూనే ఉంటారు.

సినిమా హిట్ అయితే ఆ సినిమా చేసిన హీరో – డైరెక్టర్‌‌ను హిట్ కాంబినేషన్‌గా పేర్కొంటారు. వాళ్లిద్దరి కాంబోలో మరో సినిమా కోసం ఎదురుచూస్తారు

పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh) – మహేష్‌బాబు (MaheshBabu)

సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇప్పటికే పూర్తయ్యింది. రెండో షెడ్యూల్ త్వరలోనే మొదలుకానుంది. ఏప్రిల్‌ 28న సినిమాను విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం చాలాకాలం క్రితమే ప్రకటించింది. అయితే, మహేష్‌బాబు, తల్లి ఇందిరాదేవి, తండ్రి కృష్ణ మరణించడంతో షూటింగ్ వాయిదా పడుతోంది. ఇటీవలే, మహేష్‌ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ సినిమా కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తుంటారు. చాలా సింపుల్‌గా, క్లాసీ లుక్‌లో కనిపించే మహేష్‌బాబుతో పోకిరి సినిమాను తెరకెక్కించి ఇండస్ట్రీని షేక్ చేశారు. అనంతరం బిజినెస్‌మేన్ సినిమాతో  మరోసారి వీరిద్దరూ హిట్ కొట్టారు.

మహేష్‌బాబు (MaheshBabu) – పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో సినిమా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తే ఇండస్ట్రీ హిట్ ఖాయమని టాక్.

సినిమా హిట్ అయితే ఆ సినిమా చేసిన హీరో – డైరెక్టర్‌‌ను హిట్ కాంబినేషన్‌గా పేర్కొంటారు. వాళ్లిద్దరి కాంబోలో మరో సినిమా కోసం ఎదురుచూస్తారు

సుకుమార్‌‌ (Sukumar) – రాంచరణ్ (RamCharan)

ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాతో మెగాపవర్‌‌స్టార్ రాంచరణ్‌ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. చిరుత సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన చరణ్.. మగధీర, ధృవ, రంగస్థలం సినిమాలతో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. తన స్టైల్, డాన్స్‌తో కోట్ల మంది అభిమానులను అలరిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా ఎదిగారు.

సుకుమార్ – రాంచరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా రంగస్థలం. ఈ సినిమాలో రాంచరణ్‌ చెవిటివాడుగా నటించి మెప్పించారు. రంగస్థలం సినిమా సక్సెస్ కావడంతో వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమాపై ఆసక్తి నెలకొంది.

ప్రస్తుతం సుకుమార్ పుష్ప2 షూటింగ్‌లో, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్‌‌సీ15 సినిమా షూటింగ్‌లో రాంచరణ్ (RamCharan) బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమాలు తెరకెక్కితే బాగుంటుందని కోరుకుంటున్నారు.

సినిమా హిట్ అయితే ఆ సినిమా చేసిన హీరో – డైరెక్టర్‌‌ను హిట్ కాంబినేషన్‌గా పేర్కొంటారు. వాళ్లిద్దరి కాంబోలో మరో సినిమా కోసం ఎదురుచూస్తారు

వీవీ వినాయక్ (VV Vinayak) – చిరంజీవి (Chiranjeevi)

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. గాడ్‌ఫాదర్ సినిమా భారీ సక్సెస్‌తో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్, గ్లింప్స్, పాటలు యూట్యూబ్‌లో ట్రెండ్ సెట్‌ చేస్తున్నాయి. 2023, సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్య సినిమా విడుదల కానుంది.

జూనియర్ ఎన్టీఆర్‌‌ హీరోగా తెరకెక్కిన సూపర్‌‌హిట్‌ సినిమా ఆది. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు వీవీ వినాయక్. చెన్నకేశవరెడ్డి, ఠాగూర్, కృష్ణ, అదుర్స్ సినిమాలతో హిట్స్ అందుకున్నారు వినాయక్. ఖైదీ నంబర్150 తర్వాత సాయిధరమ్ తేజ్‌తో ఇంటిలిజెంట్ సినిమాను తెరకెక్కించి ఫ్లాప్‌ రుచి చూశారు.

ఠాగూర్, ఖైదీ నంబర్‌‌150 సినిమాలు హిట్ కావడంతో చిరంజీవి (Chiranjeevi) – వీవీ వినాయక్‌ హిట్‌ కాంబినేషన్‌ అనే పేరు వచ్చింది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఠాగూర్ వంటి హిట్ సినిమా తీయాలని మెగా ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.

కొరటాల శివ (Koratala Siva) – ప్రభాస్ (Prabhas)

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌ ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్నారు. బాహుబలి సిరీస్ సినిమాల హిట్‌తో ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఆదిపురుష్‌ సినిమాలో రాముడి పాత్రను పోషిస్తున్నారు ప్రభాస్. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా టీజర్‌‌ను దసరా సందర్భంగా విడుదల చేసింది చిత్ర యూనిట్. దానిపై మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.

కమర్షియల్ కథలకు సోషల్ మెసేజ్ అందించే కాన్సెప్ట్‌లతో సినిమాలను తెరకెక్కించి హిట్లు అందుకుంటారు దర్శకుడు కొరటాల శివ. ప్రభాస్‌తో మిర్చి సినిమా తీసి హిట్ కొట్టారు. ఈ సినిమా తర్వాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను, ఆచార్య సినిమాలు తీసి స్టార్ డైరెక్టర్‌‌గా ఎదిగారు కొరటాల.

మిర్చిలో ప్రభాస్‌ (Prabhas)ను స్టైలిష్‌గా చూపించారు కొరటాల శివ. ప్రభాస్‌ను ఆ రేంజ్‌ క్లాస్‌ లుక్‌లో చూపిస్తూనే మాస్‌కు దగ్గరయ్యేలా ఫైట్లు చేయించి డార్లింగ్ అభిమానులను మైమరపించారు. దీంతో మరోసారి కొరటాల శివ – ప్రభాస్‌ కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూస్తున్నారు అభిమానులు.  

Read More : 2022లో థియేటర్లలో ప్రేక్షకులతో విజిల్స్ వేయించిన టాలీవుడ్‌ సినిమాల్లోని టాప్ 10 సీన్లు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!