The Ghost Movie Review : యాక్షన్‌ సీన్ల కోసమే నాగార్జున (Nagarjuna) ‘ది ఘోస్ట్‌’ సినిమా

Updated on Oct 06, 2022 03:20 PM IST
అక్కినేని నాగార్జున (Nagarjuna) హీరోగా నటించిన యాక్షన్‌ సినిమా ది ఘోస్ట్ (The Ghost). దసరా కానుకగా ఈ సినిమా బుధవారం విడుదలైంది
అక్కినేని నాగార్జున (Nagarjuna) హీరోగా నటించిన యాక్షన్‌ సినిమా ది ఘోస్ట్ (The Ghost). దసరా కానుకగా ఈ సినిమా బుధవారం విడుదలైంది

సినిమా : ది ఘోస్ట్‌

నటీనటులు : నాగార్జున, సోనాల్‌ చౌహాన్‌

మ్యూజిక్ : మార్క్‌ కె రాబిన్‌

నిర్మాతలు : సునీల్‌ నారంగ్‌, పుష్కర్‌ రామ్‌ మోహన్‌ రావు, శరత్‌ మరార్‌

దర్శకత్వం : ప్రవీణ్‌ సత్తారు

విడుదల తేదీ : 05–10–2022

రేటింగ్ : 3 / 5

అక్కినేని నాగార్జున (Nagarjuna) హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌‌టైనర్ ది ఘోస్ట్ (The Ghost). విభిన్నమైన కథలతో సినిమాలు చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉండే నాగ్.. మరోసారి ఒక డిఫరెంట్‌ యాక్షన్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గరుడవేగ సినిమాతో మంచిపేరు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. ఆ సినిమాలో యాక్షన్ సీన్లను కూడా స్టైలిష్‌గా తెరకెక్కించి సినీ ప్రేమికులను అలరించారు. యాక్షన్ సినిమాలను చేయడానికి ఇష్టపడే నాగార్జున.. యాక్షన్ సీన్లను స్టైలిష్‌గా తెరకెక్కించే సత్తాను ఉన్న ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో తెరకెక్కిన యాక్షన్‌ సినిమా ‘ది ఘోస్ట్‌’

నాగార్జున నటించిన సినిమాలు అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోవడం లేదు. యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో నాగ్‌ చేసిన వైల్డ్‌ డాగ్, ఆఫీసర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తపడ్డాయి. ఈ క్రమంలో ది ఘోస్ట్‌ సినిమాతో ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో ఉన్నారు నాగార్జున. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్‌ లుక్, గ్లింప్స్, పాటలు సహా అన్నింటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. దసరా సందర్భంగా ది ఘోస్ట్ సినిమా థియేటర్లలో విడుదలైంది. సినిమా ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

క‌థ ఏంటంటే: విక్రమ్ (నాగార్జున) ఒక ఇంట‌ర్‌పోల్ ఆఫీసర్.  ప్రియ (సోనాల్‌చౌహాన్‌)తో క‌లిసి దుబాయ్‌లో ప‌నిచేస్తుంటారు. వీరిద్దరూ ప్రేమించుకుంటారు. విధి నిర్వహనలో భాగంగా ఒక ఆపరేషన్‌ కోసం వీరిద్దరూ పనిచేస్తారు. అప్పుడు జరిగిన సంఘటనలో ఒక గ్యాంగ్‌ చేతిలో చిన్న బాబు మరణిస్తాడు. దాంతో విక్రమ్‌ డిప్రెషన్‌లోకి వెళిపోతాడు. ఆ తర్వాత ప్రియ దూరమవుతుంది. ఈ క్రమంలో బాధలో ఉన్న విక్రమ్‌కు అను (గుల్‌ పనాగ్) నుంచి ఫోన్‌ వస్తుంది. తనను, తన కూతురు అదితి (అనైకా సురేంద్రన్)ని కాపాడాలని కోరుతుంది.  వాళ్లను కాపాడే క్రమంలో విక్రమ్‌ ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నారు? ఎవరి నుంచి కాపాడాలని విక్రమ్‌ను అను కోరుతుంది? విక్రమ్‌కు అనుకి ఉన్న సంబంధం ఏమిటి? చివరికి ఏం జరిగింది అనేది ది ఘోస్ట్ సినిమా కథ.

అక్కినేని నాగార్జున (Nagarjuna) హీరోగా నటించిన యాక్షన్‌ సినిమా ది ఘోస్ట్ (The Ghost). దసరా కానుకగా ఈ సినిమా బుధవారం విడుదలైంది

ఎలా ఉందంటే: స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌‌గా ది ఘోస్ట్‌ సినిమాను తెరకెక్కించారు. క‌థ మీద కంటే యాక్షన్ సీన్లపైనే దర్శకుడు ఎక్కువగా దృష్టి పెట్టినట్టు అనిపిస్తుంది. కొన్ని యాక్షన్ సీన్లు ఆకట్టుకుంటాయి. అయితే కథపై ప్రేక్షకుడికి ఆసక్తి కలిగించడంలో దర్శకుడు సక్సెస్ కాలేదు. తనకు ప్లస్ పాయింట్ అయిన యాక్షన్‌ సీన్లను తెరకెక్కించడంపైనే దృష్టి పెట్టారు. దాంతో కథలోని భావోద్వేగాలకు సరైన స్కోప్ దక్కలేదు. అయిదు సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత దూరమైన హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు కూడా పెద్దగా సెంటిమెంట్ వర్క్ అవుట్‌ కాలేదు.

 ఎవ‌రెలా నటించారంటే : విక్రమ్‌గా నాగార్జున నటన బాగుంది. నాగ్‌ స్టైలిష్‌గా కనిపించిన తీరు, యాక్షన్ సీన్లు అభిమానులను అలరిస్తాయి. ఇంటర్‌‌పోల్‌ ఆఫీసర్‌‌గా, హీరోయిన్‌గా గ్లామరస్‌గా కనిపించారు సోనాల్ చౌహాన్. హీరోతోపాటు యాక్షన్ సీన్లలో కూడా మెప్పించారు సోనాల్. విలన్‌గా మనీష్‌ చౌదరి నటన బాగుంది. ఇతర నటీనటులు కూడా తమ పరిధి మేరకు నటించారు. జ‌య‌ప్రకాష్‌, ర‌విప్రకాష్‌, శ్రీకాంత్ అయ్యంగార్ మిన‌హా మిగిలిన‌ వాళ్లు దాదాపుగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేనివాళ్లే. టెక్నికల్‌గా ది ఘోస్ట్ సినిమా ఉన్నతంగా ఉంది. మార్క్ కె రాబిన్ నేప‌థ్య సంగీతం సినిమాకి ప్లస్‌ పాయింట్. 

ప్లస్ పాయింట్స్ : నాగార్జున (Nagarjuna) , సోనాల్ చౌహాన్ యాక్టింగ్‌, యాక్షన్‌ సీన్లు, ట్విస్ట్‌లు  

మైనస్ పాయింట్స్ : కథ, కథనం

ఒక్క మాటలో : యాక్షన్‌ సీన్స్‌ కోసమే ‘ది ఘోస్ట్‌’

Read More : The Ghost: నాగార్జున (Nagarjuna) సినిమా 'ది ఘోస్ట్' కోసం రంగంలోకి దిగిన‌ 'పుష్ప' హిందీ డిస్ట్రిబ్యూటర్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!