బిజినెస్‌మ్యాన్‌ను పెళ్లి చేసుకోనున్న అనుష్క (Anushka Shetty)! సోషల్ మీడియాలో రూమర్లు వైరల్

Updated on Aug 28, 2022 06:44 PM IST
తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలోని అగ్ర హీరోలందరితో నటించి మంచిపేరు తెచ్చుకున్నారు అనుష్క శెట్టి (Anushka Shetty)
తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలోని అగ్ర హీరోలందరితో నటించి మంచిపేరు తెచ్చుకున్నారు అనుష్క శెట్టి (Anushka Shetty)

అనుష్క శెట్టి (Anushka Shetty) ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరు. ఆమెకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. నాగార్జున హీరోగా నటించిన 'సూపర్' సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన స్వీటీ.. అనతి కాలంలోనే ఇండస్ట్రీలోని అగ్ర హీరోలందరితోనూ నటించారు. క్రమంగా స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. 'సూపర్' సినిమాకు పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించారు.   

1971 నవంబర్ 1 తేదిన కర్నాటకలోని మంగళూరులో జన్మించారు అనుష్క.  బెంగళూరులో యోగా శిక్షకురాలుగా పని చేశారు. అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి. కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఈమెను స్వీటీ అని పిలుస్తారు. విక్రమార్కుడు, లక్ష్యం, అరుంధతి, డాన్, శౌర్యం, చింతకాయల రవి, కింగ్, బిల్లా, మిర్చి  సినిమాలతో  ప్రేక్షకుల మనసుల్లో స్థానం దక్కించుకున్నారు అనుష్క.

 

తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలోని అగ్ర హీరోలందరితో నటించి మంచిపేరు తెచ్చుకున్నారు అనుష్క శెట్టి (Anushka Shetty)

కెరీర్‌‌ను మార్చేసిన అరుంధతి..

'అరుంధతి' సినిమా అనుష్క (Anushka) కెరీర్‌‌ను మార్చేసింది. ఈ సినిమా తర్వాత లేడీ ఓరియంటెడ్‌ కథలు ఆమె వద్దకు క్యూ కట్టాయి. ఇక రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రిలీజైన 'బాహుబలి'  మొదటి భాగంలో అనుష్క హీరోయిన్‌గా నటించారు. రెండో భాగంలో కూడా మహేంద్ర బాహుబలి తల్లి దేవసేన పాత్రలో అద్భుతంగా నటించారు. ఈ పాత్రకు గాను విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. 'బాహుబలి' సినిమా సక్సెస్ కావడంతో అనుష్కకు ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. 

ప్రస్తుతం అనుష్క సోషల్ మీడియాకు,  సినిమాలకు కాస్త దూరమయ్యారు. ఈ నేపథ్యంలో అనుష్క తన పెళ్లి గురించి ఆలోచిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కొందరైతే దుబాయి నగరానికి చెందిన ఓ ప్రముఖ బిజినెస్ మ్యాన్‌తో అనుష్క వివాహం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. మరికొందరైతే బెంగళూరుకు ఓ వ్యాపారవేత్తతో అనుష్క వివాహం కానుందని జోస్యం చెబుతున్నారు. మరి 40 ఏళ్ల అనుష్క శెట్టి (Anushka Shetty) పెళ్లి పీటలు ఎక్కబోతుందా? లేదా? తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.  

Read More : Anushka Shetty: "స్వీటీ మ‌న‌సు బంగారం"!.. అనుష్క శెట్టి 17 ఏళ్ల సినీ ప్ర‌యాణంపై స్పెష‌ల్ స్టోరి

 

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!