చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) 61వ మూవీ: రష్మిక (Rashmika Mandanna) స్థానంలో మాళవిక (Malavika Mohanan)!

Updated on Oct 18, 2022 10:29 AM IST
చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) 61వ మూవీలో రష్మిక (Rashmika Mandanna) ప్లేస్‌లో మాళవిక (Malavika Mohanan) హీరోయిన్‌గా ఎంపికైనట్లు సమాచారం
చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) 61వ మూవీలో రష్మిక (Rashmika Mandanna) ప్లేస్‌లో మాళవిక (Malavika Mohanan) హీరోయిన్‌గా ఎంపికైనట్లు సమాచారం

‘పొన్నియన్ సెల్వన్ 1’ ఘన విజయం సాధించడంతో ఆనందంలో ఉన్నారు చియాన్ విక్రమ్ (Chiyaan Vikram). ఆదిత్య కరికాలన్‌గా ఈ చిత్రంలో తనదైన నటనతో ఆకట్టుకున్నారు ఈ కోలీవుడ్ స్టార్. ఇప్పుడు కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించే పనుల్లో ఆయన బిజీబిజీగా ఉన్నారు. విభిన్నమైన సినిమాలు తీసే దర్శకుడిగా పేరున్న పా. రంజిత్‌ (pa.ranjith)తో నూతన చిత్రాన్ని విక్రమ్ చేయనున్నారు. ‘కేజీఎఫ్’ సినిమా నేపథ్యమైన కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ బ్యాగ్రౌండ్‌లోనే విక్రమ్ కొత్త మూవీని తెరకెక్కించనున్నారట. 19వ శతాబ్దంలో ఈ కథ సాగుతుందని తెలుస్తోంది. 

మాళవిక పేరు ఖాయమైనట్లేనా?

విలక్షణమైన పాత్రలతో అందర్నీ ఆకట్టుకునే చియాన్ విక్రమ్.. కొత్త చిత్రంలోనూ విభిన్నమైన రోల్‌లో నటించనున్నారని సమాచారం. అయితే ఈ సినిమాలో ఆయన సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నేషనల్ క్రష్ రష్మికా మందన్న (Rashmika Mandanna) చియాన్ పక్కన యాక్ట్ చేస్తారని ఇన్నాళ్లూ గాసిప్స్ వచ్చాయి. ఇప్పుడీ స్థానంలో మరొకరి పేరు వినిపిస్తోంది. సోషల్ మీడియా సెన్సేషన్ అయిన మాళవికా మోహనన్ (Malavika Mohanan) విక్రమ్ 61వ (Chiyaan 61) మూవీలో హీరోయిన్‌గా ఖరారైనట్లు కోలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. రష్మికకు కాల్షీట్ల సమస్య రావడంతో ఆమె ప్లేస్‌లో మాళవిక పేరును మేకర్స్ కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. 

ఒకవేళ చియాన్ విక్రమ్ మూవీలో మాళవిక పేరు ఖరారైతే ఆమెకు ఇది నాలుగో చిత్రం కానుంది. ఇంతకముందు ఇళయదళపతి విజయ్ సరసన ‘మాస్టర్’ సినిమాలో మాళవిక నటించిన విషయం తెలిసిందే. ఆ మూవీ మంచి హిట్‌గా నిలిచినా.. ఆమెకు పెద్దగా అవకాశాలను మాత్రం తీసుకురాలేదు. ఇప్పుడు విక్రమ్ 61వ మూవీలో మాళవికను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది నిజమైతే మాత్రం ఆమెకు సువర్ణావకాశం లభించినట్లేనని చెప్పాలి. ఎందుకంటే, డైరెక్టర్ పా.రంజిత్ తీసే సినిమాల్లో హీరోతో పాటు కీలక పాత్రలను మలిచే తీరు వైవిధ్యంగా ఉంటుంది. 

హిందీలోనూ చిత్రీకరణ

నటనకు స్కోప్ ఉంటుంది కాబట్టి మాళవికకు తనను తాను నిరూపించుకోవడానికి ఇదో మంచి అవకాశంగా మారొచ్చు. అయితే ఆమెను ఈ ప్రాజెక్టులో తీసుకున్నారా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మూవీ మేకర్స్ అధికారికంగా క్లారిటీ ఇస్తే కానీ ఏదీ చెప్పలేం. ఇక, చియాన్ విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం టెస్ట్ షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ సినిమా షూటింగ్ సోమవారం కడపలో ప్రారంభమైంది. తమిళంతో పాటు హిందీలోనూ ఈ మూవీని చిత్రీకరిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. 

Read more: దళపతి విజయ్‌తో కలిసి నటిస్తా.. ఆ దర్శకుడితో అయితేనే అంటూ సంచలన కామెంట్స్ చేసిన చియాన్ విక్రమ్ (Vikram Chiyaan)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!