Dil Raju: ‘వారసుడు’ సినిమా ఆ ఇద్దరు స్టార్లతో కుదరలేదు.. విజయ్ ఎంట్రీపై దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్

Updated on Dec 16, 2022 01:31 PM IST
‘వారసుడు’ (Vaarasudu) చిత్రంలో హీరోగా ముందు ఇద్దరు టాలీవుడ్ స్టార్స్‌ను అనుకున్నామని సినిమా నిర్మాత దిల్ రాజు (Dil Raju) చెప్పారు
‘వారసుడు’ (Vaarasudu) చిత్రంలో హీరోగా ముందు ఇద్దరు టాలీవుడ్ స్టార్స్‌ను అనుకున్నామని సినిమా నిర్మాత దిల్ రాజు (Dil Raju) చెప్పారు

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న చిత్రం ‘వరిసు’ (Varisu). తెలుగులో ఈ సినిమాను ‘వారసుడు’ (Vaarasudu)గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘వారసుడు’ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో జరిపిన చిట్‌చాట్ సెషన్‌లో దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కబుర్లను పంచుకున్నారు. ముందుగా ఈ సినిమాకు హీరోగా విజయ్‌ను అనుకోలేదని తెలిపారు. 

‘వారసుడు’ చిత్రంలో హీరోగా ముందు ఇద్దరు టాలీవుడ్ స్టార్స్‌ను అనుకున్నామని దిల్ రాజు చెప్పారు. డైరెక్టర్ వంశీ ఈ కథను సూపర్‌స్టార్ మహేష్ బాబుతో చేయాలనుకున్నారట. అయితే అప్పటికే ఆయన వేరే సినిమాతో బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్టకు ఓకే కాలేదని దిల్ రాజు చెప్పారు. ‘మహేష్ తర్వాత ఈ ప్రాజెక్టుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో అయితే బాగుంటుందని అనుకున్నాం. కానీ అనుకోకుండా చరణ్​ ఆర్‌సీ15 డిస్కషన్స్‌లో ఉండటంతో ఈ స్టోరీ విజయ్ దగ్గరకు వెళ్లింది. అలా ఫైనల్ అయ్యింది’ అని దిల్ రాజు (Dil Raju) పేర్కొన్నారు.  

తెలుగులో ఈ సినిమాను ‘వారసుడుగా’ (Vaarasudu)గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

‘వారసుడు’ సినిమాలో విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటులు ప్రకాశ్ రాజ్, ప్రభు, శ్రీకాంత్, యోగిబాబు, శరత్ కుమార్‌తోపాటు జయసుధ, ఖుష్బూ సుందర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు.. వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సాల్మన్‌లు కలసి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. సక్సెస్‌ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ ‘వారసుడు’కు బాణీలు సమకూర్చుతున్నారు. ‘బీస్ట్’ సినిమా ఫలితంతో నిరాశగా ఉన్న హీరో విజయ్.. ‘వారసుడు’తో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి. 

Read more: అలీ నుంచి సుడిగాలి సుధీర్‌‌ వరకు..హీరోలుగానూ సినిమాలు చేసిన టాప్‌10 టాలీవుడ్ కమెడియన్లు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!