Pushpa Movie: ‘పుష్ప’ రష్యన్ లాంగ్వేజ్ ట్రైలర్ రిలీజ్.. బన్నీ (Allu Arjun) మూవీకి డబ్బింగ్ భలేగా కుదిరిందిగా!

Updated on Nov 29, 2022 03:13 PM IST
‘పుష్ప’ (Pushpa) రష్యన్ వెర్షన్ డబ్బింగ్ విషయంలో మేకర్స్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నట్లుగా ట్రైటర్‌ను చూస్తుంటే తెలుస్తోంది
‘పుష్ప’ (Pushpa) రష్యన్ వెర్షన్ డబ్బింగ్ విషయంలో మేకర్స్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నట్లుగా ట్రైటర్‌ను చూస్తుంటే తెలుస్తోంది

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో వచ్చిన చిత్రం ‘పుష్ప’ (Pushpa). మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ బాణీలు సమకూర్చారు. కథాకథానాలతోపాటు బన్నీ చెప్పిన సంభాషణలు, ఆయన చేసిన డ్యాన్సులు, ఫైట్స్ ఈ మూవీకి ప్రధాన బలంగా నిలిచాయి. దేవిశ్రీ కంపోజ్ చేసిన ట్యూన్స్ కూడా శ్రోతలను ఉర్రూతలూగించాయి. 

నేషనల్ క్రష్ రష్మికా మందన్న కథానాయికగా నటించిన ‘పుష్ప’ చిత్రం.. విడుదలైన ప్రతిచోట విజయవిహారం చేసింది. అల్లు అర్జున్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ‘పుష్ప’ సరికొత్త రికార్డులు నమోదు చేసింది. తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా దూసుకుపోయింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు రష్యాలో విడుదల కానుంది. 

‘పుష్ప’ (Pushpa In Russia)ను రష్యన్ భాషలోకి డబ్ చేశారు. కొంతకాలంగా అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతూ వచ్చాయి. రష్యాలో డిసెంబర్ 8వ తేదీన ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. విడుదలకు ముందు రష్యాలోని ప్రముఖ నగరాల్లో ప్రదర్శించనున్నారు. ఈ ప్రీమియర్స్‌కు అల్లు అర్జున్, సుకుమార్‌తోపాటు చిత్ర బృందం హాజరు కానున్నారని తెలుస్తోంది. 

‘పుష్ప’ రష్యన్ వెర్షన్ (Pushpa Russian Version)కు సంబంధించిన ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలోని ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ ఈ ట్రైలర్‌ను కట్ చేసినట్లుగా తెలుస్తోంది. డబ్బింగ్ విషయంలోనూ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఆయా పాత్రల మేనరిజమ్స్ రష్యన్ భాషలోనూ భలేగా వర్కౌట్ అయినట్లుగా అనిపిస్తోంది. ఇక, ఇండియాలో ఒక రేంజ్‌లో సత్తా చాటిన బన్నీ మూవీ.. రష్యాలో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. 

Read more: Chiranjeevi At IFFI : తెలుగు అభిమానుల ప్రేమకు దాసుడ్ని.. ఎప్పటికీ సినిమాలను వదిలిపెట్టను: మెగాస్టార్ చిరంజీవి

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!