స్టోరీ టెల్లర్ గా బ్రహ్మానందం (Brahmanandam).. ఆసక్తికరంగా 'పంచతంత్రం' ట్రైలర్ (Panchatantram Trailer)!

Updated on Nov 27, 2022 10:12 AM IST
తాజాగా ‘పంచతంత్రం’ (Panchatantram) సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ర‌ష్మిక మంద‌న్న విడుద‌ల చేసి చిత్ర యూనిట్‌కి అభినంద‌న‌లు తెలియ‌జేశారు.
తాజాగా ‘పంచతంత్రం’ (Panchatantram) సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ర‌ష్మిక మంద‌న్న విడుద‌ల చేసి చిత్ర యూనిట్‌కి అభినంద‌న‌లు తెలియ‌జేశారు.

Panchatantram Trailer: ఈ మధ్య కాలంలో ఆంథాలజీ కథలకు మంచి ఆదరణ దక్కుతోంది. గతంలో ఇలాంటి కోవలోనే వచ్చిన ‘చందమామ కథలు’ వంటి సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో ప్రస్తుతం తెరకెక్కుతున్న ఆంథాలజీ మూవీ ‘పంచతంత్రం’ ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి బజ్‌ను క్రియేట్ చేస్తోంది. 

టాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం (Brahmanandam), స్వాతి రెడ్డి (Colors Swathi), దివ్యవాణి, స‌ముద్ర ఖ‌ని, రాహుల్ విజ‌య్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌, న‌రేష్ అగ‌స్త్య‌, దివ్య ద్రిష్టి, వికాస్ ముప్ప‌ల, ఆదర్శ్ బాలకృష్ణ త‌దిత‌రులు న‌టిస్తోన్న చిత్రం ‘పంచతంత్రం’. టికెట్ ఫ్యాక్టరీ, ఒరిజిన‌ల్స్ ప‌తాకాల‌పై అఖిలేష్ వ‌ర్ధన్‌, సృజ‌న్ ఎర‌బోలు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి హ‌ర్ష పులిపాక ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. డిసెంబ‌ర్ 9న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

తాజాగా ‘పంచతంత్రం’ (Panchatantram) సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను స్టార్ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న విడుద‌ల చేసి చిత్ర యూనిట్‌కి అభినంద‌న‌లు తెలియ‌జేశారు. ఈ ట్రైలర్‌ను గమనిస్తే ఐదు విభిన్న కథలు ఆధారంగా ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ కథలను బ్రహ్మానందం తన పంచేంద్రియాలుగా పేర్కొనడం ఆసక్తికరంగా ఉంది. ఆధునిక ప్రపంచంలో మనుషుల అనుబంధాలు, విలువల గురించి ఈ సినిమాలో చూపించనున్నట్లు తెలుస్తోంది. 

సినిమాలో మ‌న‌కు క‌నిపించ‌బోయే ఐదు జంట‌ల‌కు ఒక్కో క‌థ.. ఒక్కో ర‌క‌మైన ప్ర‌యాణం.. అవ‌న్నీ ఎలాంటి ముగింపుతో ఎండ్ అయ్యాయ‌నే ‘పంచతంత్రం’ (Panchatantram) సినిమా ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా హార్ట్ ట‌చింగ్ ఎమోష‌న్స్‌తో ముందుకు సాగుతుంది. ప్ర‌తి క‌థ‌లో మ‌న చుట్టూ ఉన్న స‌మాజాన్ని అందులో వ్య‌క్తుల వ్య‌క్తిత్వాల‌ను ద‌ర్శ‌కుడు హ‌ర్ష ఎంతో అర్థ‌వంతంగా ముందుకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

Read More: సినిమాలో క‌మెడియ‌న్స్ లేకున్నా ప‌ర్వాలేదు.. కానీ కామెడీ ఉండాలి : బ్ర‌హ్మానందం (Brahmanandam)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!