Telugu Flop Movies 2022 : 2022లో విడుదలైన టాప్ 10 డిజాస్టర్ తెలుగు సినిమాలపై ప్రత్యేక కథనం...

Updated on Nov 30, 2022 06:01 PM IST
Telugu Flop Movies 2022 : ఈ ఏడాదిలో విడుదలైన ఖిలాడీ, రాధేశ్యామ్, ఆచార్య వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలాయి.
Telugu Flop Movies 2022 : ఈ ఏడాదిలో విడుదలైన ఖిలాడీ, రాధేశ్యామ్, ఆచార్య వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలాయి.

Telugu Flop Movies 2022: 2022 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాలు చాలా తక్కువే. ఈ సినిమాల్లో 'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమా వేల రూపాయలను కొల్లగొట్టి భారతీయ సినిమా చరిత్రలో నిలిచింది. మరి కొన్ని సినిమాలు డిజాస్టర్‌గా మిగిలాయి. హిట్ సాధించిన సినిమాల కంటే ఫ్లాప్ అయిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి.  ఈ ఏడాది చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్‌తో నటించిన  'ఆచార్య' సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. 2022లో విడుదలైన తెలుగు ప్లాప్ మూవీస్‌పై పింక్ విల్లా ప్రత్యేక కథనం.

ఖిలాడి (Khiladi)

ఖిలాడి (Khiladi)

మాస్ మహారాజ్ రవితేజ నటించన యాక్షన్ రొమాంటిక్ డ్రామాగా 'ఖిలాడి' చిత్రం తెరకెక్కింది. రమేష్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా 2022 ఫిబ్రవరి 11 తేదీన విడుదలైంది.  డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ బ్యానర్లపై రూ. 65 కోట్లతో నిర్మించారు. ఈ సినిమా రూ. 48 కోట్లను వసూళ్లు చేసి డిజాస్టర్‌గా మిగిలింది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. 

సన్ ఆఫ్ ఇండియా (Son of India)

సన్ ఆఫ్ ఇండియా (Son of India)

మోహన్ బాబు ప్రధాన పాత్రలో దేశభక్తి ప్రధానాంశంగా తెరకెక్కిన సినిమా 'సన్ ఆఫ్ ఇండియా'. 2022 ఫిబ్రవరి 18 వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. 'సన్ ఆఫ్ ఇండియా' సినిమాను శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు విష్ణు నిర్మించారు. దర్శకుడు డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించారు.  మోహన్ బాబు, శ్రీకాంత్, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇళయరాజా సంగీతం సమకూర్చారు.

 

ఆడవాళ్లు మీకు జోహార్లు (Aadavallu Meeku Johaarlu)

ఆడవాళ్లు మీకు జోహార్లు (Aadavallu Meeku Johaarlu)

శర్వానంద్, రష్మిక (Rashmika Mandanna) ప్రధాన పాత్రల్లో నటించిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా ఈ ఏడాది మార్చి 4 తేదీన విడుదలైంది. కిషోరు తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. 'ఆడవాళ్లు మీకు జోహార్లు' చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ చిత్రంలో రాధిక శరత్ కుమార్, ఖుష్బూ, ఊర్వశి, ఝాన్సీ, కళ్యాణి నటరాజన్, సత్య కృష్ణ, బెనర్జీ, సత్య అక్కల  నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. 

రాధేశ్యామ్ (Radhe Shyam)

రాధేశ్యామ్ (Radhe Shyam)

ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించారు. 2022 మార్చి 11 తేదీన రాధేశ్యామ్ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటించారు. తమన్ సంగీతం సమకూర్చారు.

రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రభాస్ కెరీయర్‌లో భారీ ఫ్లాప్‌గా మిగిలింది. దాదాపు రూ. 300 కోట్లతో 'రాధేశ్యామ్' సినిమాను నిర్మిస్తే.. కేవలం రూ. 151 కోట్లును మాత్రమే వసూళ్లు అయ్యాయి.

గని (Ghani)

గని (Ghani)

టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ నటించిన 'గని' సినిమా అల్లు అరవింద్ సమర్పణలో ఈ ఏడాది ఏప్రిల్ 8 వ తేదీన రిలీజ్ అయింది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించగా.. అల్లు బాబీ కంపెనీ, రెన‌సాన్స్ ఫిలిమ్స్ బ్యానర్లపై సిద్దు ముద్ద, అల్లు బాబీ నిర్మించారు. ఈ సినిమాను దాదాపు రూ. 35 కోట్లతో నిర్మించగా రూ. 6 కోట్లను మాత్రమే వసూళ్లు రాబట్టింది. వరుణ్ తేజ్‌ సరసన సాయి మంజ్రేకర్ నటించారు. 

 ఆచార్య (Acharya)

 ఆచార్య (Acharya)

ఈ ఏడాది ఏప్రిల్ 29 తేదీన 'ఆచార్య' సినిమా విడుదలైంది. చిరంజీవి నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌ను మిగిల్చింది. చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్‌తో కలిసి నటించిన మొదటి సినిమా 'ఆచార్య'. ఈ చిత్రాన్ని రూ. 140 కోట్లతో నిర్మించారు. కానీ బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 76 కోట్లను వసూళ్లు చేయగలిగింది. 

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజ హెగ్డే, సోను సూద్, సౌరవ్ లోకేష్, కిషోర్, తనికెళ్ళ భరణి, అజయ్ నటించారు. 'ఆచార్య' చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మించారు. మణి శర్మ సంగీతం అందించారు. 

మాచర్ల నియోజకవర్గం (Macherla Niyojakavargam)

మాచర్ల నియోజకవర్గం (Macherla Niyojakavargam)

హీరో నితిన్ నటించిన 'మాచర్ల నియోజకవర్గం' సినిమా ఆగస్టు 12 తేదీన రిలీజ్ అయింది. ఈ సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. నితిన్‌ను జోడిగా కృతి శెట్టి నటించారు. ఈ సినిమాలో కేథరిన్‌ త్రెసా, అంజలి, వెన్నెల కిషోర్, సముతిరకణి కీలక పాత్రలో నటించారు.

'మాచర్ల నియోజకవర్గం' సినిమాకు ఎమ్.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించగా..  సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించారు. సాగర్ మహతి సంగీతం అందించారు. ఈ సినిమా కోసం రూ. 30 కోట్లు బడ్జెట్ ఖర్చు చేశారు. బాక్సాఫీస్ వద్ద 'మాచర్ల నియోజకవర్గం' రూ. 15 కోట్లను మాత్రమే వసూళ్లు చేయగలిగింది. 

లైగర్ (Liger)

లైగర్

హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరీ జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన 'లైగర్' చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఆగస్టు 25న రిలీజ్ అయిన 'లైగర్' సినిమాను రూ. 125 కోట్ల బడ్జెట్‌తో కరణ్ జోహార్, చార్మీ కౌర్, అపూర్వ మెహతాలు నిర్మించారు. ఓవరాల్ కలెక్షన్ చూస్తే రూ. 80 కోట్ల రూపాయలను 'లైగర్' సినిమా వసూళ్లు చేసింది. 

ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడిగా అనన్య పాండే నటించారు. రమ్య కృష్ణన్, రోనిత్ రాయ్, విష్ణు రెడ్డి, ఆలీ, గెటప్ శ్రీను, మక్రంద్ దేశ్పాండే, మైక్ టైసన్ నటించారు. తనీష్క్ బాగ్చి, సునీల్ కశ్యప్, విక్రమ్ మంట్రోస్ సంగీతం అందించారు. 

రంగ రంగ వైభవంగా (Ranga Ranga Vaibhavanga)

రంగ రంగ వైభవంగా (Ranga Ranga Vaibhavanga)

పంజా వైష్ణవ్ తేజ్ నటించిన 'రంగ రంగ వైభవంగా' చిత్రం సెప్టెంబర్ 2 తేదీన రిలీజ్ అయింది. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్‌కు జోడిగా కేతిక శర్మ నటించారు. గిరీశాయ దర్శకత్వంలో విడుదలైన 'రంగ రంగ వైభవంగా' ఫ్లాప్ చిత్రంగా మిగిలింది. రూ. 10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన 'రంగ రంగ వైభవంగా' బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 5 కోట్లు వసూళ్లు చేసింది. ఈ సినిమాను నిర్మాత బి.వి.ఎస్.ఎన్ నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.  

అల్లూరి (Alluri)

అల్లూరి (Alluri) 

'అల్లూరి' సినిమా యాక్షన్, డ్రామా చిత్రంగా సెప్టెంబర్ 23 తేదీన విడుదలైంది. ఈ చిత్రం శ్రీ విష్ణు, కయదు లోహర్, తనికెళ్ళ భరణి, సుమన్, రాజా రవీంద్ర తదితరులు నటించారు. లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమా ఫ్లాప్‌గా మిగిలింది.. ఈ సినిమాకు ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించగా.. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు.

Read More: Highest Paid Tollywood Heroes : 2022లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న తెలుగు హీరోలపై ప్రత్యేక కథనం..

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!