మేం అప్పట్లో అద్దె ఇంట్లో ఉండేవాళ్లం.. రెంట్ కట్టలేక రెండు నెలలకో ఇల్లు మారేవాళ్లం: రష్మిక (Rashmika Mandanna)
టాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరు రష్మికా మందన్న (Rashmika Mandanna). ‘ఛలో’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. అనతికాలంలోనే టాప్ రేంజ్‌కు ఎదిగారు. తక్కువ సినిమాల్లోనే నటించినా.. తనదైన మార్క్ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు. ‘గీత గోవిందం’, ‘భీష్మ’, ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలతో టాప్ హీరోయిన్స్ లిస్టులో చేరిపోయిన రష్మిక.. ‘పుష్ప’ మూవీతో పాన్ ఇండియా రేంజ్‌లో పాపులారిటీ తెచ్చుకున్నారు.
‘పుష్ప’ మూవీతో ఉత్తరాదిన వచ్చిన క్రేజ్‌ను మరింతగా పెంచుకునేందకు బాలీవుడ్‌లో రెండు సినిమాలకు రష్మిక సైన్ చేశారు. అందులో ఒకటి ‘గుడ్ బై’ మూవీ. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ ఫిల్మ్.. డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో రెండో చిత్రం ‘మిషన్ మజ్ను’ పైనే ఆమె ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ కానుందని సమాచారం. ఈ విషయాన్ని పక్కనబెడితే.. సినిమాలు, యాడ్స్‌లో నటిస్తూ రష్మిక కోట్లు సంపాదిస్తున్నారు. అయితే ఒకప్పుడు ఆమె జీవితంలో పేదరికాన్ని అనుభవించారట.
నాన్న బొమ్మను కూడా కొనివ్వలేకపోయారు..!
‘కిరిక్ పార్టీ’ అనే కన్నడ చిత్రం ద్వారా చలనచిత్ర రంగంలోకి అడుగుపెట్టిన రష్మిక బాల్యం భారంగానే సాగిందట. ఒకప్పుడు ఆమె కుటుంబ జీవితం కష్టంగా ఉండేదట. ఈ విషయాన్ని స్వయంగా రష్మికే చెప్పారు. ఇటీవల ఓ చానల్‌తో ముచ్చటించిన ఆమె.. తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్నారు. తన బాల్యంలో ఫ్యామిలీ చాలా ఆర్థిక సమస్యలను ఎదుర్కొందని.. నాన్న ఆదాయం లేక చాలా కష్టాలు అనుభవించారని తెలిపారు. ఒక సమయంలో ఇంటి అద్దె చెల్లించలేక రెండు నెలలకు ఒకసారి ఇల్లు మారాల్సిన దుస్థితి ఉండేదని రష్మిక చెప్పుకొచ్చారు. నాన్న తనకు ఒక బొమ్మను కూడా కొనివ్వలేకపోయారని బాల్యంలో తన కుటుంబం పడిన బాధల గురించి రష్మిక గుర్తు చేసుకున్నారు.
ఇకపోతే, రష్మికా మందన్న నెక్స్ట్ ‘వరిసు’ (Varisu) చిత్రంతో ఆడియెన్స్‌ను పలకరించనున్నారు. తెలుగులో ఈ సినిమాను ‘వారసుడు’గా తీసుకొస్తున్నారు. ఇందులో కోలీవుడ్ బిగ్ స్టార్ విజయ్ హీరోగా యాక్ట్ చేస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను.. దిల్ రాజు నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీకి ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ బాణీలు సమకూర్చుతున్నారు.
Read more: RIPSuperStarKrishnaGaru: సూపర్ స్టార్ కృష్ణ రీల్ హీరోనే కాదు.. రియల్ హీరో కూడా..