మహేష్ బాబు (Mahesh Babu) - త్రివిక్రమ్ SSMB28 సినిమాలో రష్మిక మందన్నా(Rashmika Mandanna) ఐటెం సాంగ్..?
నేషనల్ క్రష్‌గా పాపులారిటీని సొంతం చేసుకున్న హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ అమ్మడు సౌత్ నుంచి నార్త్ వరకు పలు భారీ ప్రాజెక్ట్‌లతో బిజీ బిజీగా గడుతుపుతోంది. ఈ క్రమంలో రష్మిక ఓ డేర్ స్టెప్‌కి రెడీ అవుతున్నట్లు సమాచారం అందుతోంది. తన కెరీర్ లో తొలిసారి ఈ హాట్ బ్యూటీ ఐటెమ్ సాంగ్ (Rashmika Item Song) చేయబోతున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో (Mahesh Babu) ఆమె స్పెషల్ సాంగ్ కు స్టెప్పులేయబోతుందట. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందే 'SSMB28' సినిమాలో రష్మిక మందన్నా స్పెషల్ సాంగ్ చేయబోతుందని లేటెస్ట్ టాక్. ఇక త్రివిక్రమ్ సినిమాల్లో ఇప్పటివరకు ఐటెం పాట లేదు. మొదటి సారిగా ఈ సినిమాలో ఐటెం పాటను పెట్టనున్నారట.
'SSMB28' నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ మహేష్ సినిమాలో ఐటెమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నామని, అది గుర్తిండిపోయేలా చేయాలనుకుంటున్నామని, త్రివిక్రమ్‌ని (Director Trivikram) ఒప్పించే పనిలో ఉన్నామని అన్నారు. దీంతో త్రివిక్రమ్ మొదటిసారి నిర్మాతల ఒత్తిడి మేరకు స్పెషల్ సాంగ్ పెట్టబోతున్నారట. అందులో భాగంగానే ఇప్పటి వరకు స్పెషల్ సాంగ్‌లు చేయని రష్మికతో చేయిస్తే థియేటర్లు దద్దరిల్లిపోతాయని మూవీ టీమ్ భావిస్తోందట.
కాగా, ఇటీవలి కాలంతో సినిమాలలో ఐటెం సాంగ్స్ హవా నడుస్తోంది. ఒక సినిమాలో ఐటెం సాంగ్ ఉందంటే దానికి వచ్చే క్రేజ్ వేరు. అయితే.. ఒకప్పుడు ఐటెం సాంగ్స్ అంటే ప్రత్యేకంగా డ్యాన్సర్లు చేసేవారు. ఇప్పుడు స్టార్ హీరోయిన్లు ఐటెం పాటలకు మొగ్గు చూపుతున్నారు. ఒక్కో పాటకు కోటికి పైగా వసూలు చేస్తున్నారు. స్టార్ హీరోయిన్లతో ఐటెం సాంగ్ పెడితే తమ సినిమాకు క్రేజ్ పెరుగుతుందని నిర్మాతలు కూడా భావిస్తున్నారు. దీంతో ఖర్చుకు వెనకాడకుండా హీరోయిన్లకు భారీగా ముట్టచెప్పేందుకు వెనుకాడటం లేదు.
ఇదిలా ఉంటే.. మహేష్ బాబు - త్రివిక్రమ్ (Mahesh Babu - Trivikram) సినిమాలో పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తోంది. సెకండ్ హీరోయిన్‌గా శ్రీలీలని (Sree Leela) ఫైనల్ చేశారని టాక్. అలాగే థమన్ సంగీతం అందిస్తున్నారు. ‘అల వైకుంఠపురములో..’ రేంజ్‌లో ట్యూన్స్‌ను ప్లాన్ చేస్తున్నాడట. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.