Fittest Tollywood Actresses : ఫిట్ నెస్ విషయంలో హీరోలతో పోటీ పడుతున్న టాప్ 10 టాలీవుడ్ హీరోయిన్లు

Updated on Dec 03, 2022 04:49 PM IST
Fittest Tollywood Actresses: టాలీవుడ్ హీరోయిన్లు ఫిట్ నెస్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హీరోలతో పోటీగా వర్క్ అవుట్స్ చేస్తున్నారు.
Fittest Tollywood Actresses: టాలీవుడ్ హీరోయిన్లు ఫిట్ నెస్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హీరోలతో పోటీగా వర్క్ అవుట్స్ చేస్తున్నారు.

Fittest Tollywood Actresses: తెలుగు సినిమా రంగంలో ఫిట్ నెస్ బాడీ ఉన్న హీరోయిన్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. గతంలో ఫిట్ నెస్ విషయంలో బాలీవుడ్ హీరోయిన్లు ముందుండే వారు. కానీ ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్లు (Tollywood Actresses) ఫిట్ నెస్ ఫిజిక్ బాడీ మెయింటెన్ చేస్తూ పాపులర్ అయ్యారు. హీరోల కంటే తాము ఏ మాత్రం తక్కువ కాదంటూ జిమ్ వర్క్ అవుట్స్ చేస్తున్నారు. అంతేకాదు యాక్షన్ స్టంట్స్ నేర్చుకుంటున్నారు. ఫిట్ నెస్ బాడీని మెయింటెన్ చేస్తున్న టాప్ 10 టాలీవుడ్ హీరోయిన్లపై పింక్ విల్లా ప్రత్యేక కథనం.

సమంత

సమంత

సమంత (Samantha) ఫిట్ నెస్ ఫిజిక్ బాడీ కోసం ఎక్కువ వర్క్ అవుట్స్ చేసేవారు. ఏకాగ్రతతో వర్క్ అవుట్స్ చేస్తారు. వర్క్ అవుట్స్‌తో పాటు యోగా, రోప్ ట్రైనింగ్, వెయింట్ ట్రైనింగ్ వంటివి చేసేవారు. సమంత తన వర్క్ అవుట్స్‌కు సంబంధించని వీడియోలు  సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. కొత్త వర్క్ అవుట్స్ గురించిన అప్ డేట్స్ అభిమానులతో పంచుకునేవారు. 

'పుష్ప' సినిమాలో స్పెషల్ సాంగ్‌లో సమంత నటించారు. 'ఉ అంటావా మామ.. ఊఊ అంటవా' పాట కోసం సమంత ఎక్కువగా వర్క్ అవుట్స్ చేశారట. 'పుష్ప' పాటలో సమంత ఫిట్ నెస్ చూసిన తోటీ నటీనటులు ఆశ్చర్యపోయారట. 

గ్లామర్ పాత్రలతో పాటు లేడి ఓరియెంటెడ్ సినిమాల్లోనూ సమంత నటిస్తున్నారు. 'ఓ బేబి' లాంటి సినిమాల్లో సమంత నటించి పలువురు ప్రశంసలు అందుకున్నారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన 'యశోద' సినిమాలో సమంత గర్భవతిగా నటించారు. పాత్రకు తగినట్టుగా సమంత తన ఫిజిక్‌ను మెయింటెన్ చేస్తుంటారు. 

సమంత కొంత కాలంగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నారు. మయోసైటిస్ అంటే కండరాలకు సంబంధించన వ్యాధి. ప్రస్తుతం సమంత మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. 

రష్మిక మందన్న

రష్మిక మందన్న

'పుష్ప' సినిమా తరువాత రష్మిక మందన్న (Rashmika Mandanna) కు ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగింది. ఫిట్ నెస్ విషయంలో రష్మిక తన సీనియర్లనే ఫాలో అవుతున్నారు. ప్రతి రోజు జిమ్‌కు వెళతారు. కష్టమైన వ్యాయామాలు చేయడంలో రష్మిక ముందుంటారు.

'గీత గోవిందం', 'సరిలేరు నీకెవ్వరు', 'పుష్ప' సినిమాలలో రష్మిక అదరగొట్టారు. సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ ఆఫర్లతో దూసుకుపోతున్న రష్మిక.. తన బాడీ ఫిట్ నెస్‌పై మరింత ఫోకస్ పెంచారు. 

రకుల్ ప్రీత్ సింగ్

రకుల్ ప్రీత్ సింగ్

సినిమాల్లోకి వచ్చిన మొదట్లో కాస్త బొద్దుగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్.. ఇప్పుడు జీరో సైజ్‌తో కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ పంజాబీ బ్యూటీ ఫిట్ నెస్ విషయంలో ఎక్కడా రాజీ పడరు. పలు రకాల వర్క్ అవుట్స్ చేస్తూ ఫిట్ నెస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు.

 రాశీ ఖన్నా

 రాశీ ఖన్నా

రాశీ ఖన్నా మొదటి సినిమాలో ఉన్న లుక్‌కు ఇప్పటి లుక్‌కు చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు రాశీ ఖన్నా చాలా స్లిమ్ లుక్‌లో కనిపిస్తున్నారు. స్లిమ్‌గా కనిపించేందుకు రాశీ కన్నా చాలానే కష్టపడ్డారు. గంటల తరబడి జిమ్‌లో కసరత్తులు చేశారు. ఇటీవల తన జిమ్‌ వర్క్ అవుట్స్‌కు సంబంధించిన వీడియో రాశీ పోస్ట్ చేశారు. ఆ వీడియో చూస్తే రాశీ ఖన్నా ఫిట్ నెస్‌ కోసం ఎంత శ్రమిస్తున్నారో తెలుస్తుంది.  

 

డింపుల్ హయాతీ

డింపుల్ హయాతీ

'గద్దల కొండ గణేష్' సినిమాలో ఐటం సాంగ్‌తో పాపులర్ అయిన డింపుల్ హయాతీ బాడీ ఫిట్ నెస్ కోసం ప్రతి రోజూ జిమ్‌కు వెళతారు. తన వర్క్ అవుట్స్ అప్ డేట్స్‌ను డింపుల్ హయాతీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారు. ఈ 'ఖిలాడీ' హీరోయిన్ ఫిట్ నెస్ ఫిజిక్ బాడీని మెయింటెన్ చేస్తూ పలు ఆఫర్లు దక్కించుకుంటున్నారు. 

 

పూజా హెగ్డే

పూజా హెగ్డే

పూజా హెగ్డే నటించిన సినిమాలు తక్కువే అయినా టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. పూజా హెగ్డే ఫిజిక్ వల్లే టాప్ రేసులో ఉన్నారు. పూజ హెగ్డే హైట్‌కు తగ్గ వెయింట్ మెయింటెన్ చేస్తుంటారు. యోగా చేయడంలో పూజా తరువాతే ఎవరైనా. ఈ బ్యూటీ యోగాతో పాటు జిమ్నాస్టిక్స్ తరహా వర్క్ అవుట్స్ చేస్తుంటారు. 

పూజా హెగ్డే నటించిన 'బీస్ట్', 'ఆచార్య' అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. సినిమా ఫ్లాపులు పూజా అవకాశాలను అడ్డుకోలేకపోయాయి. ఫిట్ నెస్ ఫిజిక్ బాడీని మెయింటెన్ చూస్తూ వరుస ఆఫర్లను అందుకుంటున్నారు పూజా హెగ్డే.

 

లావణ్య త్రిపాఠి 

లావణ్య త్రిపాఠి

లావణ్య త్రిపాఠి 'భలే భలే మగాడివోయ్', 'సోగ్గాడే చిన్ని నాయనా' వంటి వరుస హిట్స్ అందుకున్నారు. కెరీయర్ బిగినింగ్‌లో జీరో సైజ్ మెయింటెన్ చేస్తూ లావణ్య మంచి అవకాశాలను అందుకున్నారు. తరచూ జిమ్ వర్క్ అవుట్స్ చేస్తూ లావణ్య తన పిజిక్‌ కాపాడుకుంటుంటారు. 

తమన్నా భాటియా

తమన్నా భాటియా

మిల్క్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తమన్నా భాటియా నాజూకుగా ఉండేందుకు చాలా కష్టపడతారు. కష్టమైన వర్క్ అవుట్స్ చేయడమే కాకుండా.. స్విమ్మింగ్, యోగా కూడా చేస్తుంటారు. కేవలం గ్లామర్‌తోనే కాకుండా నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు తమన్నా. ఈ మిల్ బ్యూటీకి ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా వరుస అవకాశాలు వస్తున్నాయి.

శ్రుతి హాసన్

శ్రుతి హాసన్

శ్రుతి హాసన్ సినీ జీవితం ఫ్లాపులతో మొదలైంది. తనపై తనకు ఉన్న నమ్మకంతో శ్రుతి హాసన్ సినిమాలపై మరింత ఫోకస్ పెట్టారు. జీరో సైజ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచి.. పలు అవకాశాలను అందుకున్నారు. 'త్రి', 'గబ్బర్ సింగ్', 'బలుపు' వంటి సినిమాలతో బ్లాక్ బాస్టర్ హిట్‌లు సాధించారు. 

శ్రుతి హాసన్ ఫిట్ నెస్ ఫిజిక్ కోసం చాలా కష్టపడతారు. యోగా, జిమ్, స్విమ్మింగ్ ఇలా అన్ని రకాల ఫిట్ నెస్ సూత్రాలను ఫాలో అవుతారు. ప్రస్తుతం శ్రుతి హాసన్ అగ్ర హీరోల సినిమాల్లో నటిస్తున్నారు. 

నివేత పేతురాజ్

నివేదా పేతురాజ్

నివేదా పేతురాజ్ సక్సెస్ ఫార్ములా తెలిసిన హీరోయిన్. హీరోయిన్ రేసులో ఉండాలంటే ఫిట్ నెస్ ముఖ్యమనే మాటను నివేదా పేతురాజ్ బలంగా నమ్ముతారు. పర్పెక్ట్ బాడీ షేష్‌ను నివేదా మెయింటెన్ చేస్తుంటారు. 

తన బాడీ ఫిట్ నెస్ కోసం ప్రతి రోజూ జిమ్ వర్క్ అవుట్స్ చేస్తుంటారు. నివేదా పేతురాజ్ తన వర్క్ అవుట్ వీడియోలను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ప్రస్తుతం నివేదా చిరంజీవితో 'వాల్తేరు వీరయ్య' సినిమాలో నటిస్తున్నారు.

Read More: Tollywood: ఈ ఏడాది రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన తెలుగు సినిమాలపై ప్రత్యేక కథనం..

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!