Vaarasudu: ‘రంజితమే’ పాట తెలుగు వెర్షన్ రిలీజ్.. యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్న ‘వారసుడు’ ఫస్ట్ సింగిల్

Updated on Nov 30, 2022 02:33 PM IST
Ranjithame Telugu Version: ‘రంజితమే’ సాంగ్ తమిళ వెర్షన్ యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది. ఈ పాట మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో దూసుకెళ్తోంది
Ranjithame Telugu Version: ‘రంజితమే’ సాంగ్ తమిళ వెర్షన్ యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది. ఈ పాట మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో దూసుకెళ్తోంది

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న కొత్త చిత్రం ‘వరిసు’ (Varisu). తెలుగులో ఈ సినిమాను ‘వారసుడు’ (Vaarasudu) పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని.. దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఇందులో విజయ్‌కు జోడీగా నేషనల్ క్రష్ రష్మికా మందన్న నటిస్తున్నారు. సీనియర్ నటులు జయసుధ, ఖుష్బూ ఈ మూవీలో కీలకపాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. 

ఫ్యామిలీ, మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘వారసుడు’ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ తమన్ బాణీలు సమకూర్చుతున్నారు. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రం నుంచి ఇటీవలే ‘రంజితమే’ (Ranjithame Song) అనే సాంగ్ తమిళ వెర్షన్ రిలీజైంది. ఇది మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో తాజాగా ‘రంజితమే’ పాట తెలుగు వెర్షన్‌ను మేకర్స్ విడుదల చేశారు. 

‘రంజితమే రంజితమే వయసు వాస్తు రంజితమే..’ అంటూ సాగే ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటోంది. సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ సాంగ్‌ను అనురాగ్ కులకర్ణి, ఎంఎం మానసి ఆలపించారు. తమిళ వెర్షన్‌ను హీరో విజయ్ పాడగా.. తెలుగులో మాత్రం స్టార్ సింగర్ అనురాగ్‌తో పాడించారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతోంది. సంక్రాంతికి ఇంకా టైమ్ ఉన్నప్పటికీ ‘వారసుడు’ మేకర్స్ ఇప్పటినుంచే సినిమా ప్రచారంలో జోరు పెంచడం గమనార్హం. 

ఇకపోతే, తెలుగులోనూ ‘వారసుడు’పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో విజయ్‌కు ఇక్కడా మార్కెట్ పెరిగింది. ‘తుపాకీ’, ‘పోలీసోడు’, ‘స్నేహితుడు’, ‘సర్కార్’. ‘అదిరింది’, ‘విజిల్’, ‘మాస్టర్’ చిత్రాలు తెలుగునాట మంచి వసూళ్లు సాధించాయి. దీంతో ‘వారసుడు’ సినిమాను టాలీవుడ్‌లో భారీ ఎత్తున రిలీజ్ చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. మరి, చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమాలను తట్టుకుని బాక్సాఫీస్ వద్ద విజయ్ మూవీ జోరు చూపిస్తుందో లేదో చూడాలి.   

Read more: RC15: ‘ఆర్‌సీ15’ షూటింగ్‌పై చరణ్​ (Ram Charan) మరో అప్‌డేట్.. సాంగ్ అదుర్స్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!