Highest Paid Tollywood Actresses : 2022లో అత్యధిక పారితోషికం తీసుకున్న టాప్ 10 తెలుగు హీరోయిన్లు..

Updated on Nov 29, 2022 05:32 PM IST
 Highest Paid Tollywood Actresses : తెలుగు సినిమాల్లో నటిస్తూ అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో నయనతార అగ్ర స్థానంలో ఉన్నారు.
Highest Paid Tollywood Actresses : తెలుగు సినిమాల్లో నటిస్తూ అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో నయనతార అగ్ర స్థానంలో ఉన్నారు.

తెలుగు సినిమా (Tollywood) రంగంలో హీరోయిన్ల పాత్ర చాలా కూడా చాలా ముఖ్యమైంది. కొందరు హీరోయిన్లు గ్లామర్ పాత్రలతోనే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటిస్తూ తమ సత్తా చాటుతున్నారు. అంతేకాదు బలమైన క్యారెక్టర్లలో నటించి సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. అంతేకాదు డైలాగులు, డాన్సులతో థియేటర్లు షేక్ చేస్తున్నారు. హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. 2022లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్లపై పింక్ విల్లా పత్యేక కథనం..

నయనతార (Nayanthara)

నయనతార (Nayanthara) - రూ. 10 కోట్లు

టాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు నయనతార. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అగ్ర హీరోలతో నయన్ నటించారు. అంతేకాదు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ ఏడాది జూన్ 9 తేదీన నయనతార తమిళ సూపర్ స్టార్ విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకున్నారు.

పెళ్లికి ముందు నయన్ రెమ్యునరేషన్ రూ. 5 నుంచి రూ.6 కోట్లు ఉండేది. పెళ్లి తరువాత నయన్ తన రెమ్యునరేషన్ పెంచేశారు. ఒక సినిమాలో నటించేందుకు నయనతార ఏకంగా రూ. 10 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారట. 

ప్రస్తుతం నయన్  బాలీవుడ్‌ స్టార్ హీరో షారూక్ ఖాన్‌తో 'జవాన్' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు 'కనెక్ట్', 'గోల్డ్', 'ఇరైవన్', 'లేడీ సూపర్ స్టార్ 75', 'ఎన్‌టీ 81' సినిమాల్లో నటిస్తున్నారు.

పూజా హెగ్డే (Pooja Hegde)

2. పూజా హెగ్డే (Pooja Hegde) - రూ. 5 కోట్లు

పూజా హెగ్డే మోడల్‌గా తన కెరీయర్ మొదలు పెట్టారు. నటనపై ఆసక్తితో మోడలింగ్ నుంచి సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. 2014లో విడుదలైన 'ముకుంద' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు పూజ. పూజా హెగ్డేకు మంచి ఫాలోయింగ్ ఉంది.

ఈ మధ్య కాలంలో విడుదలైన 'బీస్ట్', 'ఆచార్య' వంటి సినిమాలు పూజాకు ప్లాప్ ఇచ్చాయి. సినిమా హిట్టా.. ఫట్టా అనేది పట్టింపు లేకుండా పూజాకు వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నారు.  పూజ హెగ్డే ఒక్కో సినిమాకు రూ. 5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ప్రపంచ సినిమా వేడుకలైన కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌కు ఈ సంవత్సరం భారతదేశం నుంచి ప్రతినిధిగా పూజ హాజరయ్యారు. ప్రస్తుతం పూజ హెగ్డే మహేష్ బాబు సరసన ఎస్ఎస్ఎంబి 28లో నటిస్తున్నారు. 

అనుష్క శెట్టి (Anushka Shetty)

3. అనుష్క శెట్టి (Anushka Shetty) -  రూ. 4 కోట్లు

అనుష్క శెట్టి టాలీవుడ్‌ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో టాప్ హీరోలతో అనుష్క నటించారు. అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'అరుంధతి', 'రుద్రమదేవి', 'భాగమతి' సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచాయి. 'బాహుబలి', 'బాహుబలి 2' సినిమాలతో పాన్ ఇండియా లెవల్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. అనుష్క తీసుకునే రెమ్యునరేషన్ రూ. 4 కోట్లు ఉంటుందని టాక్.

 

సమంత (Samantha)

4. సమంత (Samantha) - రూ. 3.5 కోట్లు

సమంత తెలుగు సినిమా రంగంలోనే కాకుండా సౌత్ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. వెబ్ సిరీస్‌లు, స్పెషల్ సాంగ్స్‌లో నటిస్తూ సామ్ ప్రేక్షకులకు వినోదం అందిస్తున్నారు. సమంత రూ. 3.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటారని సమాచారం.

సమంత నటించిన 'యశోద' ఇటీవలే రిలీజ్ అయింది. 'యశోద' సినిమా బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం సమంత దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న 'శాకుంతలం' సినిమాలో నటిస్తున్నారు సామ్.

రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh)

5. రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) - రూ. 3.5 కోట్లు

రకుల్ ప్రీత్ సింగ్ 'కెరటం' సినిమాతో టాలీవుడ్ హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అయ్యారు. తెలుగుతో పాటు కన్నడ, తమిళ్, హిందీ భాషల్లో పలు సినిమాల్లో రకుల్ నటించారు. ఈ సంవత్సరం రకుల్ నటించిన 'అటాక్', 'రన్ వే 24', 'డాక్టర్ జి', 'కట్ ఫుట్లీ', 'థాంక్ గాడ్‌' వంటి బాలీవుడ్ సినిమాలు ప్రేక్షకులను అలరించాయి.

ప్రస్తుతం రకుల్ కమల్ హాసన్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న 'ఇండియన్ 2'లో నటిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్‌కు ఒక్కో సినిమాకు దాదాపు రూ. 3.5 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తారట. 

తమన్నా భాటియా (Tamanna Bhatia)

6. తమన్నా భాటియా (Tamanna Bhatia) - రూ. 3 కోట్లు

తమన్నా నటించిన మొదటి తెలుగు సినిమా 'శ్రీ'. ఈ సినిమా తమన్నాకు ఫ్లాఫ్‌గా మిగిలింది. 2007లో విడుదలైన 'హ్యాపీ డేస్' చిత్రంలో తమన్నా బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు. తెలుగుతో పాటు పలు భాషల్లో తమన్నా నటించి మెప్పించారు. టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్న ఈ మిల్క్ బ్యూటీ రెమ్యునరేషన్ రూ. 3 కోట్లు ఉంటుందట.

రష్మిక మందన్న (Rashmika Mandanna)

7. రష్మిక మందన్న (Rashmika Mandanna) - రూ. 3 కోట్లు

'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన హీరోయిన్ రష్మిక మందన్న. కన్నడ సినిమా ద్వారా హీరోయిన్‌గా మారిన రష్మిక.. 'ఛలో' సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్', 'సరిలేరు నీకెవ్వరు', 'పుష్ప' సినిమాలతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు. రష్మిక రెమ్యునరేషన్ రూ. 3 కోట్లు వరకు ఉంటుందని సమాచారం.

 

కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal)

8. కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) - రూ. 1.5 కోట్లు - 4 కోట్లు

టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. 'చందమామ', 'ఆర్య 2', 'మగధీర', 'బాద్‌షా', 'ఖైదీ నంబర్ 150' చిత్రాలలో కాజల్ అగర్వాల్ నటించారు. తెలుగుతో పాటు పలు భాషల్లో నటించారు. సౌత్ ఇండియాతో పాటు నార్త్ ఇండియాలోనూ కాజల్ అగర్వాల్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. కాజల్ పారితోషికం రూ.1.5 కోట్ల నుంచి రూ.4కోట్లు ఉంటుందట. 

శ్రుతి హాసన్ (Sruthi Hariharan)

9. శ్రుతి హాసన్ (Sruthi Hariharan) - రూ. 1.2 కోట్లు - 5 కోట్లు

ప్రముఖ హీరో కమల్ హాసన్ కూతురు శ్రుతి హాసన్ 'అనగనగ ఓ ధీరుడు' సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టారు. శ్రుతి హాసన్ ఒక్కో సినిమాకు రూ. 1.2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటారు. చిరంజీవితో 'వాల్తేరు వీరయ్య', బాలకృష్ణతో 'వీర సింహారెడ్డి' సినిమాలలో హీరోయిన్‌గా శ్రుతి హాసన్ నటిస్తున్నారు. 

తెలుగు అగ్ర హీరోలతో నటిస్తున్న శ్రుతి హాసన్ బ్లాక్ బాస్టర్ హిట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలు విజయం సాధిస్తే తన రెమ్యునరేషన్ పెంచుతారని టాక్.

సాయి పల్లవి (Sai Pallavi)

10. సాయి పల్లవి (Sai Pallavi) - రూ. కోటి - రూ. 2 కోట్లు

టాలీవుడ్ నేచురల్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి. కథా బలమున్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులకు వినోదం పంచుతున్నారు సాయి పల్లవి. ఈ మలయాళ బ్యూటీ రెమ్యునరేషన్ రూ. కోటి నుంచి రూ. 2 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. 

Read More: Highest Paid Tollywood Heroes : 2022లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న తెలుగు హీరోలపై ప్రత్యేక కథనం..

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!