నాకు ప్రేమించేంత సమయం లేదు: రష్మికా మందన్న (Rashmika Mandanna)

Updated on Oct 08, 2022 05:46 PM IST
రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఓర్పుతో ఉండటం చాలా అవసరమని నేషనల్ క్రష్ రష్మికా మందన్న (Rashmika Mandanna) అన్నారు
రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఓర్పుతో ఉండటం చాలా అవసరమని నేషనల్ క్రష్ రష్మికా మందన్న (Rashmika Mandanna) అన్నారు

టాలీవుడ్ స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మికా మందన్న (Rashmika Mandanna) వరుస సినిమాలు చేస్తూ తగ్గేదేలే అంటున్నారు. తెలుగులో మంచి స్టార్‪డమ్ సంపాదించుకున్న ఈ అమ్మడు.. ‘పుష్ప’ సినిమాతో బాలీవుడ్‌లోనూ ఓవర్‌నైట్ పాపులారిటీని తెచ్చున్నారు. ఇటీవలే ‘గుడ్ బై’ సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ కన్నడ కస్తూరి.. తాజాగా ప్రేమ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.  

ప్రేమించాలంటే సమయం ఉండాలని రష్మిక అన్నారు. తన దగ్గర అస్సలు టైమ్ లేదని ఆమె స్పష్టం చేశారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా రష్మికకు.. ‘మిమ్మల్ని నేషనల్‌ క్రష్‌ అంటారు. మరి మీకు ఎవరిపై అయినా క్రష్‌ ఉందా? మీ లవ్‌ లైఫ్‌ గురించి ఏం చెప్తారు?’ అని ఓ యాంకర్ నుంచి ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె స్పందిస్తూ.. 'ఇప్పటికే నేను అందుబాటులో ఉండటం లేదంటూ.. నా స్నేహితులు, కుటుంబీకులు నాపై కోప్పడుతుంటారు. ఏదైనా రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు మనం చాలా టైమ్‌ ఇవ్వాల్సి ఉంటుంది’ అని రష్మిక చెప్పారు.

‘రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు చాలా ఓర్పుతో ఉండాలి. బంధం నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాలి. ప్రస్తుతం సినిమాలతో నేను చాలా బిజీగా ఉన్నాను. నాకు అస్సలు టైమ్‌ ఉండటం లేదు’ అని రష్మిక స్పష్టం చేశారు. లవ్ లైఫ్​‌కు సంబంధించి తన జీవితంలో రాబోయే రోజుల్లో ఏదైనా విశేషం ఉంటే తప్పకుండా చెబుతానని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం తానెవరితోనూ రిలేషన్‌లో లేనని చెప్పుకొచ్చారు.  

ఇదిలాఉంటే.. ఇటీవలే విజయ్ దేవరకొండ, రష్మికల (Rashmika) జంట ముంబయి ఎయిర్ పోర్టులో మీడియా కంటపడ్డారు. వీరిద్దరూ కలసి వెకేషన్‌కు మాల్దీవులకు వెళ్లారని వినికిడి. గతంలో కూడా ఈ జంట మీడియాకు అనేక చోట్ల దర్శనమిచ్చింది. జిమ్‌లు, డేట్ నైట్స్, పబ్బులు .. ఇలా చాలా చోట్ల విజయ్ (Vijay Deverakonda), రష్మికల జంట గతంలో కెమెరామెన్ల కళ్లకు చిక్కడం గమనార్హం. ఈ జంట గతంలో ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ లాంటి సినిమాల్లో కలసి నటించారు. వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ఇప్పటికీ ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. 

Read more: Vijay Deverakonda : విజయ్, రష్మికలు ప్రేమలో ఉన్నారని రూమర్స్.. మాల్దీవుల ట్రిప్‌లో "గీత గోవిందం" జంట!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!