డైట్ విషయంలో పక్కాగా ఉంటా.. కానీ అవి కనిపిస్తే మాత్రం నోరు కట్టేసుకోలేను!: రష్మికా మందన్న (Rashmika Mandanna)

Updated on Nov 24, 2022 11:42 AM IST
వీకెండ్స్‌లో ఎప్పుడైనా డైట్ తప్పితే వెంటనే తనను తాను తిరిగి ట్రాక్‌లోకి పెట్టుకునేందుకు రన్నింగ్ మీద దృష్టిపెడతానని రష్మిక అన్నారు
వీకెండ్స్‌లో ఎప్పుడైనా డైట్ తప్పితే వెంటనే తనను తాను తిరిగి ట్రాక్‌లోకి పెట్టుకునేందుకు రన్నింగ్ మీద దృష్టిపెడతానని రష్మిక అన్నారు

ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణించాలంటే అన్నింట్లోనూ మెరుగ్గా ఉండాలి. నటులు మాత్రం అన్ని విషయాల్లోనూ పర్ఫెక్ట్‌గా ఉండాలి. అందంతోపాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. హీరో, హీరోయిన్లు ఫిట్‌గా ఉండటం తప్పనిసరి. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కో సినిమాను కొన్ని నెలలపాటు తీస్తూ పోతున్నారు. కాబట్టి పాత్రకు తగ్గట్లు ఫిట్‌గా ఉండాలి. అందుకు వ్యాయామం చేయడంతోపాటు ఆహార నియమాలను కూడా పాటించాలి. ఒకరకంగా చెప్పాలంటే నోరు కట్టేసుకోవాలి. ఇష్టమైన పదార్థాలు తినకుండా.. ఆరోగ్యకరమైనవి మాత్రమే భుజించాలి.

కళ్ల ముందు ఇష్టమైన ఆహార పదార్థాలు కనిపిస్తుంటే తినకుండా ఉండటం అంత సులువేం కాదు. కానీ ఫిట్‌నెస్ విషయంలో ఎంతో శ్రద్ధ చూపే కొంతమంది నటులు దీన్ని తేలికగా అవలంబిస్తారు. ఆ కోవలోకే వస్తారు స్టార్ హీరోయిన్ రష్మికా మందన్న(Rashmika Mandanna). ఎప్పుడూ చలాకీగా, ఉల్లాసంగా కనిపించే ఈ కన్నడ కస్తూరి.. ఫిట్‌నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారట. డైట్ విషయంలో తాను పక్కాగా ఉంటానని ఆమె చెబుతున్నారు.

వీకెండ్స్‌లో ఎప్పుడైనా డైట్ తప్పితే వెంటనే తనను తాను తిరిగి ట్రాక్‌లోకి పెట్టుకునేందుకు రన్నింగ్ మీద దృష్టిపెడతానని రష్మిక పేర్కొన్నారు

‘నేను మంచి ఆహార ప్రియురాల్ని. ప్రపంచంలోని దాదాపు అన్ని రకాల ఫుడ్స్‌ను రుచి చూశా. అయితే వాటన్నింటి కన్నా ఇంటి భోజనమే ఉత్తమమైనదని గ్రహించా. నేను ఫుడీని అయినప్పటికీ డైట్ విషయంలో పక్కాగా వ్యవహరిస్తా. అయితే సుషీ, సూప్ నూడుల్స్ వంటి నాకిష్టమైన ఆహార పదార్థాలు కనిపించినప్పుడు మాత్రం నోరు కట్టేసుకుని ఉండలేను’ అని రష్మిక తెలిపారు. చాక్లెట్స్, ఐస్‌క్రీమ్స్ లాంటి తీపి పదార్థాలను తాను అమితంగా ఇష్టపడతానని ఆమె చెప్పారు. 

వీకెండ్స్‌లో ఎప్పుడైనా డైట్ తప్పితే వెంటనే తనను తాను తిరిగి ట్రాక్‌లోకి పెట్టుకునేందుకు రన్నింగ్ మీద దృష్టిపెడతానని రష్మిక పేర్కొన్నారు. ఇంటి భోజనాన్ని మించినది ఏదీ లేదని ఆమె అన్నారు. ఇకపోతే, రష్మిక ప్రస్తుతం ‘పుష్ప 2’, ‘వారసుడు’ చిత్రాల్లో నటిస్తున్నారు. హిందీలో ‘మిషన్ మజ్ను’, ‘యానిమల్’ సినిమాలు చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు విజయవంతమైతే హిందీలో అగ్ర హీరోయిన్ల సరసన ఆమె పేరు కూడా చేరిపోతుంది. మరి, ఈ చిత్రాలు ఏ మేరకు సక్సెస్ సాధిస్తాయో చూడాలి. 

Read more: Biggboss Season 6: బిగ్ బాస్ హౌస్‌లో ఫ్యామిలీ మీట్ ఎపిసోడ్స్.. ఎమోషనల్‌గా హౌస్‌మేట్స్.. ప్రోమో వైరల్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!