Vijay Deverakonda : విజయ్, రష్మికలు ప్రేమలో ఉన్నారని రూమర్స్.. మాల్దీవుల ట్రిప్‌లో "గీత గోవిందం" జంట !
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda).. అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ లాంటి సినిమాలతో టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ ప్రేక్షకులను కూడా అలరించిన రౌడీ స్టార్. అయితే విజయ్ చాలా రోజుల నుండి నటి రష్మికతో ప్రేమలో ఉన్నారని రూమర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ఇటీవలే విజయ్, రష్మికల (Rashmika) జంట ముంబయి ఎయిర్ పోర్టులో మీడియా కంటపడ్డారు. వీరిద్దరూ కలిసి వెకేషన్‌కి మాల్దీవులకు వెళ్లనున్నారని వినికిడి. గతంలో కూడా ఈ జంట మీడియాకి అనేక చోట్ల దర్శనమిచ్చింది. జిమ్‌లు, డేట్ నైట్స్, పబ్బులు .. ఇలా చాలా చోట్ల విజయ్, రష్మికల జంట గతంలో కెమెరామెన్ల కళ్లకు చిక్కడం గమనార్హం.
ఈ జంట గతంలో గీత గోవిందం, డియర్ కామ్రేడ్ లాంటి సినిమాలలో కలిసి నటించారు. వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ఇప్పటికీ ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో విలేకరి రష్మికను (Rashmika) ఓ విచిత్రమైన ప్రశ్న అడిగారు. "మీరు హీరో విజయ్ దేవరకొండతో డేటింగ్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దానికి మీరేమంటారు" అని అడగ్గా, దానికి రష్మిక తనదైన శైలిలో సమాధానమిచ్చారు.
మా పెయిర్ చాలా క్యూట్‌గా ఉంటుంది : రష్మిక
"ఇది చాలా క్యూట్ ప్రశ్న. అయ్య బాబోయ్.. మా పెయిర్ నిజంగానే చాలా క్యూట్‌గా ఉంటుంది. మేమిద్దరం కెరీర్ ఒకేసారి ప్రారంభించాం. అలాగే ఇద్దరం కలిసి పనిచేశాం. మంచి స్నేహితులం అయిపోయాం. అదే స్నేహంతో చాలా సార్లు కలిసి ప్రయాణించాం. మా ఇద్దరివి చాలా విశాలమైన ఆలోచనలు. ఈ లోకమంతా "విజయ్ - రష్మిక"ల మాదిరిగా ఆలోచిస్తే ఎంత బాగుంటుంది. చాలా క్యూట్‌గా ఉంటుంది కదా" అంటూ తన మదిలోని భావాలను బయట పెట్టింది రష్మిక (Rashmika).
ఆమెను నేను డార్లింగ్ అని పిలుస్తాను : విజయ్ దేవరకొండ
అలాగే విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కూడా గతంలో రష్మిక గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. "ఆమెను నేను డార్లింగ్ అని పిలుస్తాను. మేమిద్దరం ఇప్పటికి 2 సినిమాలు చేశాం. ఆమెతో కలిసి నటించడం చాలా ఇష్టం. ఆమె నాకు మంచి స్నేహితురాలు. మా మధ్య ఓ ప్రత్యేకమైన బాండింగ్ ఉంది. మేమిద్దరం ఎప్పుడు కలిసినా, పరిశ్రమలో ఎలాంటి సినిమాలు వస్తే బాగుంటుంది?.. ఇంకా మేం ఎలాంటి సినిమాలు చేస్తే బాగుంటుంది" లాంటి విషయాలే మాట్లాడుకుంటాం అని తెలిపారు.
రష్మిక (Rashmika) ప్రస్తుతం "గుడ్ బై" అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇది రష్మికకు తొలి బాలీవుడ్ సినిమా. అలాగే "లైగర్" చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ ప్రస్తుతం, సమంత కథానాయికగా నటిస్తున్న "ఖుషీ" చిత్రంతో బిజీగా ఉన్నారు.
Read More: విజయ్ దేవరకొండ కొత్త సినిమా జనగణమన పై కొత్త అప్డేట్