తెలుగులో డివైడ్ టాక్.. అయినా మంచి వసూళ్లు రాబడుతున్న ‘పొన్నియిన్ సెల్వన్’ (Ponniyin Selvan 1)

Updated on Oct 07, 2022 12:03 AM IST
'పొన్నియిన్ సెల్వన్ 1' (Ponniyin Selvan 1)లో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) నటనకు మంచి అప్లాజ్ వస్తోంది
'పొన్నియిన్ సెల్వన్ 1' (Ponniyin Selvan 1)లో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) నటనకు మంచి అప్లాజ్ వస్తోంది

భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరిగా పేరున్న మణిరత్నం నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ‘పొన్నియిన్ సెల్వన్’ (Ponniyin Selvan 1) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. కొంత విరామం తర్వాత చేసిన చిత్రం కావడం, అందులోనూ ఆయన డ్రీమ్ ప్రాజెక్టు కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవితోపాటు ఐశ్వర్యారాయ్ బచ్చన్, త్రిష లాంటి బడా స్టార్లు నటించడంతో ‘పొన్నియిన్ సెల్వన్’పై మరింత హైప్  క్రియేట్ అయ్యింది. 

తమిళ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ అనే చారిత్రక నవల ఆధారంగా మణిరత్నం తెరకెక్కించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం శుక్రవారం రిలీజైంది. తమిళం, తెలుగుతోపాటు కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పెద్ద ఎత్తున విడుదలైంది. తమిళ ఆడియన్స్‌కు ఈ చిత్రం నచ్చినప్పటికీ.. తెలుగులోకి వచ్చేసరికి సరైన టాక్ రాలేదు. మార్నింగ్ షోకే మూవీకి డివైడ్ టాక్ వచ్చేసింది. దీంతో తెలుగునాట కలెక్షన్స్‌పై ఎఫెక్ట్ పడుతుందేమోనని అందరూ భావించారు. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఫస్ట్ డే ఈ మూవీకి మంచి వసూళ్లు రావడం విశేషం. 

థియేటర్లకు రప్పిస్తున్న అభిమానం 

నెగెటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌లను పట్టించుకోని జనం.. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం మీద ఉన్న అభిమానం, నమ్మకంతో థియేటర్స్‌కు భారీగా తరిలారు. ముఖ్యంగా మల్టీప్లెక్సులు, ఏ సెంటర్లలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ కనిపించింది. ఈవినింగ్ షోకు ఒక్కసారిగా కలెక్షన్స్ ఊపందుకున్నాయి. వారాంతం కావడంతో సినిమా హాల్స్ దగ్గర ప్రేక్షకుల హంగామా కనిపించింది. శని, ఆదివారాలకూ అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి. ఈ లెక్కన ఫస్ట్ వీకెండ్‌లో తెలుగునాట పొన్నియిన్ సెల్వన్ మంచి కలెక్షన్లనే నమోదు చేసే అవకాశం ఉంది. ఎలాగూ దసరా సెలవులు కాబట్టి సోమవారం నుంచి సినిమా వసూళ్లు పెద్దగా డ్రాప్ అయ్యే చాన్స్ లేదు. మరి, ఈ చిత్రం ఎంత మేరకు కలెక్షన్లు రాబడుతుందో చూడాలి. 

ఇక భారీ క్యాస్టింగ్‌తో విజువల్ వండర్‌గా తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ మూవీని కొందరు జక్కన్న తీసిన బాహుబలితో పోలుస్తున్నారు. కానీ కథ, కథనాల విషయంలో రెండు చిత్రాలకు పోలికే లేదని.. స్లో నెరేషన్‌తో సాగే పొన్నియిన్ సెల్వన్‌కు ఆ స్థాయి లేదని అంటున్నారు. మణిరత్నం ఎన్నో  వ్యయప్రయాసలకు ఓర్చి తీసిన ఈ చిత్రంలో నటించిన విక్రమ్, ఐశ్యర్యారాయ్, కార్తీ, త్రిషలకు మంచి అప్లాజ్ వస్తోంది. ముఖ్యంగా ఐష్, విక్రమ్‌ల లవ్ ట్రాక్ బాగుందని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. మణిరత్నం మేకింగ్‌కు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. 

Read more: 'పొన్నియిన్ సెల్వ‌న్ 1' రివ్యూ (Ponniyin Selvan 1 Review) - చోళ రాజుల సాహ‌స యాత్ర‌ను అద్భుతంగా తెర‌కెక్కించిన‌ మ‌ణిర‌త్నం

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!