Pushpa: తగ్గేదేలే అంటున్న బన్నీ (Allu Arjun) ఫ్యాన్స్!.. ‘పుష్ప’ మూవీ రీ-రిలీజ్.. డేట్ ఎప్పుడంటే?

Updated on Nov 18, 2022 04:04 PM IST
‘పుష్ప’ (Pushpa) ఫస్ట్ పార్ట్ రీ రిలీజ్ కోసం కేరళ రాష్ట్ర వ్యాప్తంగా బన్నీ (Allu Arjun) ఫ్యాన్స్ ఏర్పాట్లు చేస్తున్నారు
‘పుష్ప’ (Pushpa) ఫస్ట్ పార్ట్ రీ రిలీజ్ కోసం కేరళ రాష్ట్ర వ్యాప్తంగా బన్నీ (Allu Arjun) ఫ్యాన్స్ ఏర్పాట్లు చేస్తున్నారు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) గురించి చెప్పాల్సి వస్తే.. ‘పుష్ప’ (Pushpa)కు ముందు, ‘పుష్ప’ తర్వాత అని చెప్పాల్సి ఉంటుంది. అంతలా ఈ చిత్రం బన్నీ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచింది. ‘ఆర్య’, ‘దేశముదురు’, ‘బన్నీ’, ‘ఆర్య 2’, ‘రేసుగుర్రం’, ‘సరైనోడు’ లాంటి చిత్రాలతో తెలుగు నాట స్టార్ డమ్ సంపాదించిన అల్లు అర్జున్.. ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారారు. ముఖ్యంగా ఉత్తరాదిన ఆయన పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. 

‘పుష్ప’ సినిమా తెలుగుతోపాటు తమిళం, మలయాళం, హిందీల్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. హిందీలో రూ.100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. మలయాళంలో అంతకుముందు బన్నీ చిత్రాలకు వచ్చిన వసూళ్లను ‘పుష్ప’ అధిగమించింది. కేరళ ఆడియెన్స్ ఈ చిత్రాన్ని విపరీతంగా ఎంజాయ్ చేశారు. సాధారణంగా అల్లు అర్జున్‌కు అక్కడ ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మలయాళీయులు ఆయన్ను మల్లు అర్జున్ అని ప్రేమగా పిలుస్తారు. 

‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ ను మరోసారి థియేటర్లలో చూడాలని నిర్ణయించుకున్నారు

‘పుష్ప’ సెకండ్ పార్ట్ ‘ది రూల్’ కోసం అన్ని భాషల అభిమానుల మాదిరిగానే కేరళలో బన్నీ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు. అయితే, ‘పుష్ప 2’ ఇప్పట్లో వచ్చేలా లేదు. మరోవైపు ‘పుష్ప’ తొలి భాగం వచ్చి ఏడాది అవుతోంది. గతేడాది డిసెంబర్ 17న ఈ మూవీ వరల్డ్‌వైడ్‌గా విడుదలైంది. రెండో పార్ట్ కోసం వేచి ఉండలేకపోతున్న కేరళ అభిమానులు.. ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్‌ను మరోసారి థియేటర్లలో చూడాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో తొలిభాగం విడుదలైన డిసెంబర్ 17న రీ-రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. 

‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ రీ-రిలీజ్ కోసం కేరళ రాష్ట్ర వ్యాప్తంగా బన్నీ ఫ్యాన్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ4 ఎంటర్‌‌టైన్‌మెంట్స్ సంస్థ కేరళ వ్యాప్తంగా వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో ‘పుష్ప’ను రీ-రిలీజ్ చేయబోతోంది. ఈ మధ్య హీరోల పుట్టిన రోజులకు వాళ్ల పాత చిత్రాలు, బ్లాక్‌బస్టర్స్‌ను రీ-రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఆనవాయితీగా మారుతోంది. కానీ బన్నీ ఫ్యాన్స్ జన్మదినంతో సంబంధం లేకుండా.. రీసెంట్ బ్లాక్‌బస్టర్‌‌‌‌నే మళ్లీ విడుదల చేయాలనుకోవడం ప్రత్యేకంగా నిలుస్తోంది. మరి, రీ-రిలీజ్‌తో ‘పుష్ప’ ఎన్ని వసూళ్లు సాధిస్తుందో చూడాలి. 

Read more: Movie Review : మాస్ అండ్ యాక్షన్‌ ఎంటర్‌‌టైనర్‌‌గా సుడిగాలి సుధీర్‌‌ (Sudigali Sudheer) ‘గాలోడు’

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!