దళపతి విజయ్‌తో కలిసి నటిస్తా.. ఆ దర్శకుడితో అయితేనే అంటూ సంచలన కామెంట్స్ చేసిన చియాన్ విక్రమ్ (Vikram Chiyaan)

Updated on Sep 01, 2022 02:53 PM IST
చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) సినిమా థియేటర్లలోకి వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు గడిచింది
చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) సినిమా థియేటర్లలోకి వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు గడిచింది

తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) కోబ్రా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 31వ తేదీన విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌తో దూసుకుపోతోంది. అన్ని వర్గాల నుంచి కోబ్రా చిత్రానికి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాలో విక్రమ్ గణిత శాస్త్రవేత్తగా నటించారు. కేజీఎఫ్‌ ఫేమ్‌ శ్రీనిథిశెట్టి, మీనాక్షి, మృణాళిని హీరోయిన్లుగా నటించారు.

కోబ్రా సినిమాతో మరోసారి విక్రమ్ తన నట విశ్వరూపాన్ని చూపించారని టాక్ వినిపిస్తోంది. డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ట్విట్టర్‌‌లో అభిమానులతో ముచ్చటించారు విక్రమ్. ఈ క్రమంలోనే తమిళ స్టార్ దళపతి విజయ్‌తో కలిసి సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు.

చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) సినిమా థియేటర్లలోకి వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు గడిచింది

హాట్‌ టాపిక్‌గా విక్రమ్ చిట్‌చాట్..

అంతేకాదు.. తాను విజయ్‌తో నటించే సినిమాకు డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఇదే విషయంపై డైరెక్టర్ అజయ్ స్పందించారు. విక్రమ్‌, విజయ్‌ కలిసి నటిస్తే చూసేందుకు టికెట్ తీసుకునే మొదటి అభిమానిని తానేనని అన్నారు. ట్విట్టర్‌‌ వేదికగా విక్రమ్ నిర్వహించిన ఈ చిట్ చాట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.  

ప్రస్తుతం విజయ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వరిసు అనే సినిమా చేస్తున్నారు. విజయ్ మొదటి సారి తెలుగులో నటిస్తోన్న సినిమా ఇది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. తెలుగులో వారసుడుగా వస్తున్న ఈ మూవీలో రష్మికా మందాన హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.  చియాన్ విక్రమ్ (Chiyaan Vikram).. క్లాసికల్‌ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తోన్న ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలో నటిస్తున్నారు.

Read More : కోబ్రా సినిమా కోసం చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) తీసుకున్న రెమ్యునరేషన్ తెలిస్తే షాకవ్వాల్సిందే?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!