ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) చేసిన టాప్‌10 డాన్స్ మూవ్‌మెంట్స్‌

Updated on Nov 25, 2022 07:01 PM IST
పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun). ప్రస్తుతం పుష్ప2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు బన్నీ
పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun). ప్రస్తుతం పుష్ప2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు బన్నీ

టాలీవుడ్‌ (Tollywood)లో బెస్ట్ డాన్సర్‌‌ ఎవరు అంటే.. అస్సలు ఆలోచించకుండా ఠక్కున చెప్పే పేరు మెగాస్టార్ చిరంజీవి. ఆయన గ్రేస్, మాస్‌ స్టెప్స్‌కి థియేటర్లలో విజిల్స్‌ వేయనివాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆయన తర్వాత ఇప్పుడున్న హీరోల్లో ఎవరు బాగా డాన్స్ చేస్తారని అడిగితే కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న స్టార్ హీరోల్లో చాలా మంది మంచి డాన్సర్లే. అల్లు అర్జున్ (Allu Arjun), రాంచరణ్ (Ram Charan), జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) బెస్ట్ డాన్సర్స్ అని చెప్పుకోవాలి. వీరిలో ఎవరి స్టైల్ వాళ్లది.

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి తన టాలెంట్‌, హార్డ్‌వర్క్‌తో తనకంటూ సొంత ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న హీరో అల్లు అర్జున్. సినిమా సినిమాకి వేరియేషన్‌ను చూపిస్తూ అభిమానులను అలరిస్తున్న బన్నీ.. ప్రతి సినిమాలోనూ గుర్తుండిపోయే డ్యాన్స్ మూవ్‌మెంట్‌ చేస్తుంటారు. వాటిలో నుంచి టాప్‌10 స్టెప్స్‌ పింక్‌విల్లా వ్యూయర్స్‌ కోసం..

పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun). ప్రస్తుతం పుష్ప2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు బన్నీ

పుష్ప (Pushpa) సినిమాలో ‘ఊ అంటావా..’ :

ఐకాన్‌స్టార్‌‌ అల్లు అర్జున్ (Allu Arjun), నేషనల్ క్రష్ రష్మికా మందాన (Rashmika Mandanna) హీరోహీరోయిన్లుగా క్రియేటివ్ డైరెక్టర్‌‌ సుకుమార్ (Sukumar) తెరకెక్కించిన సినిమా పుష్ప. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదలై ఘనవిజయం సాధించింది. పుష్ప సినిమాలో స్టార్ హీరోయిన్‌ స్పెషల్ సాంగ్‌ చేశారు. ఈ పాట దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది.

‘ఊ అంటావా మామా ఊహూ అంటావా మామా’ పాటలో అల్లు అర్జున్‌, సమంత (Samantha) వేసిన స్టెప్స్‌ ప్రేక్షకులకు అలరించాయి.

పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun). ప్రస్తుతం పుష్ప2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు బన్నీ

‘అల వైకుంఠపురములో..’ని ‘బుట్టబొమ్మ’ :

అల్లు అర్జున్ – పూజా హెగ్డే (Pooja Hegde) హీరోహీరోయిన్లుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్‌‌హిట్ సినిమా అల వైకుంఘపురములో. ఈ సినిమాలోని అన్ని పాటలు మ్యూజికల్‌గా, విజువల్‌గా వ్యూయర్స్‌ను అలరించాయి.  యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో ట్రెండింగ్ అయ్యాయి.

ఈ సినిమాలోని బుట్టబొమ్మ పాట ఎంత హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ పాటలో (Allu Arjun) – పూజా హెగ్డే వేసిన స్టెప్స్‌ వైరల్ అయ్యింది.

పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun). ప్రస్తుతం పుష్ప2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు బన్నీ

‘అల వైకుంఠపురములో..’ని ‘రాములో రాములా’ :

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో తెరకెక్కిన అల వైకుంఠపురములో సినిమాలోని మరో సూపర్‌‌హిట్ సాంగ్ ‘రాములో రాములా’. ఈ పాటలోని స్టెప్ సినీ ప్రేమికులను ఆకర్షించింది. సినిమాలో నటించిన దాదాపు అందరూ కనిపించే ఈ పాటలో.. బన్నీ వేసిన స్టెప్ ఆకట్టుకుంటుంది.

దీనికి దోశ స్టెప్‌ అని అల్లు అర్జున్ (Allu Arjun) కూతురు అర్హ ఒక వీడియోలో కామెంట్ చేసింది.

పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun). ప్రస్తుతం పుష్ప2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు బన్నీ

‘నా పేరు సూర్య’ సినిమాలోని ‘లవర్‌‌ ఆల్‌సో.. ఫైటర్ ఆల్‌సో’ :

బన్నీ – వక్కంతం వంశీ కాంబినేషన్‌లో తెరకెక్కిన యాక్షన్ సినిమా ‘నా పేరు సూర్య’. ఈ సినిమాలోని లవ్‌ సాంగ్‌ ‘లవర్‌‌ ఆల్‌సో.. ఫైటర్ ఆల్‌సో’.. ఈ పాటలో అల్లు అర్జున్ (Allu Arjun) వేసిన స్టెప్స్‌ గ్రాఫిక్స్ చేశారా అనేట్టుగా ఉంటాయి. క్యాప్‌తో బన్నీ చేసే విన్యాసాలు ఆశ్యర్యపరుస్తాయి.

ఈ పాట కోసం బన్నీ చాలా ప్రాక్టీస్ చేశారని, డాన్స్ పట్ల ఆయనకున్న డెడికేషన్ అటువంటిది అని చిత్ర యూనిట్ తెలిపింది.

పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun). ప్రస్తుతం పుష్ప2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు బన్నీ

‘రేసుగుర్రం’లో ‘సినిమా చూపిస్త మామ’ :

అల్లు అర్జున్‌ (Allu Arjun) నటించిన క్రేజీ సినిమాల్లో రేసుగుర్రం ఒకటి. సురేందర్‌‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించారు. రేసుగుర్రం సినిమాలో పాటలు కూడా శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలోని సినిమా చూపిస్త మామ అనే పాట వైరల్ అయ్యింది.

ఈ పాటలో శృతిహాసన్ (Shruti Haasan) – బన్నీ వేసిన స్టెప్‌ బాగా పాపులర్ అయ్యింది. ఎంతో కష్టమైన ఈ స్టెప్‌ను  అల్లు అర్జున్ చాలా ఈజ్‌తో చేశారని ప్రశంసలు వచ్చాయి.

పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun). ప్రస్తుతం పుష్ప2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు బన్నీ

‘ఇద్దరమ్మాయిలతో’లోని ‘టాప్‌ లేచిపోద్ది’ :

డాషింగ్‌ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh)– అల్లు అర్జున్ (Allu Arjun) కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ఇద్దరమ్మాయిలతో. అమలాపాల్, కేథరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ‘టాప్ లేచిపోద్ది’ పాట వైరల్ అయ్యింది. ఈ పాటలో బన్నీ వేసిన మాస్ స్టెప్స్ అభిమానులను అలరించాయి.

ఇద్దరమ్మాయిలతో సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సందడి చేయలేదు. అయినప్పటికీ ‘టాప్‌ లేచిపోద్ది’ పాట బాగా పాపులర్ అయ్యింది.

పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun). ప్రస్తుతం పుష్ప2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు బన్నీ

‘డీజే’ సినిమాలోని ‘సీటీమార్‌‌’ :

అల్లు అర్జున్ (Allu Arjun) – పూజా హెగ్డే కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘డీజే.. దువ్వాడ జగన్నాధం’. ఈ సినిమాలోని దాదాపు అన్ని పాటలు విజువల్‌గా అలరిస్తాయి. డీజే సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌‌గా మిగిలినప్పటికీ.. సీటీమార్ పాట బాగా వైరల్ అయ్యింది.

సీటీమార్ పాటలో అల్లు అర్జున్ – పూజా హెగ్డే (Pooja Hegde) వేసిన గ్రేసీ స్టెప్స్‌ అలరిస్తాయి.

పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun). ప్రస్తుతం పుష్ప2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు బన్నీ

‘ఆర్య2’లోని ‘మై లవ్‌ ఈజ్ గాన్’ :

బన్నీని హీరోగా నిలబెట్టిన ఆర్య సినిమాకు సీక్వెల్‌గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన సినిమా ఆర్య2 (Aarya2). లవ్‌, యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌‌గా తెరకెక్కిన ఈ సినిమా యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుంది. నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌‌లో బన్నీ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి.

ఆర్య2 సినిమాలోని ‘మై లవ్ ఈజ్ గాన్’ పాటలో అల్లు అర్జున్‌ (Allu Arjun) స్టెప్స్‌ మెస్మరైజ్ చేస్తాయి. ఈ సినిమాలో దాదాపు అన్ని పాటల్లోనూ మంచి స్టెప్స్‌ బాగున్నప్పటికీ.. ‘మై లవ్ ఈజ్ గాన్’లో డ్యాన్స్‌కు బన్నీ అభిమానులు ఫిదా అయ్యారు.

పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun). ప్రస్తుతం పుష్ప2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు బన్నీ

‘ఆర్య2’ సినిమాలో ‘రింగ రింగా’ :

సుకుమార్ – అల్లు అర్జున్ (Allu Arjun) దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్య2 సినిమాలోని మరో పాపులర్ సాంగ్‌ ‘రింగ రింగా’. ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ ‘రింగ రింగా’. ఈ పాట ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఆర్య2 కమర్షియల్‌గా హిట్‌ సాధించకపోయినా పాటలు మాత్రం బాగా వైరల్ అయ్యాయి.

రింగ రింగా పాటలో బన్నీ వేసే స్టెప్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి.

పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun). ప్రస్తుతం పుష్ప2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు బన్నీ

‘బద్రినాథ్‌’ సినిమాలోని ‘నాథ్‌ నాథ్‌’ :

అల్లు అర్జున్ (Allu Arjun) – తమన్నా హీరోహీరోయిన్లుగా వీవీ వినాయక్ తెరకెక్కించిన సినిమా ‘బద్రినాథ్’. యాక్షన్‌ అడ్వంచరస్‌ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర సందడి చేయలేదు. అయితే ఈ సినిమా కోసం బన్నీ పడిన కష్టం ఆయన బాడీ మేకోవర్‌‌లో కనిపిస్తుంది.

బద్రినాథ్‌ టైటిల్‌ సాంగ్‌ ‘నాథ్‌ నాథ్‌’ పాటలో బన్నీ వేసే స్టెప్స్‌ ఉర్రూతలూగించాయి. అల్లు అర్జున్‌తో సమానంగా తమన్నా (Tamannaah) డాన్స్ అందరినీ ఆకట్టుకుంది.

Read More : వెండితెరపై తళుక్కున మెరిసి.. మాయమైన పది మంది హీరోయిన్లు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!