‘ధృవ’ స్టోరీ ప్రభాస్ (Prabhas) కోసమే రాసుకున్నా: మోహన్ రాజా (Mohan Raja)!

Updated on Oct 10, 2022 02:24 PM IST
‘గాడ్‌ఫాదర్’ (GodFather) విడుదలవ్వడంతో ‘ధృవ’ సీక్వెల్, నాగార్జునతో చేయబోయే మల్టీస్టారర్ చిత్రాలపై మోహన్ రాజా ఫోకస్ చేస్తున్నారు.
‘గాడ్‌ఫాదర్’ (GodFather) విడుదలవ్వడంతో ‘ధృవ’ సీక్వెల్, నాగార్జునతో చేయబోయే మల్టీస్టారర్ చిత్రాలపై మోహన్ రాజా ఫోకస్ చేస్తున్నారు.

గాడ్‌ఫాదర్’ (GodFather) చిత్రంతో ఒక్కసారిగా అందరూ తన వైపు చూసేలా చేశారు దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja). రీఎంట్రీ తర్వాత సరైన హిట్ లేక సతమతమవుతున్న మెగాస్టార్ చిరంజీవికి ‘గాడ్ ఫాదర్’ మూవీతో ఆ కొరతను మోహన్ రాజా తీర్చారనే చెప్పాలి. ఒరిజినల్ ‘లూసిఫర్’కు ఏమాత్రం తగ్గని స్థాయిలో ‘గాడ్‌ఫాదర్’ను తెరకెక్కించిన మోహన్ రాజా.. ఇప్పుడు టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు. 

 దాదాపు 22 ఏళ్ల కింద ‘హనుమాన్ జంక్షన్’ సినిమాతో టాలీవుడ్‌కు మోహన్ రాజా దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ సినిమా ఘన విజయం సాధించింది. అయితే మోహన్ రాజా తన మకాంను చెన్నైకి మార్చారు. సోదరుడు జయం రవితో తమిళంలో సినిమాలు తీస్తూ ఆయన బిజీ అయిపోయారు. అయితే మొత్తానికి సుదీర్ఘ విరామం తర్వాత మోహన్ రాజా మళ్లీ తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చారు. ‘గాడ్‌ఫాదర్’ సక్సెస్‌తో టాలీవుడ్‌లో మరిన్ని ప్రాజెక్టులు చేయాలని ఆయన భావిస్తున్నారు. 

కింగ్ నాగార్జున, అఖిల్ కాంబోలో భారీ మల్టీస్టారర్‌కు మోహన్ రాజా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. దీంతో పాటు రామ్ చరణ్​‌తో ‘ధృవ’ (Dhruva 2) సీక్వెల్ రూపొందించాలని ఆయన అనుకుంటున్నారు. ఇదిలాఉంటే.. ‘ధృవ’ సినిమాను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో తీయాలని భావించానని మోహన్ రాజా రివీల్ చేశారు. 

‘ధృవ’ ఒరిజినల్ ‘తని ఒరువన్’ కథను ప్రభాస్ కోసమే రాసుకున్నానని మోహన్ రాజా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. కానీ కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదన్నారు. ఇది విన్న ప్రభాస్ ఫ్యాన్స్.. ఆ సినిమా డార్లింగ్‌కు పడుంటే మరో రేంజ్‌లో ఉండేదంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకవేళ ప్రభాస్‌తో ‘ధృవ’ చేసుంటే ఏ రేంజ్‌లో ఉండేదో తెలియదు. ఈ సినిమా మిస్సయినందున భవిష్యత్తులోనైనా ప్రభాస్‌తో మోహన్ రాజా ఏదైనా ప్రాజెక్టు తెరకెక్కిస్తారేమో చూడాలి. 

ఇకపోతే, మోహన్ రాజా తీసిన ‘గాడ్‌ఫాదర్’ సినిమా దసరా కానుకగా విడుదలై సూపర్‌‌హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. రిలీజైన అన్ని కేంద్రాల్లోనూ హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం రూ.100 కోట్లు వసూల్ చేసి సంచలనం సృష్టించింది.

Read more: God Father :"గాడ్ ఫాదర్" మూవీ డైరెక్టర్ మోహన్ రాజా (Mohan Raja) గురించిన టాప్ 10 ఆసక్తికరమైన విశేషాలు!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!