‘గాడ్ ఫాదర్’ (God Father) మూవీ చిరు ఫ్యాన్స్‌కు పండుగలా ఉంటుంది: మోహన్ రాజా

Updated on Oct 06, 2022 03:39 PM IST
‘గాడ్ ఫాదర్’ (God Father)లో చిరు (Chiranjeevi), సల్మాన్ ఖాన్‌ల (Salman Khan) స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోతుందని మోహన్ రాజా అన్నారు
‘గాడ్ ఫాదర్’ (God Father)లో చిరు (Chiranjeevi), సల్మాన్ ఖాన్‌ల (Salman Khan) స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోతుందని మోహన్ రాజా అన్నారు

‘గాడ్ ఫాదర్’ (God Father) సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని ఆ సినిమా దర్శకుడు మోహన్ రాజా అన్నారు. మాతృక ‘లూసిఫర్’కు ఏమాత్రం తగ్గకుండా ‘గాడ్ ఫాదర్’ను తెరకెక్కించానన్నారు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అద్భుతంగా నటించారని కొనియాడారు. దసరా కానుకగా ఈనెల 5న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలను మీడియాతో పంచుకున్నారు మోహన్ రాజా. 

తెలుగులో సినిమాలు తీయాల్సిందిగా ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ తనను పలుమార్లు పిలిచారని మోహన్ రాజా అన్నారు. ’ఎన్వీ ప్రసాద్ గారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. తెలుగులోకి రమ్మని ఆయన చాలాసార్లు పిలిచారు. ఒకసారి మహేష్ బాబు దగ్గరికీ తీసుకెళ్లారు‘ అని మోహన్ రాజా చెప్పారు. ‘తని ఒరువన్’ సినిమా నుంచి రామ్ చరణ్‌తో తనకు పరిచయం ఏర్పడిందన్నారు. 

‘ధ్రువ–2’ గురించి రామ్ చరణ్‌తో చర్చలు జరుపుతున్న సమయంలో, ‘లూసిఫర్’ ప్రస్తావన వచ్చిందన్నారు మోహన్ రాజా. ‘లూసిఫర్ తెలుగు రీమేక్‌కు దర్శకుడిగా ఎన్వీ ప్రసాద్ గారే నా పేరును సూచించారు. చరణ్‌‌తో పాటు​, చిరంజీవి గారికి ఇది నచ్చింది. అయితే వారిని కలవడానికి ముందే లూసిఫర్ చూశాను. అందులో నాకో కొత్త కోణం దొరికింది. దీంతో ఇదే విషయాన్ని చిరంజీవి గారితో చర్చించాను. ఆయనకూ నచ్చడంతో ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లింది’ అని మోహన్ రాజా పేర్కొన్నారు. 

‘లూసిఫర్’తో పోలిస్తే ‘గాడ్ ఫాదర్’లో చాలా మార్పులు

లూసిఫర్‌లో లేని ఒక యాంగిల్ గాడ్ ఫాదర్‌లో ఉంటుందని మోహన్ రాజా పేర్కొన్నారు. ఒరిజినల్‌లోని కథను అలాగే ఉంచి.. ఫ్రెష్ స్క్రీన్‌ప్లే రాశానన్నారు హీరోతోపాటు మరో పది పాత్రలు కూడా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పది క్యారెక్టర్స్ చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉంటాయని మోహన్ రాజా తెలిపారు. . 

చిరు పాత్ర నిడివిని పెంచాం

‘లూసిఫర్‌లో మోహన్ లాల్ పాత్ర నిడివి తక్కువగా ఉంటుంది.. 2 గంటల 50 నిమిషాల సినిమాలో మోహన్ లాల్ గారు 50 నిమిషాలే కనిపిస్తారు. కానీ గాడ్ ఫాదర్‌లో చిరంజీవి గారు దాదాపు 2 గంటల పాటు కనిపిస్తారు. మెగాస్టార్ లేని సీన్స్‌లో కూడా ఆయన ప్రెజెన్స్ ఉంటుంది. దీన్ని బట్టే మేం ఎలాంటి మార్పులు చేశామో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా ఓ పండుగలా ఉంటుంది. చిరు ఇమేజ్‌కు తగ్గ కథ ఇది’ అని మోహన్ రాజా అన్నారు.  

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ గాడ్ ఫాదర్‌లో కీలక పాత్ర పోషించారని మోహన్ రాజా చెప్పారు. మూవీలో చిరుతోపాటు సల్లూ భాయ్ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోతుందన్నారు. సల్మాన్ తాను నటించిన సీన్స్ చూసుకున్నాక, చాలా హ్యాపీగా ఫీలయ్యారని పేర్కొన్నారు. 

Read more: ప్రతి అభిమానీ గాడ్‌ఫాదరే.. నా వెనుక లక్షల మంది గాడ్‌ఫాదర్స్ ఉన్నారు: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!