God Father: 'గాడ్ ఫాద‌ర్' సీక్వెల్‌కు రెడీ అంటున్న ద‌ర్శ‌కుడు మోహన్ రాజా

Updated on Oct 06, 2022 03:36 PM IST
God Father: 'గాడ్ ఫాద‌ర్' సినిమా బ్లాక్ బాస్ట‌ర్ హిట్ సాధిస్తే 'గాడ్ ఫాద‌ర్ 2' కూడా తెర‌కెక్కిస్తాన‌ని ద‌ర్శ‌కుడు మోహన్ రాజా తెలిపారు. 
God Father: 'గాడ్ ఫాద‌ర్' సినిమా బ్లాక్ బాస్ట‌ర్ హిట్ సాధిస్తే 'గాడ్ ఫాద‌ర్ 2' కూడా తెర‌కెక్కిస్తాన‌ని ద‌ర్శ‌కుడు మోహన్ రాజా తెలిపారు. 

టాలీవుడ్ మెగాస్టార్  చిరంజీవి (Chiranjeevi) న‌టించిన 'గాడ్ ఫాద‌ర్' సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా అక్టోబ‌ర్ 5 తేదీన‌ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమాను కోలీవుడ్ ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా తెర‌కెక్కించారు. 'గాడ్ ఫాద‌ర్' సినిమాకు సీక్వెల్ కూడా తీస్తామ‌ని ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. 'గాడ్ ఫాద‌ర్' సినిమా వంద శాతం స‌క్సెస్ అవుతుందని మోహ‌న్ రాజా బ‌లంగా న‌మ్ముతున్నారు. మలయాళ సూపర్‌ హిట్‌ ‘లూసీఫర్‌’ రీమేక్‌గా గాడ్ ఫాద‌ర్ విడుద‌ల కానుంది. 

'లూసీఫ‌ర్‌' మార్పులతో రీమేక్

పొలిటిక‌ల్ డ్రామాగా 'గాడ్ ఫాద‌ర్' (God Father)సినిమాను తెర‌కెక్కించారు. ఈ సినిమాలో చిరంజీవి స‌రి కొత్త పాత్ర‌లో ప్రేక్ష‌కుల‌కు వినోదం పంచ‌నున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టించారు. ఇక  సౌత్ స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో క‌నిపించ‌నున్నారు. న‌టుడు సత్యదేవ్ కూడా ఈ సినిమాలో న‌టించారు.

సునీల్‌, సముద్రఖని, పూరీ జగన్నాథ్‌ పాత్రలు వెండితెర‌పై ఆస‌క్తిగా ఉండ‌నున్నాయి. 'గాడ్ ఫాద‌ర్' సినిమా ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 5వ తేదీన తెలుగు, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల కానుంది. మ‌ల‌యాళ భాష‌లో తెర‌కెక్కిన 'లూసీఫ‌ర్' సినిమాకు రీమేక్‌గా ప‌లు మార్పుల‌తో ద‌ర్శ‌కుడు మోహన్ రాజా 'గాడ్ ఫాద‌ర్' సినిమాను చిత్రీక‌రించారు.

God Father: 'గాడ్ ఫాద‌ర్' సినిమా బ్లాక్ బాస్ట‌ర్ హిట్ సాధిస్తే 'గాడ్ ఫాద‌ర్ 2' కూడా తెర‌కెక్కిస్తాన‌ని ద‌ర్శ‌కుడు మోహన్ రాజా తెలిపారు. 

సీక్వెల్ కూడా చేస్తాం - మోహన్ రాజా

‘లూసీఫర్‌’ సినిమా చూసిన త‌రువాత 'గాడ్ ఫాద‌ర్' సినిమా కోసం చిరంజీవిని మోహన్ రాజా సంప్ర‌దించారు. 'లూసీఫ‌ర్‌'లో ప‌లు  మార్పులు చేసి 'గాడ్ ఫాద‌ర్' చేద్దామ‌ని చెప్పార‌ట‌. చిరంజీవి లాంటి హీరోనే 'గాడ్ ఫాద‌ర్' చేయ‌గ‌ల‌ర‌ని మోహన్ రాజా భావించార‌ట‌. 'గాడ్ ఫాద‌ర్' సినిమా ముఖ్యంగా ప‌ది పాత్ర‌ల చూట్టూ తిరుగుతుంది.

ముఖ్యమంత్రి ప‌ద‌వి కోసం ఎత్తుకు పై ఎత్తులు వేసే స‌న్నివేశాలు ఆస‌క్తిగా ఉంటాయ‌ట‌. చిరంజీవి త‌న‌ను ఎంతో స‌పోర్ట్ చేశార‌న్నారు మోహన్ రాజా. 'గాడ్ ఫాద‌ర్' సినిమా బ్లాక్ బాస్ట‌ర్ హిట్ సాధిస్తే 'గాడ్ ఫాద‌ర్ 2' కూడా తెర‌కెక్కిస్తాన‌ని ద‌ర్శ‌కుడు మోహన్ రాజా తెలిపారు. 

Read More: Chiranjeevi's GodFather Trailer : అద్భుతః.. చిరు స్టామినాని మరోసారి రుచి చూపించిన గాడ్ ఫాదర్ ట్రైలర్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!