ప్రభాస్ (Prabhas) లేకుంటే ‘ఆదిపురుష్’ (Adipurush) లేదు: ఓం రౌత్ (Om Raut)

Updated on Oct 08, 2022 10:32 AM IST
‘ఆదిపురుష్’ (Adipurush) కోసం ప్రభాస్ (Prabhas)ను ఎందుకు ఎంపిక చేసుకున్నారో వివరించిన డైరెక్టర్ ఓం రౌత్
‘ఆదిపురుష్’ (Adipurush) కోసం ప్రభాస్ (Prabhas)ను ఎందుకు ఎంపిక చేసుకున్నారో వివరించిన డైరెక్టర్ ఓం రౌత్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన ‘ఆదిపురుష్’ (Adipurush) చిత్రం టీజర్ సంచలనం సృష్టిస్తోంది. అయోధ్య వేదికగా విడుదలైన ఈ టీజర్ విడుదలైన 24 గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి 101 మిలియన్‌ వ్యూస్‌తో ఇండియా నం 1 రికార్డు సాధించింది. బాలీవుడ్‌ (Bollywood)లో ఫాస్టెస్ట్‌ 50 మిలియన్‌ వ్యూస్‌ సాధించిన టీజర్‌గా రికార్డు సృష్టించింది. కేజీఎఫ్​–2 రికార్డును ఆదిపురుష్ బ్రేక్ చేసింది.

ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ‘ఆదిపురుష్’ చిత్రం.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని అటుంచితే.. ‘ఆదిపురుష్’ కోసం బాలీవుడ్ హీరోలను కూడా కాదని, ప్రభాస్‌ను మాత్రమే ఎంపిక చేసుకోవడంపై చిత్ర దర్శకుడు ఓం రౌత్ వివరణ ఇచ్చారు. 

‘ఆదిపురుష్’ కథ రాస్తున్నప్పుడు.. రాముడి పాత్ర కోసం తన మనసులో కేవలం ప్రభాస్ మాత్రమే మెదిలారని ఓం రౌత్ అన్నారు. ప్రభాస్ ఒప్పుకోకపోతే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేది కాదని స్పష్టం చేశారు. ఆయన క్యారెక్టర్ చాలా ప్రత్యేకంగా, దైవికంగా ఉంటుందని ఓం రౌత్ పేర్కొన్నారు. 

‘ఆదిపురుష్​’ టీజర్ మీద వస్తున్న ట్రోల్స్ పైనా ఓం రౌత్ స్పందించారు. ట్రోలింగ్‌ చూసి తాను కాస్త ధైర్యం కోల్పోయిన మాట వాస్తవమేనని రౌత్ అన్నారు. అయితే, ట్రోలింగ్‌ వల్ల తానేమీ పూర్తిగా ఆశ్చర్యపోలేదన్నారు. ‘ఆదిపురుష్’ సినిమాను వెండితెర కోసం తీశామని ఓం రౌత్ స్పష్టం చేశారు. ఈ మూవీని మొబైల్ ఫోన్లలో చూసేందుకు తీయలేదన్నారు. అందరికీ చేరువ చేయాలనే ఉద్దేశంతోనే యూట్యూబ్‌ ఆడియెన్స్‌ కోసం టీజర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని రౌత్ పేర్కొన్నారు.

‘మేం కొద్ది మంది కోసమే ‘ఆదిపురుష్’ సినిమాను తీయలేదు. బిగ్ స్క్రీన్లకు దూరమైన వారి కోసం, మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారినీ థియేటర్లకు రప్పించేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇది రామాయణ గాథ. గ్లోబల్‌ కంటెంట్‌ కోరుకుంటున్న తర్వాతి జనరేషన్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను తీస్తున్నాం. వారికి అర్ధమయ్యే విధంగా చెప్పాలని ప్రయత్నిస్తున్నాం. అందుకే మేం ఈ మార్గాన్ని (3డీ మోషన్‌ క్యాప్చర్‌)ను ఎంచుకున్నాం’ అని ఓం రౌత్‌ చెప్పుకొచ్చారు.

కాగా ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ‘ఆదిపురుష్’​ చిత్రంలో ప్రభాస్ సరసన జానకి పాత్రలో కృతీ సనన్ నటిస్తున్నారు. రావణుడి పాత్రలో సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ యాక్ట్ చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.  

Read more: ఫ్యాన్స్ కోసం ‘ఆదిపురుష్’ (Adipurush) టీజర్ స్పెషల్ స్క్రీనింగ్స్.. అభిమానులను రివ్యూ కోరిన ప్రభాస్ (Prabhas)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!