రూ.100 కోట్ల క్లబ్‌లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ‘గాడ్‌ఫాదర్’.. 4 రోజుల్లోనే భారీ కలెక్షన్లు

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా తెరకెక్కిన సినిమా గాడ్‌ఫాదర్. విజయ దశమి కానుకగా విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్ టాక్ సొంతం చేసుకుంది. మలయాళ స్టార్ మోహన్‌లాల్ హీరోగా నటించిన లూసిఫర్ సినిమాకు రీమేక్‌గా గాడ్‌ఫాదర్ తెరకెక్కింది. విడుదలైన అన్ని కేంద్రాలలోనూ మంచి టాక్ దక్కించుకుని కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
బుధవారం విడుదలైన 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. చిరంజీవి నటించిన సినిమాకు హిట్ టాక్ వస్తే కలెక్షన్లు ఎలా వస్తాయో గాడ్‌ఫాదర్ మరోసారి నిరూపిస్తోంది. నిజానికి గాడ్‌ఫాదర్ సినిమాకు వచ్చిన హిట్ టాక్‌తో కేవలం మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరే చాన్స్ ఉంది.
స్క్రీన్లు తక్కువ కావడంతో..
అయితే గాడ్‌ఫాదర్ సినిమాతోపాటు కింగ్ నాగార్జున నటించిన ది ఘోస్ట్, మరో సినిమా స్వాతిముత్యం విడుదలయ్యాయి. దాంతో తక్కువ థియేటర్లలో గాడ్‌ఫాదర్ రిలీజ్ అయ్యింది. లేకుంటే ఒకరోజు ముందుగానే రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కిన గాడ్‌ఫాదర్ సినిమాలో సల్మాన్‌ఖాన్, నయనతార, సత్యదేవ్, సునీల్, బ్రహ్మాజీ కీలకపాత్రలు పోషించారు.
ప్రస్తుతం చిరంజీవి భోళాశంకర్, వాల్తేరు వీరయ్య సినిమాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలతోపాటు మరో మలయాళ రీమేక్‌ను చేయడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. మమ్ముట్టి హీరోగా నటించిన ‘భీష్మ పర్వ’ సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచనలో చిరంజీవి (Chiranjeevi) ఉన్నారని టాక్. ఈ సినిమా రీమేక్ రైట్స్‌ను మెగా పవర్‌స్టార్ రాంచరణ్ సొంతం చేసుకున్నారని సమాచారం.
Read More : మలయాళ సినిమా ‘భీష్మ పర్వ’ రీమేక్ చేసే ఆలోచనలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)!
