ప్రభాస్ (Prabhas) ఫస్ట్ మూవీ ‘ఈశ్వర్’ (Eeswar) గురించి ఆసక్తికరమైన విశేషాలు

Updated on Oct 06, 2022 11:50 PM IST
తొలి చిత్రం ‘ఈశ్వర్’తోనే మంచి నటుడిగా ప్రభాస్ (Prabhas) నిరూపించుకున్నారు
తొలి చిత్రం ‘ఈశ్వర్’తోనే మంచి నటుడిగా ప్రభాస్ (Prabhas) నిరూపించుకున్నారు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) టాలీవుడ్‌లో అడుగుపెట్టి దాదాపుగా రెండు దశాబ్దాలు కావొస్తోంది. 2002లో వచ్చిన ఈశ్వర్ సినిమాతో చిత్రసీమకు డార్లింగ్ పరిచయమయ్యారు. జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి హిట్‌గా నిలిచింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీతో ప్రభాస్‌లో మంచి నటుడు ఉన్నాడని నిరూపించింది.  

ఈశ్వర్ మూవీలో ప్రభాస్ (Prabhas) సరసన శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్‌గా నటించారు. సీనియర్ నటులు రేవతి, శివకృష్ణ, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు కీలక పాత్రల్లో యాక్ట్ చేశారు. ఈ సినిమాకు ఆర్‌పీ పట్నాయక్ సంగీతం అందించారు. ప్రభాస్‌తోపాటు హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్, ఆర్‌పీ పట్నాయక్‌కు ఇదే మొదటి సినిమా కావడం విశేషం.  

ఈశ్వర్ (Eeswar) మూవీ తర్వాత ‘రాఘవేంద్ర’ సినిమాతో నిరాశపర్చినా.. అనంతరం శోభన్ దర్శకత్వంలో వచ్చిన ‘వర్షం’ చిత్రంతో అమ్మాయిల హృదయాలను ప్రభాస్ కొల్లగొట్టారు. ఈ సినిమాలో చేసిన యాక్షన్ సీక్వెన్సులతో మాస్ ఆడియన్స్‌కూ యంగ్ రెబల్ స్టార్ దగ్గరయ్యారు. 

వర్షం తర్వాత ‘డార్లింగ్’, ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’, ‘మిర్చి’, ‘బాహుబలి’ సిరీస్ సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు ప్రభాస్. ప్రస్తుతం ఆదిపురుష్, సలార్ చిత్రాల్లో నటిస్తూ ఆయన బిజీబిజీగా ఉన్నారు. ఆదిపురుష్ టీజర్‌ ఆదివారం రిలీజైంది. దీనిపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఈ టీజర్ కార్టూన్ వీడియోలా ఉందని.. తమిళ సూపర్ స్టార్ గతంలో నటించిన ‘కొచ్చాడియాన్’ను ఇది గుర్తు చేస్తోందని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. 

కొందరు నెటిజన్స్ మాత్రం హాలీవుడ్ చిత్రాల బడ్జెట్‌తో పోలిస్తే ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ తక్కువ నిర్మాణ వ్యయంతో, మంచి క్వాలిటీ విజువల్ ఎఫెక్ట్స్‌తో ఆకట్టుకునేలా ఉందని ప్రశంసిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ కానున్న ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. 

Read more: ప్రభాస్ (Prabhas) ఆదిపురుష్‌ (Adipurush) టీజర్‌‌! న్యాయం చేతుల్లోనే అన్యాయానికి వినాశనం

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!