Unstoppable Season2: ‘అన్ స్టాపబుల్ సీజన్ 2’ తర్వాతి ఎపిసోడ్ కు గెస్టులుగా ప్రభాస్, గోపీచంద్.. ఫ్యాన్స్ హంగామా!

Updated on Dec 11, 2022 12:20 PM IST
అన్ స్టాపబుల్ సీజన్ 2 తర్వాతి ఎపిసోడ్ వేరే లెవల్ లో ఉండాలని ఏకంగా ‘బాహుబలి’ ప్రభాస్ (Prabhas) ను దించేస్తున్నారు.
అన్ స్టాపబుల్ సీజన్ 2 తర్వాతి ఎపిసోడ్ వేరే లెవల్ లో ఉండాలని ఏకంగా ‘బాహుబలి’ ప్రభాస్ (Prabhas) ను దించేస్తున్నారు.

Unstoppable Season2: నందమూరి బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్ సీజన్ 2’ ముందు సీజన్ కన్నా ఈ సారి మరింత వేగంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే పలు ఎపిసోడ్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న సీజన్ 2 తర్వాతి ఎపిసోడ్ కి సన్నద్దమవుతోంది. అన్‌స్టాపబుల్‌ సీజన్ 2 ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ షోకు వచ్చి బాలయ్య కలిసి ప్రేక్షకులను అలరించారు. 

ఇక చివరిగా ప్రసారమైన ఎపిసోడ్ లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, నిర్మాతలు అల్లు అరవింద్ (Allu Aravind), సురేష్ బాబులు ఇండస్ట్రీ విషయాలతో పాటు తమ వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. 

ప్రభాస్, గోపీచంద్ లతో పాటుగా సీనియర్ నటీమణులు జయసుధ (Jayasudha), జయప్రద (Jayaprada) కూడా రాబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇదిలా ఉంటే.. తర్వాతి ఎపిసోడ్ వేరే లెవల్ లో ఉండాలని ఏకంగా ‘బాహుబలి’ ప్రభాస్ (Prabhas) ను దించేస్తున్నారు. గెస్ట్ గా రాబోతున్నాడనే వార్త చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అయ్యారు. ఆయన్ని ఆహ్వానిస్తూ ఆహా షో జరిగే చోట ప్రభాస్ బ్యానర్ లతో హడావిడి చేశారు. ఈ క్రేజీ ఎపిసోడ్ పై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. హోస్ట్ సీట్ లో బాలయ్య (Nandamuri Balakrishna), హాట్ సీట్ లో ప్రభాస్.. ఈ ఇద్దరినీ ఒకే ఫ్రేమ్ లో చూసి ఆడియన్స్ సూపర్ ఎక్జైట్ అవుతారని చెప్పవచ్చు.

ఈ సూపర్ ఎపిసోడ్ కి ప్రభాస్ తో పాటుగా ఆయన స్నేహితుడు హీరో గోపిచంద్ (Hero Gopichand) కూడా రాబోతున్నారు. అంతేకాకుండా ప్రభాస్, గోపీచంద్ లతో పాటుగా సీనియర్ నటీమణులు జయసుధ (Jayasudha), జయప్రద (Jayaprada) కూడా రాబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఎపిసోడ్ షూటింగ్ నేటి నుంచే (డిసెంబర్ 11 నుంచి) ప్రారంభం కానుంది.

ప్రభాస్ కెరీర్ ను మలుపు తిప్పిన ‘వర్షం’ చిత్రంలో గోపీచంద్ (Hero Gopichand) విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత కూడా వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగుతూనే ఉంది. ప్రభాస్ తో తనకున్న సాన్నిహిత్యం గురించి గోపీచంద్ పలు సందర్భాల్లో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మరి ఇప్పుడు బాలయ్య తన షోలో ఈ మ్యాచో మెన్ లు ఇద్దరితో కలిసి ఎంత ఎంటర్టైన్మెంట్ అందిస్తారో చూడాలి.

Read More: దిగ్గజ దర్శకనిర్మాతలతో బాలకృష్ణ (Balakrishna) 'అన్ స్టాపబుల్ 2' (Unstoppable 2).. ఎపిసోడ్ 5 ప్రోమో రిలీజ్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!