Tollywood : వెండితెరపైనే కాదు బుల్లితెరపైనా సత్తాచాటుతున్న టాలీవుడ్ స్టార్లు

Updated on Dec 09, 2022 10:01 AM IST
వెండితెరపై సందడి చేస్తూనే బుల్లి తెరపై జరిగే షోలకు హోస్ట్ చేస్తూ అలరిస్తున్నా టాలీవుడ్ (Tollywood) స్టార్లు
వెండితెరపై సందడి చేస్తూనే బుల్లి తెరపై జరిగే షోలకు హోస్ట్ చేస్తూ అలరిస్తున్నా టాలీవుడ్ (Tollywood) స్టార్లు

ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి ఎంతో కష్టపడుతుంటారు మన స్టార్లు. దాని కోసం ఒక్కోసారి ఒక్కో రకంగా పాట్లు పడుతుంటారు. ఏం చేసినా అది ప్రేక్షకులను అలరించడానికేనని అంటుంటారు. అలా తమ హార్డ్‌వర్క్‌, డెడికేషన్‌తో కింది స్థాయి నుంచి స్టార్ ఇమేజ్‌ తెచ్చుకున్న స్టార్లు.. వెండితెరపై రారాజులుగా వెలుగొందుతూ ఉంటారు.

అమితాబ్‌బచ్చన్, షారుఖ్‌ఖాన్, అమీర్‌‌ఖాన్, కమల్‌హాసన్ కూడా ఈ లిస్ట్‌లో ఉంటారు. వెండితెరపై వాళ్లు కనిపిస్తే అభిమానులు రచ్చరచ్చ చేస్తుంటారు. వాళ్లను ఒక్కసారి చూడడానికి ఎంతో తపిస్తుంటారు. అటువంటి స్టార్లు బుల్లితెరపై కనిపిస్తే ఇక, వాళ్ల ఆనందానికి అవధులే ఉండవు.

అన్ని భాషల్లోని స్టార్లకు అభిమానులు ఉంటారు. అయితే వారందరిలోనూ టాలీవుడ్‌ స్టార్లకు ఉండే అభిమానులు.. వారి అభిమానం చాలా ప్రత్యేకం. తమ టాలెంట్‌తో వెండితెరపై ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్లు అభిమానుల కోసం బుల్లితెరపైనా కార్యక్రమాలు చేస్తున్నారు. వారిలో టాలీవుడ్‌ (Tollywood) స్టార్ల వివరాలు పింక్‌విల్లా ఫాలోవర్స్‌ కోసం ప్రత్యేకం.

వెండితెరపై సందడి చేస్తూనే బుల్లి తెరపై జరిగే షోలకు హోస్ట్ చేస్తూ అలరిస్తున్నా టాలీవుడ్ (Tollywood) స్టార్లు

బాలకృష్ణ (BalaKrishna) :

నందమూరి నటసింహం బాలకృష్ణ.. మాస్, యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. నందమూరి తారకరామారావు గారి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన  బాలయ్య.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. సినిమాలతోనే ప్రేక్షకులను అలరించాలని చాలాకాలం పాటు ప్రకటనలకు కూడా దూరంగా ఉన్నారు. ఇటీవలే ఒక యాడ్‌లో కనిపించారు బాలయ్య.

ఇక, బాలకృష్ణ ఇటీవలే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు. అన్‌స్టాపబుల్‌ టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షో మొదటి సీజన్ పూర్తి కాగా.. ఇటీవలే రెండో సీజన్ మొదలైంది. మొదటి సీజన్‌లో బాలయ్య (BalaKrishna) చేసిన సందడికి ఆ షోకు భారీ టీఆర్పీ వచ్చింది.

వెండితెరపై సందడి చేస్తూనే బుల్లి తెరపై జరిగే షోలకు హోస్ట్ చేస్తూ అలరిస్తున్నా టాలీవుడ్ (Tollywood) స్టార్లు

చిరంజీవి (Chiranjeevi)

మెగాస్టార్ చిరంజీవి.. ఇండస్ట్రీలో బ్యాకప్ ఎవరూ లేకుండా ఎదిగిన హీరో. సినిమాలతోపాటు సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒక పక్క సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోకి వెళ్లారు. అనంతరం రాజకీయాలకు గుడ్‌బై చెప్పి.. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి అభిమానులను అలరిస్తున్నారు.

ఇక, హీరోగా వెండితెరపైనే కాకుండా బుల్లి తెరపై కూడా చిరు సందడి చేశారు. మీలో ఎవరు కోటీశ్వరుడు రెండో సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించారు. తన స్టైల్‌ నవ్వు, డైలాగ్‌ డిక్షన్‌తో బుల్లి తెర ప్రేక్షకులను కూడా అలరించారు చిరు (Chiranjeevi).

వెండితెరపై సందడి చేస్తూనే బుల్లి తెరపై జరిగే షోలకు హోస్ట్ చేస్తూ అలరిస్తున్నా టాలీవుడ్ (Tollywood) స్టార్లు

నాగార్జున (Nagarjuna) :

దాదాపు 30 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నారు నాగార్జున. టాలీవుడ్ మన్మథుడిగా అభిమానులను అలరిస్తున్న నాగ్.. ప్రస్తుతం వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎంత జోష్‌గా సినిమాల్లో నటించేవారో అదే సరదా, ఎనర్జీతో ఇప్పటికీ ఉంటారు కింగ్ నాగార్జున.

తెలుగుతోపాటు హిందీ సినిమాల్లోనూ నటించిన నాగార్జున.. బుల్లితెరపై కూడా సందడి చేస్తున్నారు. మీలో ఎవరు కోటీశ్వరుడు షోతో బుల్లితెరపైకి అడుగుపెట్టిన నాగ్.. బిగ్‌బాస్‌ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షో పాపులర్ కావడానికి నాగార్జున (Nagarjuna) ఇమేజ్‌ కూడా ప్రధాన కారణం.

వెండితెరపై సందడి చేస్తూనే బుల్లి తెరపై జరిగే షోలకు హోస్ట్ చేస్తూ అలరిస్తున్నా టాలీవుడ్ (Tollywood) స్టార్లు

జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) :  

యాక్షన్, మాస్ సినిమాలలో నటిస్తూ యంగ్‌టైగర్‌‌గా పేరు తెచ్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. తన నటన, డాన్స్, డైలాగ్స్‌తో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న తారక్.. ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌‌గా ఎదిగారు.

ఇండస్ట్రీలోని అందరు హీరోలతో సన్నిహితంగా ఉంటూ మంచి పేరు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్.. మాస్ డైలాగ్స్, యాక్షన్ సీన్లతో వెండితెరపై చేసే హడావిడి అంతాఇంతా కాదు. బుల్లితెరపై కూడా తారక్‌ సందడి చేశారు. ఎవరు మీలో కోటీశ్వరులు, బిగ్‌బాస్‌ షోలకు హోస్ట్‌గా వ్యవహరించి ప్రేక్షకులను వినోదాన్ని పంచారు జూనియర్‌‌ ఎన్టీఆర్‌‌ (Junior NTR).

వెండితెరపై సందడి చేస్తూనే బుల్లి తెరపై జరిగే షోలకు హోస్ట్ చేస్తూ అలరిస్తున్నా టాలీవుడ్ (Tollywood) స్టార్లు

నాని (Nani) :

అసిస్టెంట్ డైరెక్టర్‌‌గా ఇండస్ట్రీలోకి వచ్చారు నాని. అష్టా చమ్మా సినిమాతో హీరోగా మారి.. వరుస విజయాలతో నేచురల్‌ స్టార్‌‌గా ఎదిగారు. తన నటనతో పక్కింటి కుర్రాడు ఇమేజ్‌ను సొంతం చేసుకున్న నాని సంవత్సరానికి రెండుమూడు సినిమాలు చేస్తే వెండితెరపై ప్రేక్షకులను అలరిస్తున్నారు.

నాని కూడా బుల్లి తెరపై కొన్నాళ్లు సందడి చేశారు. బిగ్‌బాస్‌ సీజన్‌2కి హోస్ట్‌గా చేశారు. కంటెస్టెంట్లలో జోష్‌ నింపుతూనే బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించారు నాని (Nani)

వెండితెరపై సందడి చేస్తూనే బుల్లి తెరపై జరిగే షోలకు హోస్ట్ చేస్తూ అలరిస్తున్నా టాలీవుడ్ (Tollywood) స్టార్లు

రానా దగ్గుబాటి (Rana Daggubati) :

దగ్గుబాటి రామానాయుడు మనవడు, సురేష్‌బాబు కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చారు రానా. హీరోగానే కాకుండా విలన్‌గా, క్యారెక్టర్‌‌ నచ్చితే గెస్ట్‌ రోల్స్‌లో కూడా చేసి ప్రేక్షకులను అలరిస్తుంటారు రానా. తెలుగు సినిమా వైభవాన్ని దేశవ్యాప్తం చేసిన బాహుబలి సినిమాలో భల్లాలదేవుడి క్యారెక్టర్‌‌లో రానా నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి.

వెండితెరపై హీరోగా, విలన్‌ క్యారెక్టర్లు చేస్తూనే నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు రానా. వెండితెరపై చేస్తున్న సందడికి తోడు బుల్లితెరపై కూడా అల్లరి చేశారు. నెం.1 యారి అనే షోకు హోస్ట్‌గా చేశారు. ఈ షోలో సెల్రబిటీలతో సరదాసరదా ఆటలతో అలరించారు రానా దగ్గుబాటి (Rana Daggubati).

వెండితెరపై సందడి చేస్తూనే బుల్లి తెరపై జరిగే షోలకు హోస్ట్ చేస్తూ అలరిస్తున్నా టాలీవుడ్ (Tollywood) స్టార్లు

అలీ (Ali) :

చిన్నతనం నుంచి సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు అలీ. కమెడియన్‌, హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా నటించి ప్రేక్షకులను అలరించిన అలీ.. నిర్మాతగా మారి సినిమాలు కూడా తీశారు. తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తూ వెండితెరపై సందడి చేస్తున్నారు అలీ.

ఇక, కొన్నేళ్లుగా వెండితెరపైనే కాకుండా బుల్లి తెరపై కూడా అలీ తన కామెడీతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు. అలీతో జాలీగా, అలీ 369, అలీతో సరదాగా కార్యక్రమాలకు యాంకర్‌‌గా వ్యవహరిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు అలీ (Ali)

వెండితెరపై సందడి చేస్తూనే బుల్లి తెరపై జరిగే షోలకు హోస్ట్ చేస్తూ అలరిస్తున్నా టాలీవుడ్ (Tollywood) స్టార్లు

సాయికుమార్ (SaiKumar) :

డైలాగ్‌ కింగ్‌గా అందరికీ సుపరిచితులు సాయికుమార్. హీరోగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పాపులర్ అయ్యారు. పోలీస్‌ స్టోరీ సినిమాతో పోలీస్ క్యారెక్టర్లకు కేరాఫ్‌గా మారిన సాయికుమార్‌‌ వెండితెరపై పవర్‌‌ఫుల్ క్యారెక్టర్లు ఎన్నో చేసి ప్రేక్షకులను అలరించారు.

వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూనే అడపాదడపా వైవిద్యభరితయైన విలన్‌ పాత్రలను కూడా పోషిస్తున్నారు సాయికుమార్. బుల్లితెరపై కూడా సందడి చేస్తున్నారు. వావ్‌ 1, 2, 3 సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా రన్‌ చేసిన సాయికుమార్ (SaiKumar).. మనం అనే షోకు కూడా హోస్ట్‌గా చేశారు.

Read More : TOLLYWOOD CELEBS : టాలీవుడ్‌లో వీళ్లిద్దరి మధ్య బంధుత్వం ఉందని మీకు తెలుసా!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!