Telugu Biggboss: బిగ్ బాస్ హోస్టింగ్ నుంచి తపుకుంటున్న నాగార్జున (Nagarjuna).. కొత్త హోస్ట్ ఎవరంటే?

Updated on Dec 19, 2022 04:00 PM IST
తాజాగా నాగార్జున సంచలన నిర్ణయం తీసుకున్నారట. బిగ్ బాస్ సీజన్ 7 నుంచి హోస్టింగ్ కు నాగార్జున (Nagarjuna) గుడ్ బై చెప్పినట్లుగా తెలుస్తోంది.
తాజాగా నాగార్జున సంచలన నిర్ణయం తీసుకున్నారట. బిగ్ బాస్ సీజన్ 7 నుంచి హోస్టింగ్ కు నాగార్జున (Nagarjuna) గుడ్ బై చెప్పినట్లుగా తెలుస్తోంది.

Telugu Biggboss: డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమవుతున్న తెలుగు బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రియాలిటీ షో కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే, తెలుగులో ఇప్పటివరకు ఈ షో ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. ఒక సీజన్ ఓటీటీ షోను కంప్లీట్ అయింది. ఇక, ఆరో సీజన్ నిన్నటితో పూర్తయింది.

ఇప్పటివరకు.. తెలుగు బిగ్ బాస్ షో తొలి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Junior NTR) హోస్ట్ గా వ్యవహరించగా.. రెండవ సీజన్ కు నాచురల్ స్టార్ నాని హోస్ట్ చేశారు. ఇక, మూడవ సీజన్ నుంచి వరుసగా నాగార్జుననే హోస్ట్ చేస్తూ వస్తున్నారు. తన వాక్ చాతుర్యంతో బాగానే అలరించాడు నాగార్జున. 

అయితే, తాజాగా నాగార్జున సంచలన నిర్ణయం తీసుకున్నారట. బిగ్ బాస్ సీజన్ 7 నుంచి హోస్టింగ్ కు నాగార్జున (Nagarjuna) గుడ్ బై చెప్పినట్లుగా తెలుస్తోంది. రాను రాను షో రేటింగ్‌ పడిపోతున్న నేపథ్యంలో నాగ్‌ తీసుకున్న ఈ నిర్ణయం ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీనికి తోడు బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్ల అన్‌ ఫెయిర్‌ ఎలిమినేషన్‌, మరికొన్ని అన్‌ ఫెయిర్‌ నిర్ణయాల విషయంలోనూ నాగ్ అసంతృప్తిగా ఉన్నారట.

అంతేకాకుండా నాగార్జునపై బోలెడన్ని విమర్శలు కూడా వచ్చాయి. బిగ్ బాస్ (Telugu Biggboss) మాటెత్తితే చాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడే సీపీఐ నారాయణ అయితే నాగార్జునపై దారుణమైన కామెంట్లు చేశారు. ఇదొక బూతు దందా, బిగ్ బాస్ అనేది బ్రోతల్ హౌస్ అంటూ రచ్చ రచ్చ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇకపై ఈషోకు వ్యాఖ్యాతగా వ్యవహరించబోనని తేల్చి చెప్పాడంటూ నెట్టింట వైరల్ అవుతోంది. 

ఈ నేపథ్యంలో.. బిగ్ బాస్ నిర్వాహకులు కొత్త హోస్ట్ ను వెతికే పనిలో పడింది. వచ్చే ఏడాది మధ్యలోనే ఈ కొత్త సీజన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి ఇప్పటి నుండి ఈ సీజన్ కోసం బిగ్ బాస్ టీమ్ కొత్త హోస్ట్ ను వెతుకుతున్నారని. టాలీవుడ్ కు చెందిన ఒక యువ హీరో ఈసారి హోస్ట్ గా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై మరికొన్ని రోజుల్లో కీలక అప్డేట్ రానుంది.

Read More: Biggboss Season6: బిగ్ బాస్ సీజన్ 6 కు శుభం కార్డు.. విన్నర్ గా సింగర్ రేవంత్ (Singer Revanth).. రన్నరప్ ఎవరంటే?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!