‘అన్ స్టాపబుల్ -2’ (Unstoppable 2) మూడో ఎపిసోడ్ కు గెస్టులుగా శర్వానంద్ (Sharwanand), అడివి శేష్ (Adivi Sesh)!

Updated on Oct 30, 2022 04:41 PM IST
త్వరలో టెలికాస్ట్ కాబోయే మూడో ఎపిసోడ్ కు టాలీవుడ్ యువ నటులు శర్వానంద్ (Sharwanand), అడివి శేష్ (Adivi Sesh) వచ్చి సందడి చేశారు. 
త్వరలో టెలికాస్ట్ కాబోయే మూడో ఎపిసోడ్ కు టాలీవుడ్ యువ నటులు శర్వానంద్ (Sharwanand), అడివి శేష్ (Adivi Sesh) వచ్చి సందడి చేశారు. 

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సెలబ్రిటీ టాక్ షో ‘అన్ స్టాపబుల్ -2’ (Unstoppable 2). దీనికి సంబంధించిన సీజన్ 1 గత ఏడాది పూర్తయింది. ఆ సీజన్ కి సూపర్ క్రేజ్ అయితే లభించింది. ఈ నేపథ్యంలో ఈ ఆన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 2 గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఇప్పటికే మొదటి ఎపిసోడ్ చంద్రబాబు, లోకేష్ తో కలిసి చేయగా దానికి అద్భుతమైన వ్యూస్ వచ్చాయి. 

తొలి ఎపిసోడ్ లో ఫ్యామిలీ విషయాలతో పాటు పొలిటికల్ అంశాలను కూడా చర్చించారు. దీంతో సహజంగానే ఆ ఎపిసోడ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక, ఆ ఎపిసోడ్ ప్రీమియర్ అయిన 24 గంటల్లోనే పది లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయని ఆహా ఓటీటీ (Aha OTT) వెల్లడించింది. ఆ తర్వాత కూడా మంచి వ్యూస్ దక్కించుకుంది. 

ఆ తర్వాత మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen), 'డీజేటిల్లు'తో (DJ Tillu) అలరించిన సిద్ధూ జొన్నలగడ్డ వచ్చిన ఎపిసోడ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇద్దరు యువ కథానాయకులతో.. బాలయ్య అల్లరి మామూలుగా లేదు. ఈ నేపథ్యంలో బాలయ్య ప్రస్తుతం మూడో ఎపిసోడ్‌తో రెడీ అయ్యారు. త్వరలో టెలికాస్ట్ కాబోయే మూడో ఎపిసోడ్ కు కూడా టాలీవుడ్ యువ నటులు అడవి శేష్, శర్వానంద్ వచ్చి సందడి చేశారు. 

శర్వానంద్ (Sharwanand), అడివి శేష్ (Adivi Sesh)... ఇద్దరూ తమ టాలెంట్‌తో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పైకి వచ్చిన యువ కథానాయకులు. ఇంకో కామన్ థింగ్ ఏంటంటే... ఇద్దరూ బ్యాచిలర్సే కావడం విశేషం. టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ తీస్తే వీళ్ళిద్దరి పేర్లు ఉంటాయి. వీరితో బాలకృష్ణ చేసిన సందడి త్వరలో స్ట్రీమింగ్ కానుంది.

ఇదిలా ఉంటే.. గత ఎపిసోడ్ లో నిర్మాత నాగవంశీ కూడా కనిపించగా ఈ సందర్భంగా ఆయన తన ఫోన్ నుంచి త్రివిక్రమ్ కు కాల్ చేసి బాలయ్యతో మాట్లాడించారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ (Trivikram) నందమూరి బాలకృష్ణ ఎప్పుడు షోకి వస్తున్నావు? అని అడిగితే ఇప్పుడు వచ్చేయమంటే వచ్చేస్తానని త్రివిక్రమ్ అంటే ఎవరితో రావాలో తెలుసుగా అని బాలయ్య అంటాడు. దీంతో తర్వాతి ఎపిసోడ్ కు పవన్ కళ్యాణ్ తో (Pawan Kalyan) రావాలని హింట్  ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇక, వీరిద్దరితో ఒక ఎపిసోడ్ ఉంటుందని అది ఈ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

Read More: "అన్ స్టాపబుల్ సీజన్2" (Unstoppable Season2) లో యంగ్ హీరోల కష్టాలు విని కంటతడి పెట్టిన బాలకృష్ణ (Balakrishna)!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!